Tractor Accident: శ్రీ సత్య సాయి జిల్లాలో ఓ అమానుష ఘటన చోటు చేసుకుంది. ఆ సంఘటన అందరిని తీవ్ర భయబ్రాంతులకు గురి చేసింది. ఇక వివరాల్లొకి వెలితే ఇలా ఉన్నాయి.
శ్రీ సత్య సాయి జిల్లాలో గుడిబండ గుడిబండ మండలం కెఎన్ పల్లి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులపై ట్రాక్టర్ దూసుకెళ్లింది. దీంతో ఈ ట్రాక్టర్ ప్రమాదంలో ఇద్దరు 9వ తరగతి విద్యార్థినులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటనలో గాయపడిన విద్యార్థినులు జయలక్ష్మి, ఉషగా అక్కడి స్థానికులు గుర్తించారు.
ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఇద్దరు విద్యార్థినులను అక్కడి స్థానికులు వెంటనే మడకశిర ప్రభుత్వ ఆసుపత్రికి తలించారు. దీంతో పిల్లలకు వైద్యులు ప్రాథమిక చికిత్స అందిస్తున్నారు. మెరుగైన వైద్యం కోసం హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి విద్యార్థులను తరలించారు. విద్యార్థినుల పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు జరిగిన ప్రమాదంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Also read: బిగ్‌బీ హత్యకు భారీ కుట్ర.. ముంబై గ్యాంగ్‌స్టర్ ఓపెన్ వార్నింగ్.. 200 మంది అనుచరులతో స్కెచ్?