Satyabhama Today Episode January 4th : నిన్నటి ఎపిసోడ్ లో.. నందిని సపోర్ట్ చేస్తుంది అన్న విషయం తెలుసుకున్న సత్య సంబరపడిపోతుంది. నీ వెళ్ళగానే సత్య దగ్గరికి మహదేవయ్య వచ్చి ఒకరు సపోర్ట్ చేస్తారని సంబరపడిపోకు నీకు ఇంకా తొమ్మిది మంది కావాలి అది గుర్తుపెట్టుకో కోడలా అని కౌంటర్ ఇస్తాడు. దానికి సత్య హిరణ్యకశిపుడు అనే కథ చెప్తుంది. హిరణ్యకశిపుడు దేవుని నాకు చావు ఉండకూడదని కోరుకున్నాడు కానీ నరసింహ అవతారంలోని దేవుడు అతని చంపేశాడు అనగానే ఇద్దరు కాసేపు గొడవ పెట్టుకుంటారు. అది చూద్దాం నువ్వు ఎలక్షన్స్ లో ఎలా నిలబడతావని మహదేవయ్యా చాలెంజ్ చేస్తాడు. ఇక నందిని కోసం హర్ష వాళ్ళ ఫ్యామిలీ ఎదురు చూస్తుంటారు. ఎక్కడికి కెళ్ళావని అడుగుతారు. మా పుట్టింటికి వెళ్ళొచ్చానని నందిని అంటుంది. నువ్వు ఎక్కడికి వెళ్ళినా చెప్పేస ఎల్లుండొచ్చు కదా ఇంత టెన్షన్ పడే వాళ్ళు కాదు కదా అని విశాలాక్షి అంటుంది. నందిని చెప్పిన నిజం విని షాక్ అవుతుంది. ఇంట్లో వాళ్లంతా నందినిని తిడతారు. విశాలాక్షి మాత్రం సత్యను మహాదేవయ్య చంపేస్తాడని టెన్షన్ పడుతుంది. సత్యకు సపోర్ట్ చెయ్యకూడదు అని అంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. విశాలాక్షి భయంతో ఇంట్లో అందరిని కంట్రోల్ చేస్తుంది. సత్యకు సపోర్ట్ చెయ్యొద్దని అందరి దగ్గర మాట తీసుకుంటుంది. ఇక దానికి నందిని నన్ను క్షమించండి అంటుంది. మా బాపుని కంట్రోల్ చేయాల్సింది వదిన ఒక్కటే ఆ ధైర్యం వదినకు మాత్రమే ఉంది అందుకే నేను వదినని సపోర్ట్ చేస్తున్నాను ఇక మీ ఇష్టం అనేసి అందరికీ చెప్పి వెళ్తుంది.. ఇక సత్యా ఉదయం లేవగానే మహదేవయ్య కాళ్ళు మొక్కి బయటకు రావడానికి వస్తుంది. ఎక్కడికి పోతున్నావ్ ఇంత పొద్దున్నే తయారైపోతున్నావని భైరవి అడిగితే నవగ్రహాల కోసం అనేసి మహాదేవయ్య అంటాడు. నవగ్రహాల అదేంటి అని అంటే 9 మంది నామినేషన్ చేయడానికి సంతకాలు పెట్టాలి కదా అందుకే వెళ్తుందని తన అనుచరులతో కలిసి మహదేవయ్య పరాచకాలు ఆడుతాడు. ఆ ప్రయత్నంలో లేవు నేను చేసుకుంటానులే మామయ్య అనేసి సత్య అంటుంది అంతలోపే క్రిష్ వచ్చి తన మనిషిని కొడతాడు పనోళ్ళ ముందు నా భార్యను తక్కువ చేసి మాట్లాడద్దు బాపు మన ఇంట్లో వాళ్ల గౌరవం మనమే తీస్తున్నామనేసి క్రిష్ అంటాడు.
ఇక సత్య క్రిష్ కు చెప్పి నేను మా పుట్టింటికి వెళ్తున్నాను ఒక గంటలో తిరిగి వస్తాను అని చెప్పేసి చెప్తుంది. నన్ను వచ్చి డ్రాప్ చేయమంటావా అని క్రిష్ అడిగితే వద్దు నావల్ల ఇప్పటికే చాలామంది చేత అనిపించుకుంటున్నావు ఇక మీదట నాకు ఎటువంటి సపోర్ట్ చేయొద్దు నేను చూసుకుంటానులే అనేసి అంటుంది. చూసావా రా నీ పెళ్ళాం ఎలా మాట్లాడుతుంది అని భైరవి అంటుంది ఇక జయమ్మ వాళ్ళిద్దరి మధ్య గొడవలు పెట్టాలని అనుకుంటావా ఇక ఆపుతావా నీది అనేసి బైరవికి వార్నింగ్ ఇస్తుంది. ఇక సత్యా తన పుట్టింటికి వెళ్తుంది. ఎప్పుడు సత్య వచ్చినా అభిమానంగా పలకరించే కుటుంబీకులు.. ఈసారి మాత్రం మౌనంగా ఉంటారు. సత్య ని చూసి షాక్ అవుతుంది. ఏంటమ్మా ఇలా వచ్చావని సత్తి ని అడుగుతుంది. ఎప్పుడూ నేను గుమ్మం దగ్గరకు రాగానే నన్ను కౌగిలించుకొని రమ్మని చెప్పేదానివి ఇప్పుడు ఏమైందమ్మా అనేసి అడుగుతుంది. విశాలాక్షి ఏం లేదమ్మా నువ్వు లోపలికి రా అంటుంది. నేను నామినేషన్స్ నామినేషన్స్ వెయ్యబోతున్నాను. నాకు మీ సలహాలు, మీ సంతకాలు కావాలి అనేసి అంటుంది. దానికి విశాలాక్షితో సహా ఇంట్లో వాళ్ళందరూ సత్యకు వ్యతిరేకంగా మాట్లాడతారు. ముందు నీ భర్తని నీ మామని నీ దారికి తెచ్చుకో ఆ తర్వాత మేము నీ దారికొస్తామని విషయాలు అంటుంది. విశ్వనాథం కూడా భార్య మాటను కాదనలేక పోతాడు. అటు హర్ష కూడా చెల్లెలుకు సపోర్ట్ చేయడానికి ముందుకు రాడు. నందిని మాత్రం నా సపోర్ట్ నీకే వదినా ఆల్ ది బెస్ట్ అని చెప్తుంది.
ఎప్పుడూ నాకు ఏ కష్టం వచ్చినా నా పుట్టింటి వాళ్ళు ఉన్నారని ధైర్యంతో నేను ముందుకు సాగేదాన్ని కానీ ఇప్పుడు నా పుట్టింటి వాళ్ళు నన్ను వదిలేసారని బాధపడలో లేకపోతే ఆనందపడాలో అర్థం కావట్లేదు అని సత్య బాధపడుతుంది. సరే అమ్మ మీరందరూ నన్ను ఆశీర్వదించండి నేను విజయం సాధించాలని నన్ను దీవించండి అని సత్య అడుగుతుంది. సత్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. 9 మందిని ఎలా తీసుకురావాలని ఆలోచిస్తూ ఉంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..