BigTV English

Harish rao resignation Flexis : హరీశ్ రాజీనామా చేయాలంటూ వెలిసిన ఫ్లెక్సీలు

Harish rao resignation Flexis : హరీశ్ రాజీనామా చేయాలంటూ వెలిసిన ఫ్లెక్సీలు

Flexis appear in Hyderabad city against Harish rao resignation (telangana politics)  : రాజకీయ ప్రచారాలలో కీలక పాత్ర పోషించే ఫ్లెక్సీలు మరోసారి హైదరాబాద్ లో సంచలనం క్రియేట్ చేస్తున్నాయి. గతంలో మోదీ ఢిల్లీ నుంచి వస్తున్నప్పుడు..అధికార పక్షం వైఫల్యాలపై ఫ్లెక్సీలు వెలిసేవి. ఊళ్లల్లోనూ ఈ ఫ్లెక్సీల లొల్లి జరుగుతూనే ఉంటుంది. తమ ప్రత్యర్థులపై వ్యతిరేకంగా ఫ్లెక్సీలు వెలుస్తుంటాయి. అయితే ఇప్పుడు లేటెస్ట్ గా బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు ఫ్లెక్సీలకు టార్గెట్ గా మారారు.


సవాళ్లు..ప్రతి సవాళ్లు

తెలంగాణలో రైతు రుణ మాఫీపై అప్పట్లో అసెంబ్లీలో హాట్ హాట్ గా చర్చలు జరిగాయి. సవాళ్లు ప్రతి సవాళ్లతో వాతావరణం వేడెక్కిపోయింది. తెలంగాణలో ఒక్కో రైతుకు రూ.2 లక్షల రైతు రుణం మాఫీ చేయడం రేవంత్ సర్కార్ కు సాధ్యం కాని పని అంటూ హరీశ్ రెచ్చగొట్టారు. రైతు రుణ మాఫీ చేసి తీరతాం అంటూ అప్పట్లో రాహుల్ గాంధీ తో ఎన్నికల ప్రచారంలో చెప్పించారు కాంగ్రెస్. అయితే హరీశ్ వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్న రేవంత్ ఎట్టి పరిస్థితిలోనూ ఆగస్టు 15 లోగా రెండు విడదల్లో రైతు రుణ మాఫీ చేసితీరతామని ప్రకటించారు. అలా చేసినట్లయితే హరీశ్ రాజీనామా చేస్తారా అని సవాల్ విసరడంతో హరీశ్ ఆ సవాల్ ను స్వీకరించారు. రైతు రుణ మాఫీ జరిగితే తాను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని ప్రకటించారు.


నగరంలో ఫ్లెక్సీల కలకలం

ఈ ఇష్యూని సీరియస్ గా తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి హరీశ్ రావు తన మాట నిలబెట్టుకోవాలని..రైతు రుణ మాఫీ చెప్పినవిధంగా చేశామని ఇక ఆలస్యం ఎందుకు రాజీనామా చేయాలని హరీశ్ రావుపై ఒత్తిడి పెంచారు. పైగా నిన్నటి సీఎం ప్రసంగంలో హరీశ్ రావును ఉద్దేశించి చీము, నెత్తురు ఉంటే రాజీనామా చేయాలని సవాల్ చేశారు. అయితే సీఎం మాట్లాడిన తెల్లవారే సరికి సిటీలో హరీశ్ రావును ఉద్దేశించి ఫ్లెక్సీలు వెలిశాయి. మైనంపల్లి అభిమానుల పేరిట ఈ ఫ్లెక్సీలు వెలిశాయి. ఏడ బోయే నీ రాజీనామా..రుణమాఫీ అయిపోయే..దమ్ముంటే రాజీనామా చేయి అగ్గిపెట్టె హరీశ్ రావు అంటూ నగరంలో పలు చోట్ల ఫ్లెక్సీలు దర్శనమిచ్చాయి.

హరీశ్ రావు పై కామెంట్స్

పబ్లిక్ వెళుతూ వెళుతూ ఆగి మరీ ఫ్లెక్సీలను గమనించి నవ్వుకోవడం కనిపించింది. హరీశ్ రావు తొందరపడి అనవసరంగా సవాల్ చేశారని కామెంట్స్ చేస్తున్నారు. అయితే హరీశ్ మాత్రం సీఎం రైతు రుణమాఫీ ఒక్క విడతలో చేయలేదని..సక్రమంగా రుణమాఫీ చేయలేదని ఆరోపణలు చేస్తున్నారు. పంజాగుట్ట, బేగంపేట్, సికింద్రాబాద్, ప్యాట్నీ, ప్యారడైజ్ ప్రాంతాలలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు సిటీలో చర్చనీయాంశంగా తయారయ్యాయి.

Related News

MLA Mallareddy: రాజకీయాలకు గుడ్ బై.. బిగ్ బాంబ్ పేల్చేసిన మల్లారెడ్డి.. అసలేమైంది..?

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Big Stories

×