Ap Mini Municipal Elections: ఏపీలో రాజకీయాలు కొత్త మలుపు తిరుగుతున్నాయా? ప్రస్తుతం జరగనున్న మినీ పుర పోరులో రెండు కార్పొరేషన్లు, అరడజను మున్సిపాలిటీలను గెలుచుకోవాలని వైసీపీ ఆలోచన చేసిందా? ఈ విషయంలో అభ్యర్థుల ఎంపిక స్థానిక నేతలకు వదిలేసిందా? నామినేషన్లు గడువు తర్వాత అభ్యర్థుల జాబితాను అందుకే ప్రకటించిందా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.
ఏపీలో మినీ పుర పోరు రాజకీయాలు వేడెక్కాయి. తొలి విడతలో అనంతపురం కార్పొరేషన్, అల్లూరు సీతారామరాజు జెడ్పీ పీఠాలను గెలుచుకుంది. దీంతో ఆ పార్టీ నేతలు ఉత్సాహంలో ఉన్నారు. మినీ పుర పోరులో రెండు కార్పొరేషన్లు, అర డజను మున్సిపాలిటీలను కైవసం చేసుకోవాలని ఆలోచన చేసింది. అందులో శ్రీకాకుళం, రాజమండ్రి కార్పొరేషన్లు కాగా, మున్సిపాలిటీల్లో భీమవరంతోపాటు కొన్ని ఉన్నాయి. ఈ క్రమంలో నాలుగు కార్పొరేషన్లు, 13 మున్సిపాలిటీ/ నగర పంచాయతీలకు సంబంధించి ఆ పార్టీ అభ్యర్థుల జాబితాను ప్రకటించింది.
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా మున్సిపాలిటీ, కార్పొరేషన్లకు వైఎస్సార్‌సీపీ తమ అభ్యర్థులను ప్రకటించింది. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు మున్సిపల్ కార్పొరేషన్లకు మేయర్ అభ్యర్థులు, మున్సిపాలిటీ, నగర పంచాయతీలకు చైర్మన్ అభ్యర్థులను ప్రకటించినట్లు తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం ప్రకటించింది. శ్రీకాకుళం మేయర్ అభ్యర్థిగా గుండ లక్ష్మీదేవి, కాకినాడకు కె.సత్యశ్రీ, రాజమహేంద్రవరానికి డి.వెంకట్రావు, మంగళగిరి-తాడేపల్లికి పి నాయక్‌లను అభ్యర్థులుగా ఖరారు చేసింది.
రాష్ట్రంలో రెండోవిడత జరగనున్న పట్టణ స్థానిక సంస్థల్లో శ్రీకాకుళం కార్పొరేషన్ అభ్యర్థిగా గుండ లక్ష్మీదేవి, కాకినాడ-కె.సత్యశ్రీ, రాజమండ్రి-వెంకట్రావు, మంగళగిరి-తాడేపల్లి- నాయక్‌లను అభ్యర్థులుగా ఓకే చేసింది. ఇక ఆమదాలవలస మున్సిపాలిటీ-బొడ్డేపల్లి అజంతకుమారి, రాజాం-పాలవలస పద్మావతి, భీమవరం-వెంకట మాధవీలత, పాలకొల్లు-ఉమాశైలజ ఉన్నారు.
తాడేపల్లిగూడెం-శ్రీనివాస్, తణుకు-బాలకృష్ణ, గుడివాడ-ప్రవీణ, తాడిగడప- బెజవాడ వీరబాబు, నరసరావుపేట-షేక్ ఖాజావలి, పొన్నూరు-షేక్ బీబీ జాన్‌నాజర్, బాపట్ల-కాగిత సుధీర్‌బాబు, కావలి- కేతిరెడ్డి శివకుమార్‌రెడ్డి పేర్లను ప్రకటించింది. ఇక చింతలపూడి నగర పంచాయతీ-సునీతల్ని అభ్యర్థిగా ప్రకటన చేసింది. పార్టీ అధినేత జగన్ ఆదేశాల మేరకు ఎంపిక జరిగినట్టు పార్టీ ఓ ప్రకటనలో పేర్కొంది.
ALSO READ: ఏపీ వైపు దూసుకొస్తున్న తుఫాను.. ఉత్తరాంధ్ర-కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు, ఉద్యోగులకు సెలవులు రద్దు
నామినేషన్లు తర్వాత అభ్యర్థుల జాబితాను ప్రకటించడంతో వైసీపీ నేతలు ఒక్కసారిగా షాకయ్యారు. ఈసారి ప్రత్యర్థుల బలబలాలను పరిశీలించిన తర్వాత స్థానిక నాయకుల నుంచి సమచారం తీసుకుందట పార్టీ హైకమాండ్. దాని ఆధారంగా అభ్యర్థుల జాబితాను ప్రకటించిందని అంటున్నారు. అభ్యర్థుల ఎంపికలో గ్రూపులకు తావు లేకుండా స్థానిక నేతలకు ప్రయార్టీ ఇచ్చిందని అంటున్నారు. అందుకే అభ్యర్థుల జాబితాను రాత్రి విడుదల చేసిందని అంటున్నారు.
మినీ పురపోరులో 23 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి మూడు రోజులుగా 7,508 నామినేషన్లు దాఖలయ్యాయి. మేయర్, ఛైర్‌పర్సన్ స్థానాలకు-385, డివిజన్లు/వార్డులకు 7123 నామినేషన్లు దాఖలు అయ్యాయి. చివరి రోజు సోమవారం కార్పొరేషన, డివిజన్ స్థానాలకు 1984 నామినేషన్లు వేశారు. మున్సిపాలిటీ-నగర పంచాయతీల ఛైర్‌పర్సన్, వార్డులకు 3746 నామినేషన్లు వచ్చాయి.
వైయస్ఆర్సీపీ తరఫున మున్సిపల్ కార్పొరేషన్లకు మేయర్ అభ్యర్థులను, మున్సిపాలిటీలు మరియు నగర పంచాయతీలకు ఛైర్మన్ అభ్యర్థులను ప్రకటించిన పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ గారు. pic.twitter.com/P9CckfZrvQ
— YSR Congress Party (@YSRCParty) November 16, 2026