Women swimmer: ఏదైనా సాధించాలనే పట్టుదల ఉండాలే కానీ, అనుకున్న లక్ష్యం కచ్చితంగా నెరవేరుతుంది. మొదట్లో కాస్త కష్టమనిపించినా, దగ్గరకు వచ్చేసరికి టార్గెట్ మరింత చిన్నదైపోతోంది. ఇందుకు ఎగ్జాంఫుల్ పైన కనిపిస్తున్న శ్యామల. ఐదు పదుల వయసులో తాను అనుకున్న టార్గెట్‌ని చేధించింది.. సక్సెస్ అయ్యింది. ఇంతకీ అనేది తెలియాలంటే స్టోరీపై ఓ లుక్కేద్దాం.
కనిపిస్తున్న మహిళా స్విమ్మర్ పేరు గోలి శ్యామల. ఆమె వయస్సు 52 ఏళ్లు. చిన్నప్పటి నుంచి ఆమెకు స్విమ్మింగ్ చేయడమంటే మహా ఇష్టం. అందుకోసం ఆమె పడిన కష్టం అంతా ఇంతా కాదు. తాను చేస్తున్న దానికి ఫలితం దక్కాలని భావించింది.. అందుకు టార్గెట్‌ని నిర్థేశించుకుంది. అనుకున్నట్లుగానే సక్సెస్ అయ్యింది.
గోలి శ్యామల తన సాహనయాత్ర సక్సెస్‌గా పూర్తి చేసింది. డిసెంబర్ 28న విశాఖపట్నం బీచ్ నుండి కాకినాడ వరకు సముద్రంలో 150 కిలో మీటర్ల వరకు స్విమ్ చేసింది. జనవరి మూడున అనుకున్న టార్గెట్ కు చేరుకుంది. కాకినాడ రూరల్ సూర్యారావు పేట ఎన్టీఆర్ బీచ్‌లో స్విమ్మర్‌కు అధికారులు, ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు.
గతంలో తమిళనాడు రామసేతు ప్రాంతంలో స్విమ్మింగ్ చేసింది శ్యామల. ఇంత దూర ప్రాంతం చేయటం ఇదే మొదటి సారి. ఆ తరహా టార్గెట్‌ను ప్రపంచ వ్యాప్తంగా కేవలం నలుగురు లేదా ఐదుగురు మాత్రమే ఉంటారు. వారిలో శ్యామలా కూడా ఒకరు.
ALSO READ: విజయసాయి రెడ్డికి ఈడీ నోటీసులు
ఇంతటి సాహసోమేతమైన యాత్రలో వెన్నంటి ఉండి ప్రోత్సహించిన రెడ్ క్రాస్ ఛైర్మన్ రామారావు, కే.ఎస్.పి.ఎల్ ప్రతినిధి రామ్మోహన్.. అలాగే వైద్యులకు, సహాయ సహకారాలు అందించిన సిబ్బందికి మత్స్యకారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది శ్యామల.
విశాఖ సముద్ర తీరం నుంచి బయలుదేరిన స్విమ్మర్ శ్యామల, రోజుకు 30 కిలోమీటర్ల చొప్పున ఈదుకుంటూ వెళ్లేది. మూడు తారీఖు అనగా శుక్రవారం ఎన్టీఆర్ బీచ్‌లో స్విమ్మర్ శ్యామలకు ఎమ్మెల్యే చినరాజప్ప, కాకినాడ మున్సిపాల్ కమిషనర్ భావన స్వాగతం పలికారు.
స్విమ్మింగ్ సమయంలో తనకు ఎదురైన అనుభవాలను గుర్తు చేసింది శ్యామల. తాబేళ్లు దగ్గరగా వచ్చి వెళ్ళటం చూశానని, సముద్ర జలాలు కలుషితం కావడంవల్ల తాబేలు మృత్యువాత పడిన దృశ్యాలు చూశానని తనని ఎంతో కలచి వేసిందన్నారు. కాలుష్యాన్ని నివారించి పర్యావరణ కాపాడాలని ప్రభుత్వాన్ని కోరారామె.
కాకినాడ జిల్లా సామర్లకోటలో ఉంటున్న శ్యామల, తానిప్పటి వరకు కాకినాడ బీచ్ కి రాలేదని వైజాగ్ నుండి కాకినాడ తీరానికి ఎంచుకోవడం వెనుక ఇదే ప్రధాన కారణమని వెల్లడించింది. కాకినాడ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చెందడానికి ఆ తరహా సాహస యాత్రలు చేయడానికి చాలామంది ముందుకు వచ్చే అవకాశముందని మనసులోని మాట బయటపెట్టింది శ్యామల.
52 ఏళ్ల వయసులో 150 కి.మీ. ఈదిన మహిళ..
ఒడిస్సీ ఓషన్ స్విమ్మింగ్ సంస్థ ఆధ్వర్యంలో గత నెల 28న శ్యామల సాహసయాత్ర
విశాఖ సముద్రతీరం నుంచి కాకినాడ తీరం వరకు రోజుకు 30 కిలోమీటర్ల చొప్పున 150 కి.మీ. ఈదిన మహిళ
శుక్రవారం కాకినాడ గ్రామీణం సూర్యారావుపేట తీరానికి చేరుకున్న శ్యామల pic.twitter.com/eioF9NDpVP
— BIG TV Breaking News (@bigtvtelugu) January 4, 2025