BigTV English

KURNOOL: లాడ్జిలో మహిళ దారుణ హత్య.. వ్యక్తి ఆత్మహత్య.. కారణం?

KURNOOL: లాడ్జిలో మహిళ దారుణ హత్య.. వ్యక్తి ఆత్మహత్య.. కారణం?

Kurnool: వివాహేతర సంబంధం నేపథ్యంలో మహిళను హతమార్చి ఆపై ఒక వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శనివారం ఉదయం కర్నూలు జిల్లా నందికొట్కూరులో జరిగింది. కర్నూలు త్రీ టౌన్ సీఐ మురళీధర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. నందికొట్కూరులో విజయ్ కూమార్(35) అనే వ్యక్తి హౌసింగ్ బోర్డు కాలనీలో నివాసం ఉంటూ ఓ ప్రైవేటు కంపేనీలో అకౌంటెంట్ ‌గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో రుక్సాన అనే మహిళతో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. వీరి విషయం రుక్సాన కుటుంబంలో తెలియడంతో గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి.


ఈ నేపథ్యంలో శుక్రవారం విజయకుమార్ , రుక్సానాతో కలిసి కర్నూలులో ని ఓ లాడ్జిలో గదిని అద్దెకు తీసుకున్నాడు. శనివారం ఉదయం ఎంత సేపటికీ గది తలుపులు తీయకపోవడంతో లాడ్జి సిబ్బందికి అనుమానం వచ్చి తలుపులు పగలగొట్టారు. గదిలో రుక్సానా, విజయ్ కుమార్ మృతి చెంది ఉన్నారు. మహిళ మృతదేహంపై కత్తిపోట్లు ఉండటంతో విజయకుమార్ మొదట ఆమెను కత్తితో పొడిచి.. తర్వాత అతను విషం తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి, కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు.


Related News

AP Free Bus Scheme: ఆగస్ట్ 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం – స్త్రీశక్తి పథకంపై సీఎం సమీక్ష

AP Asha Workers: ఆశా వర్కర్లకు ఏపీ సర్కార్ బంపర్ ఆఫర్.. ఆరోగ్యం, భవిష్యత్తు భరోసా!

Pulivendula ZPTC: ఏపీ పాలిటిక్స్ @ పులివెందుల

Vontimitta By Election: ఓంటిమిట్ట ఉప ఎన్నికల్లో ఉద్రిక్తత.. చిన్నకొత్తపల్లి బూత్‌లో ఘర్షణ

East Godavari News: కాసేపట్లో పెళ్లి.. మొదటి భార్యతో పెళ్లికొడుకు పరార్‌, అసలు మేటరేంటి?

Pulivendula ByPoll: పులివెందులలో పోలింగ్.. నన్ను బంధించారన్న వైసీపీ అభ్యర్థి, జగన్ ఖర్చు రూ100 కోట్లు

Big Stories

×