Rohit sharma Retirement: బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ మూడవ టెస్ట్ అనంతరం స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ టెస్ట్ ఫార్మాట్ కి రిటైర్మెంట్ ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే గత కొంతకాలంగా కెప్టెన్సీలో, బ్యాట్ తోను రాణించలేకపోతున్న కెప్టెన్ రోహిత్ శర్మ కి షాక్ ఇస్తూ సిడ్ని వేదికగా జరుగుతున్న ఐదవ టెస్ట్ కి రోహిత్ ని పక్కన పెట్టారు సెలక్టర్లు.
Also Read: Ind vs Aus 5th Test Day 2: ఆసిస్ కి బిగ్ షాక్.. కుప్పకూలిన టాప్ ఆర్డర్!
ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ ఇక ఈ సిరీస్ తర్వాత రిటైర్మెంట్ ప్రకటించబోతున్నాడని పెద్ద ఎత్తున న్యూస్ వైరల్ అయ్యాయి. ఈ విషయంపై మాజీ క్రికెటర్లు కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. అయితే రోహిత్ శర్మ ఈ చివరి టెస్ట్ నుంచి తనంతట తానే తప్పుకున్నాడా..? లేక తప్పించారా..? అనే విషయం ప్రశ్నార్ధకంగా మారింది. కోచ్ గౌతమ్ గంభీర్ కావాలనే రోహిత్ ని పక్కన పెట్టారా..? అనే వార్త చెక్కర్లు కొట్టింది.
ఈ నేపథ్యంలో ఐదవ టెస్ట్ తొలి ఇన్నింగ్స్ రెండవ రోజు లంచ్ విరమంలో రోహిత్ {Rohit sharma Retirement} తన రిటైర్మెంట్ పై కీలక ప్రకటన చేశాడు. లంచ్ విరామం సమయంలో బ్రాడ్కాస్టింగ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రోహిత్ శర్మ మాట్లాడుతూ.. తనంతట తానే బెంచ్ కి పరిమితం కావాలని అనుకున్నట్లు వెల్లడించాడు. తన ఫామ్ కారణంగానే తనంతట తానే ఈ నిర్ణయం తీసుకున్నానని.. తనని ఎవ్వరూ తప్పించలేదని క్లారిటీ ఇచ్చాడు. తాను రిటైర్ కావడంలేదని స్పష్టం చేశాడు రోహిత్ శర్మ.
” పెర్త్ టెస్ట్ లో కేఎల్ రాహుల్ – యశస్వి జైస్వాల్ డబుల్ సెంచరీ భాగస్వామ్యంతో మ్యాచ్ విజయంలో కీలకపాత్ర పోషించారు. ఆ జోడిని మార్చకూడదనే ఉద్దేశంతో.. జట్టు ప్రయోజనాలే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్న. ఎవరో బయట కూర్చుని నా రిటైర్మెంట్ ని డిసైడ్ చేయడం ఏమిటి. కేవలం ఈ 5వ టెస్టు నుంచి మాత్రమే తప్పుకున్నాను. టీం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నాను. నేను ఫామ్ లో లేనని కోచ్ గంభీర్ కి ముందే తెలియజేశాను. నేను ఫామ్ లోకి రావడానికి ఎంతగానో కష్టపడుతున్నాను. కానీ సాధ్యం కావడం లేదు.
Also Read: Washington Sundar: ఆసీస్ తో అంపైర్లు ఫిక్సింగ్… సుందర్ వికెట్ పై కొత్త వివాదం!
అందుకే సిడ్నీ టెస్ట్ నుంచి తప్పుకున్నాను. ఇది చాలా కఠినమైన నిర్ణయం. ఇక బుమ్రా నాయకత్వం చాలా బాగుంది. నేను ఇద్దరూ పిల్లల తండ్రిని. పిచ్చివాడిని కాదు” అంటూ తన రిటైర్మెంట్ పై కీలక వ్యాఖ్యలు చేశాడు {Rohit sharma Retirement} రోహిత్ శర్మ. ఇక రోహిత్ రిటైర్మెంట్ తీసుకోవడం లేదని తెలిసిన ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. త్వరగా ఫామ్ లోకి వచ్చి అందరికీ సమాధానం చెప్పాలని కామెంట్స్ చేస్తున్నారు.