E-Paper
Advertisement

NTR, JAGAN : నాడు మల్లెల బాబ్జీకి ఎన్టీఆర్ క్షమాభిక్ష.. నేడు శ్రీనును జగన్ క్షమిస్తారా..?

NTR, JAGAN : నాడు మల్లెల బాబ్జీకి ఎన్టీఆర్ క్షమాభిక్ష.. నేడు శ్రీనును జగన్ క్షమిస్తారా..?
Advertisement

NTR, JAGAN : ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్టీఆర్ పై మల్లెల బాబ్జి అనే దళిత యువకుడు దాడి చేశాడు. ఆయనపై చాకుతో దాడి చేశాడు. అప్పుడు ఎన్టీఆర్‌ స్వయంగా కోర్టుకు వచ్చి వాంగ్మూలం ఇచ్చారు. బాబ్జికి క్షమాభిక్ష పెట్టమని అభ్యర్థించారు. దీంతో దాడి కేసు నుంచి మల్లెల బాబ్జీ బయట పడ్డాడు. కోడికత్తి కేసు విషయంలో నిందితుడు శ్రీనివాసరావు కూడా దళితుడే. ఈ కేసుపై మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

కోడికత్తి కేసు నిందితుడు శ్రీను విషయంలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి స్పందించాలని హర్షకుమార్ కోరారు. రాజమండ్రి కారాగారంలో తాను ఉన్నప్పుడు శ్రీను తరచూ తనను కలిసేవాడని తెలిపారు. ఎలాగైనా తాను రాసిన ఉత్తరం బయట పెట్టించండి. నా నిజాయతీ తెలుస్తుంది. నిజంగా జగన్‌ అభిమానిని. జగన్‌కు సింపతీ వస్తుందని.. ఆయన కుటుంబ సభ్యుడిగా గుర్తిస్తారనే దృష్టితోనే దాడి చేశానని చెప్పాడని హర్షకుమార్‌ ట్వీట్‌లో పేర్కొన్నారు.

Advertisement

సీఎం జగన్ తీరుపై హర్షకుమార్ విమర్శలు చేశారు. నాడు ఎన్టీఆర్ మాదిరిగా జగన్‌ వ్యవహరించడంలేదని మండిపడ్డారు. సీఎం కోర్టుకు రావడానికి ఇష్టపడటం లేదన్నారు. మరోవైపు కుట్ర కోణంలో దర్యాప్తు చేయమంటున్న విషయాన్ని గుర్తు చేశారు. శ్రీను రాసిన లెటర్‌ను ఎన్‌ఐఏ తక్షణం బయట పెట్టాలని హర్షకుమార్ డిమాండ్ చేశారు. జగన్‌ కోర్టుకు వెళ్లి కోడి కత్తితో దాడి చేసిన శ్రీనివాసరావుకు క్షమాభిక్ష ప్రసాదించాలని హర్షకుమార్ కోరారు. మరి నాడు ఎన్టీఆర్ మాదిరిగా జగన్ నిర్ణయం తీసుకుంటారా..? కోర్టుకు హాజరై నిందితుడిని క్షమించేస్తారా..?

Related News

విజయసాయిరెడ్డి కీలక నిర్ణయం.. రాజకీయ పార్టీపై సోమవారం ప్రకటన, ఏపీ రాజకీయాల్లో…

ఆ దూడ తపన.. అమ్మ బొమ్మ నుండి పాలు తాగడానికి ప్రయత్నం, వీడియో వైరల్

బిగ్‌ టీవీ ఎఫెక్ట్.. ఏపీ డీఎస్సీ స్కామ్ బట్టబయలు, ఎస్జీటీ ప్రభాకర్‌పై ఎంక్వైరీకి ఆదేశం

తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాలు, లారీని ఢీ కొన్న ట్రావెల్ బస్సు, స్సాట్‌లో 15 మంది

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం? ఏపీకి వర్ష సూచన, అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ

మీ భయానికి నిదర్శనం కాదా? బిగ్‌టీవీ సోషల్ మీడియాపై ఆంక్షలు ఎందుకు?- మాజీమంత్రి రోజా ప్రశ్న

ఇంకా దాగుడు మూతలు ఎందుకు.. చంద్రబాబు, నారా లోకేష్ పై నిప్పులు చెరిగిన జగన్!

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

Big Stories

Advertisement
×