BigTV English

CM Chandrababu: బాబు చెప్పాడంటే.. చేస్తాడు అని.. దట్ ఈజ్ చంద్రబాబు

CM Chandrababu: బాబు చెప్పాడంటే.. చేస్తాడు అని.. దట్ ఈజ్ చంద్రబాబు

రాజకీయ నాయకులు హామీలు ఇవ్వడం సర్వసహజం.. కానీ ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం అతి తక్కువ. ఇందుకు భిన్నంగా వ్యవహరించారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఓ నిరుపేద కుటుంబానికి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలోని పెనుమాక గ్రామంలో మొదటి పెన్షన్‌ లబ్ధిదారుడైన బాణావతి పాములు నాయక్‌కు ఇల్లు కట్టిస్తానని ఇచ్చిన హామీ ఇచ్చారు చంద్రబాబు. తాను ఇచ్చిన హామీని కేవలం ఐదు నెలల్లోనే అమలు చేసి పక్కా భవనం నిర్మించారు. దీంతో సీఎం పట్ల హర్షం వ్యక్తం చేస్తోంది ఆ నిరుపేద కుటుంబం.

గత జూలై ఒకటవ తారీఖున పెన్షన్‌ పంపిణీ కార్యక్రమానికి పెనుమాక గ్రామానికి వచ్చిన సీఎం చంద్రబాబు హృదయాన్ని ఓ దృష్యం కదిలించింది. ఊరంతా పక్కా భవనాలు.. మధ్యలో ఓ పూరి గుడిసె.. అలా ఎందుకుంది? ఆ కుటుంబ ఆర్థిక స్థితి ఏంటి? ఇదే ప్రశ్న సీఎం చంద్రబాబును ఆలోచింపజేసింది. అయితే, అందరు సీఎంలలా.. అధికారులను ఆ గుడిసెకు పంపి వివరాలు తెలుసుకోలేదు చంద్రబాబు. తానే స్వయంగా ఆ గుడిసె లోపలికి వెళ్లి కుటుంబ ఆర్థిక పరిస్థితులు ఏంటి? కుటుంబంలో ఎవరెవరు ఏం పని చేస్తున్నారు? పిల్లల చదువులు ఎలా సాగుతున్నాయని స్వయంగా అడిగి తెలుసుకున్నారు. నిరుపేద కుటుంబంలో ఇద్దరు పిల్లలను చదివిస్తూ.. తలదాచుకున్న ఆ కుటంబ దీన స్థితిని చూసి చలించిపోయారు. పక్కా ఇళ్లు నేను కట్టిస్తానని, స్వయం ఉపాధితో పిల్లలను చదివించండని ఆ కుటుంబ యజమానులకు హామీ ఇచ్చారు.


కేవలం కుటుంబానికి హామీ ఇచ్చేసి.. అమలు చేసినప్పుడు చేద్దాంలే అని చేతులు దులుపుకోలేదు సీఎం. గుడిసెలో తలదాచుకుంటూ జీవిస్తున్న కుటుంబం పట్ల సానుభూతి చూపుతూ అదే రోజు పెన్షన్‌ పంపిణీ కార్యక్రమంలో చంద్రబాబు ప్రసంగించారు. వారికి పక్కా గృహం కట్టిస్తానని సభా ముఖంగా ప్రకటించారు.

జూలై ఒకటిన హామీ ఇస్తే.. డిసెంబర్‌ నెలాఖరుకల్లా పక్కా గృహం పూర్తి అయ్యింది. ఇన్నేళ్లు పూరి గుడిసెలో జీవనం సాగించిన పెన్షన్‌ స్కీమ్‌లో తొలి లబ్ధిదారుడైన బాణావతి పాములు నాయక్ అనే వ్యక్తి ఇప్పుడు పక్కా గృహంలోకి వెళ్లేలా ఏర్పాట్లు చకచకా జరిగిపోయాయి. దీంతో బాణావతి పాములు నాయక్ బావోద్వేగంతో సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. తమకు ఊహ తెలిసిన నాటి నుంచి ఎన్టీఆర్‌ను అభిమానిస్తూ తెలుగుదేశం పార్టీలోనే ఉన్నామని.. మాకు ఇల్లు కట్టుకునే స్తోమత లేదని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లామని.. ఎన్టీఆర్‌ పేరు చెప్పగానే నేను మీకు ఇళ్లు కట్టిస్తానని సీఎం అండగా నిలిచారని గుర్తు చేశారు పాములు నాయక్‌ దంపతులు.

Also Read: ఏపీకి ఇది గేమ్ ఛేంజర్ అవుతోంది.. మీరే చూడండి: సీఎం చంద్రాబు

ఆజన్మాంతం చంద్రబాబుకు రుణపడి ఉంటామని బాణావతి పాములు నాయక్ భార్య సీత బావోద్వేగానికి గురవుతూ తెలియజేస్తోంది. తాను ఏడాదికి ఒకసారి దేవుని మాల వేస్తానని.. ఇప్పటి నుంచి చంద్రబాబునే దేవుడిగా కొలుస్తానంటున్నాడు బాణావతి పాములు నాయక్. తమ గృహ ప్రవేశానికి సీఎంను ఆహ్వానిస్తామని తెలుపుతున్నారు ఈ నిరుపేద దంపతులు. ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటే.. రాజకీయ నాయకులను ప్రజలు కేవలం నాయకులుగా మాత్రమే చూడరు. దేవుళ్లుగా భావించి పూజలు చేస్తూ నీరాజనాలు పడతారని చంద్రబాబు ద్వారా సొంత ఇంటి కల నిజం చేసుకున్న పెనుమాక లోని నిరుపేద కుటుంబం మరోసారి నిరూపించింది.

ఇదిలా ఉంటే.. ఏపీలో ఇవాళ ఎన్టీఆర్ సామాజిక పెన్షన్లను పంపిణీ చేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా 65 లక్షల మందికిక పెన్షన్లు అందజేస్తారు. పల్నాడు జిల్లా నరసరావుపేట నియోజకవర్గం యలమందల గ్రామంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొంటారు. బీసీ వర్గానికి చెందిన వుల్లంగుల ఏడుకొండలు, ఎస్సీ కాలనీలోని ఎస్సీ వర్గానికి చెందిన మహిళ తలారి శారమ్మ ఇళ్లకు వెళ్లి చంద్రబాబు పింఛన్లు పంపిణీ చేస్తారు. గ్రామస్తులతో ముచ్చటిస్తారు. ఇందు కోసం వేదిక ఏర్పాటు చేశారు. అనంతరం అధికారులు, ప్రజాప్రతినిధుల సమావేశంలో జిల్లా అభివృద్ధిపై దిశానిర్దేశం చేయనున్నారు. అనంతరం ప్రముఖ శైవ క్షేత్రం కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వర స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు.

Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×