BigTV English

AP Politics : వంశీకి చెక్ పెడతారా?.. దుట్టా, యార్లగడ్డ మీటింగ్ అందుకేనా?

AP Politics : వంశీకి చెక్ పెడతారా?.. దుట్టా, యార్లగడ్డ మీటింగ్ అందుకేనా?
AP Politics


AP Politics : గన్నవరంలో ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టార్గెట్‌గా రాజకీయాలు వేడెక్కాయి. దుట్టా రామచంద్రరావుతో యార్లగడ్డ వెంకట్రావ్‌ భేటీ కావడం ఆసక్తికరంగా మారింది. వంశీకి చెక్ పెట్టేందుకే.. ఇద్దరు శత్రువులు ములాకత్ అయ్యారని అంటున్నారు.

2019 ఎన్నికల్లో టీడీపీ తరఫున గన్నవరం నుంచి పోటీచేసిన వల్లభనేని వంశీ.. వైసీపీ అభ్యర్థి యార్లగడ్డపై విజయం సాధించారు. గెలిచిన కొన్నాళ్లకే టీడీపీకి గుడ్ బై చెప్పేసి జగన్‌కు మద్దతిచ్చారు వంశీ. వైసీపీ కండువా కప్పుకోలేదు కానీ.. అనధికారిక సభ్యుడిగా కొనసాగుతున్నారు. అప్పటినుంచీ అసంతృప్తితో రగిలిపోతున్నారు యార్లగడ్డ వెంకట్రావ్. అటు, టికెట్ ఆశిస్తున్న దుట్టా రామచంద్రరావుకు సైతం వంశీతో పడటం లేదు. ఆ ముగ్గురు నేతల అనుచరుల మధ్య తరుచూ గొడవలు జరుగుతున్నాయి. విషయం జగన్ వరకూ వెళ్లినా ఎవరూ తగ్గట్లే.


లేటెస్ట్‌గా యార్లగడ్డ, దుట్టా భేటీ కావడం వైసీపీలో చర్చనీయాంశంగా మారింది. యార్లగడ్డ, దుట్టా ఇద్దరూ టీడీపీకి టచ్‌లో ఉన్నారనే వార్తలూ వస్తున్నాయి. వంశీకి బ్రేక్ వేయడానికి దుట్టా, యార్లగడ్డను టీడీపీ ప్రయోగిస్తోందని కూడా అంటున్నారు. వారి ట్రయాంగిల్ పోరుతో.. గన్నవరం రాజకీయం గరంగరంగా మారుతోంది.

Related News

Aadudam Andhra Scam: రోజా అసలు ‘ఆట’ మొదలు.. అరెస్టుకు రంగం సిద్ధం, రంగంలోకి సిట్?

Tirumala News: బుక్కైన జగన్ మామ, టీటీడీ కేసు నమోదు? అసలు ఏం జరిగింది?

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?

Pulivendula Campaign: ఖైదీల వేషధారణలో ఎన్నికల ప్రచారం.. వైసీపీ పరువు తీసేశారుగా!

Nara Lokesh: ర్యాగింగ్ ఘటనపై లోకేష్ ఘాటు రియాక్షన్

Visakhapatnam 2050: విశాఖ నగరం 2050లో.. ఇలా ఉంటుందా? అసలు ఊహించలేం కదా!

Big Stories

×