BigTV English
Advertisement

New Year 2025 Vastu Tips: లక్ష్మీదేవి అనుగ్రహం కోసం.. న్యూ ఇయర్ రోజు ఇలా చేయండి

New Year 2025 Vastu Tips: లక్ష్మీదేవి అనుగ్రహం కోసం.. న్యూ ఇయర్ రోజు ఇలా చేయండి

New Year 2025 Vastu Tips: 2024 సంవత్సరం వీడ్కోలు పలకబోతోంది. 2025 సంవత్సరం రాబోతోంది. నూతన సంవత్సరం మొదటి రోజున మీరు ఇంట్లోకి 5 వస్తువులను తీసుకురావాలి. ఇది సానుకూల శక్తిని తీసుకురావడమే కాకుండా కుటుంబానికి లక్ష్మీ దేవి ఆశీర్వాదాన్ని కూడా తెస్తుంది.


ఈ కొత్త సంవత్సరం తన జీవితంలో ఆనందాన్ని నింపాలని, లక్ష్మీదేవి అనుగ్రహం తనపై ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటాడు. కొత్త సంవత్సరం మంచి , శుభప్రదంగా ప్రారంభం కావడానికి మీరు కొత్త సంవత్సరం మొదటి రోజున ఇంట్లోకి కొన్ని వస్తువులను తీసుకురావాలి. ఇది సానుకూల శక్తిని తీసుకురావడమే కాకుండా లక్ష్మీ దేవి ఆశీర్వాదాన్ని కూడా అందిస్తుంది.

తులసి మొక్క:
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొత్త సంవత్సరం మొదటి రోజున ఇంట్లో తులసి మొక్కను నాటండి. దీని తరువాత, ప్రతిరోజు ఉదయం సాయంత్రం పూజించండి. తులసి లక్ష్మీదేవికి ప్రతి రూపంగా పరిగణించబడుతుంది. అందుకే తులసిని పూజించడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడూ ఉంటుంది.


నెమలి ఈకలు:
జ్యోతిష్య శాస్త్ర విశ్వాసాల ప్రకారం, నెమలి ఈకలను ఇంట్లోకి తీసుకురావాలి. వీటిని ఇంటి ఆలయానికి తూర్పు దిశలో ఉంచాలి. మీరు ఈ పనిని కొత్త సంవత్సరం మొదటి రోజు మాత్రమే చేయాలి. ఈ రెమెడీని అనుసరించడం వల్ల కుటుంబంలో ఎప్పుడూ పాజిటివ్ ఎనర్జీ ప్రసరిస్తుంది.

దక్షిణవర్తి శంఖం :
మత విశ్వాసాల ప్రకారం దక్షిణవర్తి శంఖాన్ని ఇంటికి తీసుకువచ్చి, ఇంటి ఆలయంలో ప్రతిష్టించడం శ్రేయస్కరం. ఇలా చేయడం వల్ల కుటుంబంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి. కొత్త సంవత్సరం మొదటి రోజున ఈ పని చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి.

గణేశ విగ్రహం :
హిందూ మతంలో గణపతి దేవుడిని మొదటి పూజిస్తారు. గణపతిని ఆనందం, శ్రేయస్సు, కీర్తికి చిహ్నంగా భావిస్తారు. అందువల్ల కొత్త సంవత్సరం మొదటి రోజున ఇంటి పూజగదిలో వినాయకుడిని ప్రతిష్టించండి. ఇలా చేయడం వల్ల ఏడాది పొడవునా ఇంట్లో ఎలాంటి ఇబ్బందులు ఉండవు, సుఖశాంతులు ఉంటాయి.

స్వస్తిక్ చిహ్నం :
సనాతన ధర్మంలో స్వస్తిక చిహ్నం చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. ఈ గుర్తు సానుకూల శక్తికి చిహ్నం. కొత్త సంవత్సరంలో ఇంట్లో స్వస్తికను పూయడం ద్వారా, లక్ష్మీ దేవి వస్తుంది. ఆమె ఆశీర్వాదం కుటుంబ సభ్యులపై ఎల్లప్పుడూ ఉంటుంది.

 

Related News

Money Plant: మనీ ప్లాంట్ నాటుతున్నారా ? ఈ పొరపాట్లు అస్సలు చేయొద్దు

Vastu tips: వంట గదిలో మీ చేతిలోంచి ఈ ఐదు వస్తువులు జారి పడకుండా చూసుకోండి

Karthika Masam: కార్తీక మాసంలో.. ఎలాంటి దానాలు చేస్తే మంచిదో తెలుసా ?

Karthika Masam 2025: కార్తీక మాసంలో ఉసిరి దీపం వెలిగిస్తున్నారా ? ఈ పొరపాట్లు అస్సలు చేయొద్దు

Kartika Pournami 2025: కార్తీక పౌర్ణమి రోజు.. ఎన్ని దీపాలు వెలిగించాలి ?

Karthika Masam 2025: కార్తీక మాసంలో నారికేళ దీపం వెనుక అద్భుత రహస్యాలు.. తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు..

Vastu tips: రాత్రి పడుకునేటప్పుడు మంచం పక్కన నీళ్ల బాటిల్ పెట్టుకోకూడదా?

Vastu Tips: గుర్రపు నాడా ఇంటి గుమ్మానికి కట్టుకుంటే మంచిదా? ఆచారం వెనుక ఉన్న అర్థం ఏమిటి?

Big Stories

×