Ramoji Excellence: రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డుల ప్రదానోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొని ప్రసంగించారు. వరుసగా రెండో ఏడాది రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డుల కార్యక్రమంలో పాల్గొనటం సంతోషంగా ఉందని అన్నారు. 9 రంగాల్లో అవార్డులు అందుకుంటున్న 9 మంది విశిష్ట వ్యక్తులకు అభినందనలు తెలియచేస్తున్నానని, పద్మవిభూషణ్ రామోజీరావు జయంతిని పురస్కరించుకుని రాష్ట్రానికి ఆయన అందించిన సేవలను గుర్తిస్తూ రాష్ట్ర పండుగగా నిర్వహించాలని నిర్ణయించామని అన్నారు.
ఏటా నిర్వహించుకునేలా దీనిపై ఉత్తర్వులు కూడా జారీ చేశామని, జర్నలిజం, కళలు, సంస్కృతి, గ్రామీణాభివృద్ధి- వ్యవసాయం, మహిళా సాధికారిత, సైన్స్ & టెక్నాలజీ యూత్ ఐకాన్, సామాజిక సేవ, విద్యా, వైద్య రంగాల్లో అవార్డులు అందిస్తున్నారు. నిష్పక్షపాతంగా ఆయన జర్నలిజం సహా వివిధ రంగాల్లో సేవలందించారని చంద్రబాబు అన్నారు. కృష్ణా జిల్లాలో జన్మించిన రామోజీరావు గొప్ప సంస్థలను స్థాపించారు. సమర్ధంగా వాటిని నడిపించారు. సంకల్పం- క్రమశిక్షణ, విలువలు సమాజహితం నాణ్యత విశ్వసనీయత లాంటివి ఆయన తెచ్చిన విధానాలు జనం కోసం జర్నలిజాన్ని నమ్ముకుని అక్షరమే ఆయుధంగా మలచుకుని పోరాటం చేసిన వ్యక్తి రామోజీ రావు అని కొనియాడారు.
Also Read: ఎస్‌ఐఆర్‌పై రాహుల్ గాంధీ సంచలన నిర్ణయం.. సుప్రీంకోర్టులో మరో పిటిషన్.. ఈసీఐకి 48 ప్రశ్నలు!
ఈనాడు, మార్గదర్శి, ఈటీవీ, విలువలతో కూడిన సినిమాలు తీసి సమాజానికి అందించారు. విలువలు, సమాజహితం అని నమ్మిన వ్యక్తి, ప్రజల సమస్యలతో పాటు ప్రకృతి విపత్తుల సమయంలోనూ స్పందించింది ఈనాడు సంస్థ ఆంధ్రప్రదేశ్ రాజధానికి పేరును లోతుగా అధ్యయనం చేసి అమరావతి అని సూచించారు. రాజధాని నిర్మాణానికి కూడా రూ.10 కోట్ల విరాళం, కరోనా సమయంలోనూ రాష్ట్రానికి రూ.10 కోట్ల విరాళం ఇచ్చిన సంస్థ ఈనాడు గ్రూప్ అని చంద్రబాబు నాయుడు గుర్తు చేశారు. ప్రతి రాత్రీ 9 గంటలకు ఈటీవీ న్యూస్ చూసి వార్తలు తెలుసుకునే పరిస్థితి ఉందని ఎన్ని కష్టాలు వచ్చినా ఎవరికీ తలవంచని వ్యక్తిగా రామోజీరావు నిలిచారని అన్నారు. కోట్లాది మంది పాఠకుల విశ్వాసంతో బలమైన శక్తిగా నిలిచారు.
నియంతలు ఎంత ప్రయత్నించినా ఆయన తలవంచలేదు. విచారణ పేరుతో ఇబ్బందులు పెట్టారని అనారోగ్యంతో మంచంపై ఉన్న వీడియోలను కూడా విడుదల చేసి అవమానించే ప్రయత్నం చేశారు. అయినా ఆయన పోరాట ధోరణి వీడకుండా రాజీలేని పోరాటం చేశారు. రామోజీరావు తెలుగు జాతి కీర్తి, తరతరాల స్పూర్తి, ఆయన స్థాపించిన సంస్థలు తెలుగు జాతికి ఆస్తులని, రామోజీ రావు జయంతి కార్యక్రమానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా రావటం రామోజీకి ఇచ్చిన గౌరవంగా భావిస్తున్నానని సీఎం చంద్రబాబు అన్నారు.
Also read: తండ్రిపై దాడికి ప్రతీకారం.. హోటల్‌పై అక్కాచెల్లెళ్ల దాడి.. చుక్కలు చూపించేశారు భయ్యా!