E-Paper
Advertisement

Naralokesh : తప్పు ఎవరు చేసినా తప్పే.. నారా లోకేశ్ క్లియర్ మెసేజ్!

Naralokesh : తప్పు ఎవరు చేసినా తప్పే.. నారా లోకేశ్ క్లియర్ మెసేజ్!
Advertisement

ఏపీలో అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్న వేళ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఏపీలో బడ్జెట్ సెషన్స్ జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రతిపక్ష వైసీపీ పార్టీ నేతలు సమావేశాలకు తీవ్ర అంతరాయం కలిగిస్తున్నారు. వైసీపీకి ప్రతిపక్ష హోదా కల్పించాలని డిమాండ్ చేయడంతో పాటు స్పీకర్ చాంబర్ వద్దకు దూసుకెళ్లి నిరసన ప్రదర్శనలు చేపడుతున్నారు. సమావేశాలు ప్రారంభం నుంచే వైసీపీ నేతలు నిరసనలు, ఆందోళనలు చేపడుతున్నారు. బడ్జెట్‌కు ముందు ఆనవాయితీగా వస్తోన్న గవర్నర్ ప్రసంగానికి సైతం వారు అడ్డు తగిలారు. తమకు ప్రత్యేక హోదా ఇవ్వడంతో పాటు రాష్ట్రంలో వైసీపీ నేతలు, మాజీ మంత్రులు, వారి ఇండ్ల పై జరిగిన దాడులపై చర్చ జరపాలని డిమాండ్ చేస్తున్నారు.

సభలో నానా రభస..

అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం తర్వాత సైతం వైసీపీ నేతలు చర్చ జరపకుండా అదే తీరును కొనసాగించడంతో స్పీకర్ అయ్యన్న పాత్రుడు వారి మీద సీరియసీ అయ్యారు. అయినప్పటికీ వారితీరులో ఎటువంటి మార్పు కనిపించకపోవడంతో మంత్రులు సైతం వైసీపీ నేతల తీరుపై మండిపడుతున్నారు. సభలో వైసీపీ శ్రేణుల ఆందోళన నడుమ బడ్జెట్ సెషన్స్ కొనసాగుతున్నాయి. ప్రభుత్వం వారిని పట్టించుకోకపోవడంతో మరోసారి వైసీపీ నేతలు సెషన్స్‌ను బాయ్ కాట్ చేసే యోచనలో ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే ఒకసారి సభ మధ్యలోనే వైసీపీ నేతలు బయటకు వెళ్లిపోయిన విషయం తెలిసిందే.

రెడ్ బుక్ రాజ్యంగం..

Advertisement

ముఖ్యంగా రాష్ట్రంలో కక్ష పూరిత రాజకీయాలు కొనసాగుతున్నాయని.. లడ్డూ కల్తీ పేరిట ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తున్నదని వైసీపీ ఆరోపిస్తున్నది. అది తప్పని ప్రశ్నిస్తే దాడులకు తెగబడుతున్నారని..రాష్ట్రంలో మంత్రి నారాలోకేశ్ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని వైసీపీ ఆరోపిస్తున్నది.తాజాగా దీనిపై మంత్రి నారాలోకేశ్ ఘాటుగా స్పందించారు. రాష్ట్రంలో తప్పు చేస్తే ఎవరికైనా ఒకేలా శిక్ష ఉంటుందని ఆయన స్పష్టంచేశారు. సీఎం కుటుంబీకుల మీద కామెంట్స్ చేస్తే ఊరుకునేది లేదని స్పష్టంచేశారు. తప్పు చేస్తే ఎవరైనా శిక్ష సేమ్ అన్నారు. గతంలో వైఎస్ జగన్ సతీమణి భారతి మీద తెలుగుదేశం కార్యకర్త కామెంట్స్ చేస్తే అతనికి శిక్ష విధించామని గుర్తుచేశారు.అదేవిధంగా ఎవరైనా మాట్లాడేముందు, విమర్శలు చేసే ముందు ఆలోచించి చేయాలన్నారు.

Komatireddy Rajgopal Reddy: మంత్రిని కాకపోతే ముఖ్యమంత్రిని అవుతా.. రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

Advertisement

ఇక వైసీపీ నేతల మీద దాడులకు సైతం మంత్రి తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు.సీఎం చంద్రబాబు తల్లిదండ్రులను అవమానించిన వారికి తెలుగు తమ్ముళ్లు బుద్దిచెప్పారని.. వారికి తాము ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేదని.. తమ నాయకుడిని తిట్టినందుకు వారు ఆగ్రహంతో అలా చేశారని స్పష్టంచేశారు.వైసీపీ నేతలకు మాజీ సీఎం జగన్ కంట్రోల్ లో పెట్టుకోవాలని ఈ సందర్భంగా సూచించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యయుతంగా పాలన కొనసాగుతోందని అన్నారు. కావాలనే వైసీపీ నేతలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని, ఫలితంగా రాష్ట్రంలో అశాంతిని రేకెత్తించి గందరగోల పరిస్థితులు క్రియేట్ చేయాలని చూస్తున్నారని మంత్రి నారాలోకేశ్ వెల్లడించారు. గత ప్రభుత్వంలో మాదిరిగా తాము రౌడీ రాజకీయాలు చేయడం లేదని తెలిపారు. అలాంటి పరిస్థితులు కూటమి సర్కార్ హయాంలో లేవని క్లారిటీ ఇచ్చారు.

Related News

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

Big Stories

Advertisement
×