Intinti Ramayanam Today Episode November 17th : ఇక ఉదయం అందరూ లేవగానే కమల్ కి విషెస్ చెప్పాలని అనుకుంటారు.. ఇక ఆడవాళ్ళందరూ కమల్ కి మంచి జరగాలని పూజ చేస్తూ.. మగవాళ్ళందరూ కమ్మని విషెస్ చేయాలి అనుకుంటారు. కమల్ కి చాలా గ్రేట్ గా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తారు అన్నలు. ఇక పార్వతీతో సహా మిగిలిన ఆడవాళ్ళు అందరూ కూడా కమల్ కి మంచి జీవితాన్ని ప్రసాదించు అని దేవుని కోరుకుంటారు. మొత్తానికి కమల్ సంతోషం కోసం గుడికి వెళ్లాలని అనుకుంటారు.. పల్లవి మన ఇంట్లో లేదు కాబట్టి మనం చాలా సంతోషంగా ఉన్నాము అని కమల్ కూడా ఆలోచిస్తూ ఉంటాడు. ఇక అందరూ కలిసి కమలి గుడికి తీసుకుని వెళ్లాలని అనుకుంటారు.
భరత్ ని ఎలాగైనా సరే మచ్చగా చేసుకొని మంచిగా మార్చుకోవాలి అని ప్రణతికి అవని చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటుంది.. కోపంతో ఉన్నవాడిని ప్రేమతో నువ్వు మార్చుకోవాలి.. అప్పుడే మీ ఇద్దరి మధ్య మంచి సంబంధం ఏర్పడుతుంది అని అవని చెప్పడంతో ఆ మాట విన్న ప్రణతి ఎలాగైనా సరే భరత్ నీ తన వైపు తిప్పుకోవాలి అని అనుకుంటుంది.. భరత్ ఫోన్ మాట్లాడుతూ ఉండగా అక్కడికి వచ్చిన ప్రణతి ప్రేమగా మాట్లాడుతుంది ఆ మాటలు విన్న భరత్ చాలా సంతోషంగా ఉంటాడు నేనంటే నీకు ఇంత ప్రేమ ఉంది కదా మరి నామీద ఎందుకు నువ్వు ఎప్పుడు కోప్పడుతూ ఉంటావు అని అంటాడు ఇక ప్రణతి తన మాటలతో అందరిని దగ్గర చేసుకుంటుంది.. నీకు ఇష్టమైన వాళ్ళందరిని నేను ఇష్టపడుతున్నాను అంటే అది నీ కోసమే అది నువ్వు ఆ మాత్రం అర్థం చేసుకోవాలి.. అని ప్రణతి అనగానే భరత్ ఫిదా అయిపోతాడు మొత్తానికి ప్రణతి ప్లాన్ సక్సెస్ అవుతుంది. రమ్య గుడికి వచ్చి పూజ చేయాలి అని అనుకుంటుంది ఇక అవని వాళ్ళ కుటుంబాన్ని కలిసి చాలా సంతోషంగా ఉంటుంది.
కమల్ తన పుట్టినరోజు సందర్భంగా ఇంట్లోనే అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటాడు.. ఇక కమల్ని కూడా అందరూ చాలా సంతోషంగా ఆశీర్వదిస్తారు. నేను ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాను మీరందరూ నాకు తోడుగా ఉన్నారు. మీ అందరి మధ్య నేను ఉండడం నాకు నిజంగానే ఆ దేవుడిచ్చిన అదృష్టంగా భావిస్తాను అని కమల్ అంటాడు. ఇక కమల్ అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటాడు అయితే ఆరాధ్య మాత్రం నన్ను స్కూల్ కి ఈరోజు రమ్మన్నారు బాబాయ్ అందుకే నేను హ్యాపీగా లేను అని అంటుంది. సరే బంగారం నువ్వు స్కూల్ కి వెళ్లేసి టెస్ట్ రాసి రా ఆ తర్వాత మనిద్దరం కలిసి బయటికి వెళ్దామని కమల్ అనగానే ఆరాధ్య సరే బాబాయ్ మనం వచ్చిన తర్వాత బయటకు వెళ్దాము అని అంటుంది. సరే నీ మనం కూడా ఇప్పుడు ఆరాధిని స్కూల్ దగ్గర వదిలిపెట్టేసి గుడికి వెళ్లేసొద్దాము అని అవని అనగానే అందరూ కూడా మేడం చెప్తే వినాలి కదా మేడం అంటే మేడం అని సరదాగా అంటారు..
గుడికొచ్చిన అవని వాళ్ళ కుటుంబం చాలా సంతోషంగా కమల్ కి పూజ చేయించాలి అని అనుకుంటారు. అయితే అప్పుడే రమ్య కూడా అక్కడ కనిపించడంతో రమ్య నువ్వా ఇక్కడ కనిపించడం చాలా సంతోషంగా ఉంది అని అవని అంటుంది. అవని అక్క అంటూ రమ్య పిలవడంతో వాళ్ళ అన్నయ్య ఎవరు అని అడుగుతారు. నాకు తెలిసిన వాళ్ళ అన్నయ్య అని వాళ్ళ అన్నయ్య కూడా పరిచయం చేస్తుంది. అయితే నిజం ఈ అమ్మాయి చాలా మంచిది కదా మనం ఆరోజు ఎంతగా ఆలోచించినా కూడా పల్లవి చేసిన దానికి ఎవరైనా సీరియస్ అవుతారు. కానీ ఈ అమ్మాయి మాత్రం చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయ్యి నవ్వుతో మాట్లాడుతుంది అని అందరూ రమ్యను పొగిడిస్తూ ఉంటారు. రమ్య కి సారీ కూడా ఎప్పుడో చెప్పేసాను అని చెప్పడంతో నిజంగానే చాలా గ్రేట్ ఈ అమ్మాయి అంటూ అందరూ పొగిడేస్తారు..
ఇక రమ్యను పెళ్లికూతురుగా రెడీ ఎగిరి రమ్మని అబద్ధం చెప్పి వాళ్ళ అన్నయ్య పూజ పేరుతో ఆమెను మోసం చేయాలని చూస్తాడు. అయితే అక్కడ పెళ్ళికొడుకు సారథి దూరంగా ఉండి రమ్య రెడీ అవుతుందా లేదా అని చూస్తూ ఉంటాడు. మొత్తానికి రమ్యని బురిడీ కొట్టించి మరి పెళ్లికూతురుగా రెడీ అయ్యేలా చేస్తారు. అయితే పంతులుగారు ముందుగా నేను ఈ దొంగ పెళ్ళికి చెయ్యను అమ్మాయికి నిజం చెప్పాలని ఎంత చెప్తున్నా సరే అసలు వినకుండా పెళ్లి కొడుకు నీకు ఇంకా డబ్బులు ఇస్తాను ఈ పెళ్లి ముందు జరిపించండి అని అంటారు.. ఇది రమ్య అలా వెళుతూ ఉండగా చూసిన కమల్ రమ్య అని పిలుస్తాడు దాంతో ఆమె వెనక్కి తిరిగి పడిపోతుండగా పట్టుకుంటాడు అయితే ఇద్దరు సంతోషంగా మాట్లాడుకుంటూ ఉండగా రమ్య వాళ్ళ అన్నయ్య వచ్చి మా చెల్లెలి మీద నీకు ఆ ఫీలింగ్ ఉంటే వెంటనే మార్చుకొని అంటాడు.. నాకు అలాంటి ఫీలింగ్స్ ఏమీ లేవు అని అనగానే సరి ఇకమీదట వెళ్ళిపో అని అంటాడు. కానీ రమ్యకు మాత్రం అనుమానం వస్తుంది.. అక్కడ పెళ్లికి సిద్ధం చేయడంతో అక్కడ అదంతా చూసి కాస్త అనుమాన పడుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..
Also Read :మలేషియలో పెళ్లి చేసుకున్న బుజ్జమ్మ.. అసలు కారణమేంటో తెలుసా..?