BigTV English

Pawan to visit Uppada beach: ఆ విషయంలో నాకు యువత సహకరించాలి: పవన్ కల్యాణ్

Pawan to visit Uppada beach: ఆ విషయంలో నాకు యువత సహకరించాలి: పవన్ కల్యాణ్

Pawan kalyan latest news today(Political news in AP): ఏపీలోని ఉప్పాడ తీరం కోతకు గురవుతున్నదని, దానిని ఎలా రక్షించుకోవాలనే అంశంపై క్షేత్రస్థాయిలో పర్యటన చేస్తానంటూ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. తన పర్యటన పూర్తయ్యేలా సహకరించాలంటూ యువతకు ఆయన రిక్వెస్ట్ చేశారు. తీరం కోత గురించి నిపుణుల బృందం అధ్యయనం చేస్తుందన్నారు. ఎక్కువమంది తెలుగువాళ్లు విదేశాల్లో ప్రస్తుతం సీఈవోలుగా ఉన్నారు.. మనదేశానికి, రాష్ట్రానికి సంబంధించిన యువత ప్రతిభను ఇక్కడే వినియోగించుకునేలా అవకాశాలు కల్పించాలన్నారు. శాస్త్రీయ పరిశోధనలను ప్రోత్సహించేలా చర్యలు చేపట్టాలని ఆయన పేర్కొన్నారు.


కాకినాడ కలెక్టరేట్ లో అధికారులతో మంగళవారం సమీక్ష నిర్వంహించారు. సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఆడపిల్లల భద్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తోందని తెలిపారు. ‘ఇటీవల తన కూతురు కిడ్నాప్ నకు గురైందని ఓ మహిళ నాకు ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ చేయాలని పోలీసులను ఆదేశించాను. పోలీసులు అద్భుతంగా పనిచేసి జమ్మూకాశ్మీర్ లో ఆ అమ్మాయి ఆచూకీని గుర్తించారు. 9 నెలల క్రితం కేసును కేవలం రెండ్రోజుల్లోనే ఛేదించారు. అక్కడి పోలీసుల సాయంతో ఆ యువతిని విజయవాడకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.

ఈ అంశాలను ఇప్పుడెందుకు ప్రస్తావిస్తున్నానంటే.. ప్రభుత్వం తలచుకుంటే ఏం చేయగలదు అని నిరూపించడానికే. గత ఐదేళ్లలో ఎంతమంది ఆడపిల్లలు అదృశ్యమైనా గత ప్రభుత్వం పట్టించుకోలేదు. ప్రస్తుత పాలనలో జరిగిన మార్పును ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది. ఇటు తల్లిదండ్రులు కూడా పిల్లల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఆడపిల్లల అదృశ్యంపైన పోలీస్ ఉన్నతాధికారులతో మాట్లాడి ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసేలా చూస్తా. రాష్ట్రంలో పోలీసుల సంఖ్యాబలం పెరగాల్సిన అవసరం ఉంది’ అంటూ పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.


Also Read: ప్రజా దర్బార్ లో వెల్లువెత్తిన వినతులు.. మంత్రికి క్యాబ్ డ్రైవర్ల రిక్వెస్ట్

ఇది ఇలా ఉంటే.. పిఠాపురంలో పర్యటించిన పవన్ కల్యాణ్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతినిత్యం ప్రజల కోసం పనిచేస్తానని హామీ ఇచ్చారు. తన గెలుపు కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అభివృద్ధిలో రాష్ట్రాన్ని అగ్రభాగాన నిలబెడుతామని పేర్కొన్నారు. పిఠాపురాన్ని ఇదివరకెన్నడూ లేని విధంగా అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు. అంతర్జాతీయ స్థాయిలో నియోజకవర్గాన్ని డెవలెప్ చేసిన తరువాతనే తనను ఊరేగించాలన్న విషయం తెలిసిందే.

Tags

Related News

CM Chandrababu: వరదలపై హై అలర్ట్.. సీఎం చంద్రబాబు డైరెక్ట్ ఆర్డర్స్.. అంతా అప్రమత్తం!

Bus accident: రాత్రి వేళ బస్సు బోల్తా… క్షణాల్లో కేకలు, అరుపులు.. ఎక్కడంటే?

Balakrishna warns: బాలకృష్ణ మాస్ వార్నింగ్… వేదికే కదిలిపోయింది!

Vijayawada beautification: విజయవాడకు కొత్త లుక్.. ఏపీ ప్రభుత్వం ప్లాన్ ఇదే!

Trolling On Jagan: కేంద్ర బలగాలతో ఎన్నికలు.. జగన్ ని కామెడీ పీస్ చేసేశారుగా?

Heavy rain alert: 48 గంటల పాటు దంచుడే.. ఏపీలోని ఆ జిల్లాలకు భారీ వర్ష సూచన!

Big Stories

×