Virat Kohli: భారత్ – ఇంగ్లాండ్ మధ్య జరిగిన 3 వన్డే మ్యాచ్ ల సిరీస్ ని భారత జట్టు క్లీన్ స్వీప్ చేసింది. బుధవారం రాత్రి అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో భారత్ – ఇంగ్లాండ్ జట్ల మధ్య మూడవ వన్డే జరిగింది. తొలి రెండు మ్యాచ్ ల జోరుని కొనసాగిస్తూ ఈ మూడవ వన్డేలోనూ ఇంగ్లాండ్ పై భారత జట్టు గ్రాండ్ విక్టరీ సాధించింది. ఫలితంగా ఈ సిరీస్ ని 3 -0 తో కైవసం చేసుకుంది. ఈ మూడవ వన్డేలో ఇంగ్లాండ్ పై 142 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి.. స్వదేశంలో తమకు తిరుగు లేదని భారత జట్టు మరోసారి నిరూపించుకుంది.
Also Read: WPL 2025 schedule: రేపటి నుంచే WPL 2025 టోర్నీ..టైమింగ్స్, షెడ్యూల్ ఇదే..ఫ్రీగా చూడాలంటే ?
ఈ మూడవ వన్డేలో టాస్ కోల్పోయిన భారత జట్టు మొదట బ్యాటింగ్ కి దిగి నిర్ణీత 50 ఓవర్లలో 356 పరుగులకు ఆల్ అవుట్ అయింది. ఇంగ్లాండ్ బౌలర్లలో ఆదిల్ రషీద్ 4 వికెట్లు పడగొట్టాడు. అనంతరం 357 భారీ పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ జట్టు.. 34.2 ఓవర్లలో 214 పరుగులకే ఆల్ అవుట్ అయ్యింది. భారత బౌలర్లలో హర్షదీప్ సింగ్, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, హర్షిత్ రానా చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
ఇక ఈ మ్యాచ్ లో అద్భుత ఇన్నింగ్స్ తో శతకం సాధించిన గిల్ కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు లభించాయి. ఇక గత కొంతకాలంగా ఫామ్ కోల్పోయి.. పరుగులు రాబట్టడంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్న విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్ లో రాణించాడు. ఎట్టకేలకు ఫామ్ అందుకొని ఈ మూడవ వన్డేలో హాఫ్ సెంచరీ తో టచ్ లోకి వచ్చాడు. ఈ మ్యాచ్ లో 55 బంతులలో 52 పరుగులు చేశాడు.
ఇందులో ఏడు ఫోర్లు, ఒక సిక్స్ ఉన్నాయి. ఇక చాంపియన్స్ ట్రోఫీకి ముందు విరాట్ కోహ్లీ తిరిగి ఫామ్ లోకి రావడం పట్ల అతడి పై అన్ని వైపులా ప్రశంసలు కురుస్తున్నాయి. మరోవైపు విమర్శలు కూడా వస్తున్నాయి. విమర్శలకు కారణం ఏంటంటే.. ఈ 3 వన్డేల సిరీస్ ని గెలిచిన అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ అందుకొని.. ఆ కప్ నీ తీసుకొని యువ ఆటగాళ్ల చేతిలో పెట్టాడు. దీంతో తన పెద్ద మనసును చాటుకున్నాడు రోహిత్ శర్మ.
Also Read: Ind Vs Eng 3rd Odi: 3-0 తేడాతో ఇంగ్లండ్ ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా
అయితే ఆ కప్ ని పట్టుకొని యువ ఆటగాళ్లు అంతా సంబరాలు జరుపుకోవడం మొదలుపెట్టారు. వాళ్లు అలా సంబరాలు జరుపుకుంటున్న సందర్భంలో వీరిని ఏమాత్రం పట్టించుకోకుండా విరాట్ కోహ్లీ ఫోన్ లో బిజీ అయిపోయాడు. దీంతో కోహ్లీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే చాలాకాలం తర్వాత ఫామ్ లోకి వచ్చిన క్రమంలో అనుష్క శర్మతో మాట్లాడుతుండొచ్చునని, అందుకే వీరిని పట్టించుకోవడంలేదని కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్లు. ఇలా విరాట్ కోహ్లీ ఫోన్ మాట్లాడుతున్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.