BigTV English

YCP Leader Devineni Avinash: వైసీపీ నేత అవినాష్‌కు బిగ్ షాక్.. దుబాయ్ వెళ్తుండగా అడ్డుకున్న పోలీసులు

YCP Leader Devineni Avinash: వైసీపీ నేత అవినాష్‌కు బిగ్ షాక్.. దుబాయ్ వెళ్తుండగా అడ్డుకున్న పోలీసులు

Big Shock to YCP Leader Devineni Avinash: వైసీపీ నాయకుడు దేవినేని అవినాష్‌కు బిగ్ షాక్ తగిలింది. శంషాబాద్ విమానాశ్రయంలో ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. గురువారం రాత్రి హైదరాబాద్ నుంచి దుబాయ్ వెళ్లేందుకు ప్రయత్నించగా..శంషాబాద్ విమానాశ్రయం అధికారులు మంగళగిరి పోలీసులకు సమాచారం అందించారు.


అవినాష్‌పై కేసులు ఉన్నందున ప్రయాణానికి అనుమతి ఇవ్వొద్దని పోలీసులు కోరారు. ఇమ్మిగ్రేషన్ సమయంలో అవినాష్‌పై లుకౌట్ నోటీసులు ఉండటంలో అప్రమత్తమైన పోలీసులు అవినాష్ దుబాయ్ ప్రయాణాన్ని అడ్డుకున్నారు. దీంతో చేసేది ఏమిలేక అవినాష్ శంషాబాద్ విమానాశ్రయం నుంచి వెనక్కి వెళ్లిపోయారు.

కాగా, టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడితోపాటు టీడీపీ నాయకుడు పట్టాభి ఇంటిపై జరిగిన దాడి ఘటనల్లో దేవినేని అవినాష్‌పై కేసులు నమోదయ్యాయి. మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసులో అవినాష్ నిందితుడిగా ఉన్నారు. అంతకుముందు మూడేళ్ల క్రితం మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో విధ్వంసం సృష్టించారు. ఈ దాడి వెనుక అవినాష్ హస్తం ఉందనే ఆరోపణలు వినిపించాయి. ఇందులో భాగంగానే ఆయనపై పలు కేసు నమోదయ్యాయి.


దేవినేని అవినాష్ దుబాయ్ పారిపోయేందుకు ప్రయత్నం చేశారని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. కాగా, అంతకుముందు 2019 ఎన్నికల్లో గుడివాడ నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి ఓటమి చెందారు. తర్వాత వైసీపీలో చేరారు. గత ఎన్నికల్లో వైసీపీ తరఫున దేవినేని అవినాష్ విజయవాడ ఈస్ట్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. వైసీపీ హయాంలో టీడీపీ నేతలపై దూకుడుగా వ్యవహరించిన ఆయన టీడీపీ కార్యాలయాలపై దాడిలో ప్రధాన పాత్ర పోషించారనే అనుమానాలు ఎదుర్కొంటున్నారు.

Also Read: ఏపీలో మరో 99 అన్న క్యాంటీన్లు ప్రారంభం.. రోజుకు ఎంత ఖర్చు అవుతుందో తెలుసా?

ఇదిలా ఉండగా, శంషాాబాద్ విమానాశ్రయంలో దేవినేని అవినాష్ విదేశీ పర్యటనను అడ్డుకోవడం చర్చనీయాంశంగా మారింది. అయితే టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదైందని, ప్రయాణానికి అనుమతి ఇవ్వొద్దని మంగళగిరి పోలీసులు శంషాబాద్ పోలీసులకు సూచించారు. అనుమతి నిరాకరించడంతో అవినాష్ వెనుదిరిగారు.

Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×