BigTV English

TDP vs Ysrcp: వంశీ అరెస్ట్ వ్యవహారం.. టీడీపీ-వైసీపీ మధ్య మాటల యుద్ధం

TDP vs Ysrcp: వంశీ అరెస్ట్ వ్యవహారం.. టీడీపీ-వైసీపీ మధ్య మాటల యుద్ధం

TDP vs Ysrcp:  మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టుతో ఒక్కసారిగా ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి. సోషల్ మీడియా వేదికగా అధికార టీడీపీ-విపక్ష వైసీపీ మధ్య విమర్శలు మొదలయ్యాయి. పాపం పండిందని టీడీపీ రాసుకొస్తే.. కక్ష సాధింపు రాజకీయాలు కాదా అంటూ వైసీపీ ప్రశ్నించడం మొదలైంది.


రివేంజ్ రాజకీయాలొద్దు-బొత్స

వల్లభనేని వంశీ అరెస్టుపై మాజీ మంత్రి బొత్స రియాక్ట్ అయ్యారు. కక్షపూరితంగా వ్యవహరిస్తే వచ్చే ఎన్నికల్లో ప్రజలే సమాధానం చెబుతారన్నారు. అరెస్టులపై ఉన్న ఫోకస్, పాలనపై పెడితే బాగుంటుందన్నారు. మీ ఇష్టం వచ్చినట్లు మీరు చేయండి.. చట్ట పరంగా మేం పోరాటం చేస్తామన్నారు. మరో నాలుగేళ్లు పోయిన తర్వాత మీ విధానంపై మాట్లాడుదామన్నారు. నిన్నటికి నిన్న హైకోర్టు సైతం పోలీసు వ్యవస్థపై మొట్టికాయలు వేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఇలాంటి కామెంట్స్ చూస్తుంటే ప్రభుత్వానికి బాధ అనిపించలేదా అంటూ ప్రశ్నించారు.


టీడీపీ ఏమంది?

వల్లభనేని వంశీ అరెస్టుపై టీడీపీ నేత పట్టాభి రియాక్ట్ అయ్యారు. టీడీపీ రాష్ట్ర స్థాయి బీసీ నాయకుడు దొంతు చిన్నపై వంశీ అనుచరులు దాడి చేసి, వాహనాలను ధ్వంసం చేశారన్నారు. ఆయనను తీసుకుని పోలీసుస్టేషన్‌కు వెళ్లాలని నిర్ణయించామన్నారు. తాను గన్నవరం వెళ్తున్న సమయంలో వంశీ ఆఫీసు బయట దాదాపు వందల సంఖ్యలో ఆయన అనుచరులు ఉన్నారని వివరించారు.తాము పోలీసులతో మాట్లాడుతున్న సమయంలో పార్టీ ఆఫీసుపై దాడులు ఆపై వాహనాలు తగులబెట్టారని గుర్తు చేశారు. దారిలో మాపై దాడులు చేశారన్నారు. చివరకు మా వాహనంపై కాకుండా పార్టీ ఆఫీసుపై దాడి చేశారని చెప్పుకొచ్చారు.

బీసీ నేతపై దాడి చేస్తే ప్రశ్నించకూడదా అంటూ ప్రశ్నలు లేవనెత్తారు. చివరకు మాపై కేసులు నమోదు చేశారన్నారు. తమను స్టేషన్‌లో గంటపాటు చిత్రహింసలు గురి చేశారన్నారు. తమను రాజమండ్రి జైలుకి రెండువారాల పాటు పంపించారన్నారు. మా పార్టీ ఆఫీసు వ్యక్తి ఫిర్యాదు చేసినందుకు ఆ వ్యక్తిని బెదిరించి వంశీ మద్దతుదారులు కిడ్నాప్ చేశారు.  అతడి చేత బలవంతంగా స్టేట్‌మెంట్ ఇచ్చారని తెలిపారు పట్టాభి. బెదిరించి, కిడ్నాప్ చేసిన కేసులో వంశీని అరెస్ట్ చేశామన్నారు. చేసిన అరాచకం చాలక ఫిర్యాదుదారులను బెదిరిస్తారా అంటూ రుసరుసలాడారు.

తమకు శాంతి భద్రతలు ముఖ్యమన్నారు. బీసీ నాయకుడికి రక్షణగా తాము వెళ్లామన్నారు. చట్ట బద్దంగానే అరెస్ట్ చేశామన్నారు. వంశీ భార్య రియాక్షన్ పై నోరు విప్పారు. తాము ఏ రోజూ వంశీ ఫ్యామిలీ గురించి మాట్లాడ లేదన్నారు. చివరకు సభలో అధినేత భార్య గురించి నీచంగా మాట్లాడ లేదా? అంటూ రుసరుసలాడారు. ఆనాడు మీడియా ముందు చంద్రబాబు కన్నీరు పెట్టడానికి వంశీ కారణం కాదా? అంటూ ప్రశ్నలు రైజ్ చేశారు.

వంశీ భార్య ఏమన్నారు?

గురువారం ఉదయం పోలీసులు ఇంటికి వచ్చారని తెలిపారు. ఎందుకు అరెస్టు చేస్తున్నారని అడిగితే నోరు మెదపలేదని, ఎలాంటి నోటీసులు ఇవ్వలేదన్నారు. అప్పటికప్పుడు రాసి నోటీసులు ఇచ్చారు. ఇంకా ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదన్నారు. తాము చాలా ప్రశ్నలు వేశామని, వారికి అర్థం కాలేదన్నారు. అసలు వల్లభనేని వంశీ విజయవాడకు వెళ్లలేదన్నారు. పోలీసులంతా వంశీకి తెలుసన్నారు. పోలీసులకు ఫోన్ చేసి తొందరగా అరెస్ట్ చేయాలని చెబుతున్నారని వివరించారు. ఎన్ని కేసులు పెట్టినా బెయిల్ తెచ్చుకున్నామని తెలిపారు.

 

 

Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×