E-Paper
Advertisement

ఏపీలో రెండో విడత పంచాయతీ ఎన్నికలకు.. నోటిఫికేషన్ విడుదల!

ఏపీలో రెండో విడత పంచాయతీ ఎన్నికలకు.. నోటిఫికేషన్ విడుదల!
Advertisement

Panchayat Elections: రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ సాధారణ ఎన్నికల నిర్వహణకు అధికారిక ప్రకటన జారీ అయినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విడతలో విజయనగరం జిల్లాలోని మూడు రెవెన్యూ డివిజన్ల పరిధిలో గల 10 మండలాల్లోని గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయని ఆయన పేర్కొన్నారు.

​ఎన్నికలు జరిగే మండలాల వివరాలు

​బొబ్బిలి డివిజన్: దత్తిరాజేరు, గజపతినగరం, మెంటాడ.
చీపురుపల్లి డివిజన్: రేగిడి ఆమదాలవలస, వంగర, రాజాం, సంతకవిటి.
విజయనగరం డివిజన్: బొండపల్లి, గంట్యాడ, జామి.

​రెండో విడత ఎన్నికల ముఖ్య షెడ్యూల్..

Advertisement

ఎన్నికల నోటీసు & ఓటర్ల జాబితా ప్రదర్శనను నవంబర్ 18న రిటర్నింగ్ అధికారులు ఫారమ్-I లో నోటీసు జారీ చేసి, వార్డుల వారీగా ఓటర్ల జాబితాను ప్రదర్శిస్తారు. నవంబర్ 18 నుంచి 20వ తేదీ వరకు ప్రతిరోజూ ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు నిర్వహించనున్నారు.

​నామినేషన్ల పరిశీలన..

నవంబర్ 21న ఉదయం 8.00 గంటల నుంచి అప్పీళ్లు, పరిష్కారం.. తిరస్కరణకు గురైన నామినేషన్లపై నవంబర్ 22 సాయంత్రం 5.00 గంటల వరకు సంబంధిత ఆర్డీవో వద్ద అప్పీల్ చేసుకోవచ్చు. వీటిని నవంబర్ 23న అధికారులు పరిష్కరిస్తారు. నవంబర్ 24 మధ్యాహ్నం 3.00 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుందని అనంతరం అదే రోజు బరిలో నిలిచే అభ్యర్థుల తుది జాబితాను ఎన్నికల సంఘం ప్రకటించనుంది.

​పోలింగ్, ఓట్ల లెక్కింపు..

Advertisement

నవంబర్ 29న ఉదయం 7.00 గంటల నుంచి మధ్యాహ్నం 1.00 గంట వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. అదే రోజు మధ్యాహ్నం 2.00 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడించనున్నారు. అనంతరం ఫలితాలు ప్రకటించిన రోజే ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహిస్తారు. ఎక్కడైనా రీపోలింగ్ అవసరమైతే నవంబర్ 30న ఉదయం 7.00 నుంచి మధ్యాహ్నం 1.00 గంట వరకు నిర్వహించి, మధ్యాహ్నం 2.00 గంటల నుంచి ఓట్లను లెక్కించనున్నారు. జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, ఓటర్లు ఎన్నికల నియమావళిని పాటించి సహకరించాలని కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి పిలుపునిచ్చారు.

Also read: జేఏసీ, టీజీవో, టీఎన్జీవో నేతలపై.. సాధారణ ఉద్యోగుల తిరుగుబాటు?

Tags

Related News

కాకినాడ జిల్లాలో ఘోరం.. 10వ తరగతి విద్యార్థులపై.. కుల వివక్షతో ప్రిన్సిపాల్, పీటీ టీచర్ దాడి!

ఏపీ రాజకీయాలు కొత్త మలుపు.. కూటమిలో భీమవరం వ్యవహారం భారీ కుదుపు, ఫ్రెండ్లీ పోటీకి బీజేపీ సై

తీవ్ర వాయుగుండంగా మారిన తుఫాన్.. ఈసారి ఏపీ వైపు, ఆ ప్రాంతాలు టార్గెట్

సిక్కోలు మేయర్ పీఠంపై వైసీపీ కన్ను.. మేయర్ అభ్యర్థి లక్ష్మిదేవి, టీడీపీ అసమ్మతిలపై ధర్మాన వల

ఏపీలో మినీ మున్సిపాలిటీ ఎన్నికలు.. టీడీపీ అభ్యర్థులు జాబితా, కాకపోతే కొన్ని చోట్ల అభ్యర్థులపై

తొలిరోజే భగ్గుమన్న పల్లె పోరు.. పలు జిల్లాల్లో ఉద్రిక్తత, పోలీసులపైకి కారుతో దూసుకెళ్లిన బీజేపీ నేత!

ఏపీలో అరుదైన ఘటన.. పుట్టుకతో తల నిండా జుట్టుతో జన్మించిన చిన్నారి!

Big Stories

Advertisement
×