Smart Gadgets: నేటి డిజిటల్ యుగంలో ఇళ్లను స్మార్ట్‌గా మార్చుకోవడం పెద్ద ఖర్చుతో కూడుకున్న పనేమీ కాదు. ఒకప్పుడు కేవలం ధనవంతుల ఇళ్లలోనే కనిపించే హోమ్ ఆటోమేషన్ ఫీచర్లు.. ఇప్పుడు సామాన్యుడి బడ్జెట్ పరిధిలోకి వచ్చేశాయి. కేవలం రూ.5,000 బడ్జెట్ లో రోజూవారీ జీవితాన్ని మరింత సులభతరం చేసే అద్భుతమైన 5 స్మార్ట్ హోమ్ గ్యాడ్జెట్ల గురించి ఈ కథనంలో అందించడం జరుగుతోంది. వాటి బెనిఫిట్స్ పై ఓ లుక్కేయండి.
స్మార్ట్ హోమ్ ను నిర్మించుకోవడానికి గట్టి పునాదిగా ఈ స్మార్ట్ స్పీకర్ ఉపయోగపడుతుంది. రూ. 3,500 నుండి రూ. 4,500 లోపు లభించే అమెజాన్ ఎకో డాట్ లేదా గూగుల్ నెస్ట్ మినీ ఇందుకు బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. దీని ద్వారా కేవలం మీ గొంతుతో (Voice Commands) ఇంట్లో ఉండే స్మార్ట్ బల్బులు, టీవీ, గీజర్ వంటి వాటిని నియంత్రించవచ్చు. పాటలు వినడం, అలారాలు పెట్టుకోవడం, ఉదయాన్నే వాతావరణ సమాచారం తెలుసుకోవడం వంటివి దీని సాయంతో చిటికెలో అయిపోతాయి.
కుటుంబ రక్షణ విషయంలో రాజీ పడకూడదనుకునే వారికి స్మార్ట్ కెమెరాలు వరం. కేవలం రూ. 1,500 నుండి రూ. 2,500 మధ్యలో లభించే టిపి-లింక్ టాపో (TP-Link Tapo) లేదా సిపి ప్లస్ (CP Plus) 360 డిగ్రీల హోమ్ కెమెరాలు ఇల్లు దాటి ఎక్కడికెళ్లినా భద్రతను అందిస్తాయి. దీనిలోని మోషన్ డిటెక్షన్ ఫీచర్ వల్ల ఇంట్లోకి ఎవరైనా వస్తే వెంటనే మీ మొబైల్‌కు అలర్ట్ వస్తుంది. అలాగే ఆఫీసులో ఉంటూనే ఇంట్లో ఉన్న పిల్లలతో లేదా వృద్ధులతో టూ-వే ఆడియో ద్వారా మాట్లాడవచ్చు.
ఇంట్లో ఉన్న పాత గీజర్, ఏసీ, వాటర్ ప్యూరిఫైయర్లను మార్చకుండానే వాటిని స్మార్ట్ గా తీర్చిదిద్దేందుకు స్మార్ట్ ప్లగ్స్ ఎంతగానో ఉపయోగపడతాయి. రూ. 800 నుండి రూ. 1,500 లోపు లభించే విప్రో లేదా ఓక్టర్ 16-ఆంపియర్ స్మార్ట్ ప్లగ్స్ ద్వారా సాధారణ హోమ్ అప్లయన్సెస్‌ను మొబైల్ యాప్ సహాయంతో ఎక్కడి నుండైనా ఆన్/ఆఫ్ చేయవచ్చు. అంతేకాకుండా ఉదయాన్నే గీజర్ ఆటోమేటిక్‌గా ఆన్ అయ్యేలా టైమర్ కూడా సెట్ చేసుకోవచ్చు. దీని ద్వారా విద్యుత్ ను భారీగా ఆదా చేసుకోవచ్చు.
టీవీకి ఒక రిమోట్, ఏసీకి ఒక రిమోట్, సెట్-టాప్ బాక్స్‌కు ఒక రిమోట్.. ఇలా రిమోట్లతో ఇళ్లంతా నిండిపోతూ ఉంటుంది. అయితే రూ. 1,000 నుండి రూ. 1,500 లోపు దొరికే ఒకే ఒక్క ‘స్మార్ట్ ఐఆర్ బ్లాస్టర్’తో వీటన్నింటికీ చెక్ పెట్టవచ్చు. ఇది ఇంట్లోని అన్ని రిమోట్లను మీ మొబైల్ ఫోన్‌లోకి మార్చేస్తుంది. కేవలం ఫోన్ స్క్రీన్ పై క్లిక్ చేయడం ద్వారా లేదా వాయిస్ కమాండ్స్ ద్వారా టీవీ, ఏసీలను ఆపరేట్ చేయవచ్చు.
Also Read: ఈ రెండు గ్యాడ్జెట్లు ఉంటే.. పాత ఏసీ కూడా స్మార్ట్‌గా మారిపోద్ది.. బోలెడంత పవర్ ఆదా!
తక్కువ ఖర్చులో ఇళ్లకు కొత్త లుక్ తీసుకురావడానికి స్మార్ట్ బల్బులు బాగా ఉపయోగపడతాయి. రూ. 600 నుండి రూ. 1,200 మధ్య లభించే విప్రో లేదా ఫిలిప్స్ స్మార్ట్ బల్బుల ద్వారా మన మూడ్‌కు తగ్గట్టుగా ఇంటి లైటింగ్ రంగులను మార్చుకోవచ్చు. చదువుకోవడానికి బ్రైట్ వైట్ లైట్, సినిమా చూసేటప్పుడు డిమ్ లైట్, రాత్రి వేళల్లో నైట్ ల్యాంప్.. ఇలా లక్షలాది రంగులను మొబైల్ యాప్ లేదా అలెక్సా ద్వారా కంట్రోల్ చేయవచ్చు.
Also Read: వినియోగదారుల కోర్టు మెుట్టికాయలు.. యాపిల్ దిగొచ్చింది.. ఐఫోన్ యూజర్ గెలిచాడు!