E-Paper
Advertisement

YSRCP : వెన్నుపోటు.. వైసీపీ కొత్త రూటు, ఇంత దిగజారుతారా?

YSRCP : వెన్నుపోటు.. వైసీపీ కొత్త రూటు, ఇంత దిగజారుతారా?
Advertisement

ఏపీ ప్రభుత్వంపై అర్థవంతమైన విమర్శలు చేయకుండా బురదజల్లడంలో ప్రధాన ప్రతిపక్షం వైసీపీ ముందున్నట్టు తెలుస్తున్నది. ఎందుకంటే ఏదైనా తప్పు జరిగాక విమర్శలు చేయడం సహజం. అది ప్రతిపక్ష హోదాలో వారి డ్యూటీ కూడా. కానీ ఏమీ జరగకముందే ప్రభుత్వాన్ని విమర్శించడంలో గల ఆంతర్యంఏమిటి? దీని కన్నా బుద్ది తక్కువ పని ఇంకొకటి ఉంటుందా? అని కూటమి ప్రభుత్వంలోని నేతలు, తెలుగు తమ్ముళ్లు చర్చించుకుంటున్నారు. ఎవరైనా ప్రభుత్వం ఏర్పాటయ్యాక వారికి పనిచేసుకోవడానికి కొంత సమయం ఇస్తారు. అది ప్రతిపక్ష పార్టీకి ఉండే కనీస లక్షణం. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అదే చేసింది. ఆరు నుంచి ఏడాదిపాటు సమయం ఇచ్చాక వారు విమర్శలు చేయడం మొదలెట్టారు.

మరి జగన్ పార్టీకి ఇది తెలీదా?

ఏపీలో కూటమి ప్రభుత్వం అలా కొలువు దీరిందో లేదో అప్పటి నుంచి వైసీపీ విమర్శలు చేస్తూనే వచ్చింది. మూడు రాజధానుల అంశాన్ని కూటమి సర్కార్ వ్యతిరేకిస్తూ అమరావతిని ఏపీకి శాశ్వత రాజధానిగా ప్రకటించి గతంలో ఎక్కడైతే పనులుఆగిపోయాయో మరల అక్కడి నుంచి ప్రారంభించింది. రాజధాని చుట్టూ టీడీపీ నేతలకు భూములు ఉన్నందునే చంద్రబాబు అమరాతిని రాజధానిగా ఎంచుకున్నారని విమర్శించడం మొదలెట్టారు. ఇక విశాఖను ఆర్థిక రాజధానిగా చంద్రబాబు ప్రకటించాక అక్కడ సైతం టీడీపీ నేతల భూములు కొన్నారని.. అందుకే అలా ప్రకటించారని విమర్శించారు.తండ్రి తర్వాత తనయుడిపై మాటల దాడి మొదట్టారు.

రెడ్ బుక్ పేరిట బద్నాం..

Advertisement

గత ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన కొందరు భారీ ఎత్తున అవినీతికి పాల్పడటంతో కూటమి సర్కార్ రాగానే వాటిపై విచారణకు ఆదేశించింది. అందులో నకిలీ మద్యం, లిక్కర్ సిండికేట్ మీద ఉక్కుపాదం మోపారు. అంతేకాకుండా పలు హత్యారాజకీయాల్లోనూ హస్తమున్న వారిపై విచారణకు ఆదేశించి వారిని జైలుకు పంపారు.దీనిపై కూడా వైసీపీ రివర్స్ పాలిటిక్స్ చేయడం మొదలెట్టింది. మంత్రి నారాలోకేశ్ రెడ్ బుక్‌ను అడ్డం పెట్టుకుని కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని వైసీపీ కీలక నేతలు విమర్శల దాడులు మొదలెట్టారు.తాము అధికారంలోకి రాగానే మరల దెబ్బకు దెబ్బతిస్తామని ఏకంగా బెదిరింపులకు సైతం దిగారు.

వెన్నుపోటు పేరిట బురద రాజకీయం..

తాజాగా కేబినెట్ సమావేశానికి హాజరుకాకుండా మంత్రి లోకేశ్ యూకే పర్యటనకు వెళ్లడంపై వైసీపీ నేతలు మరోసారి విషం కక్కారు. ఈసారి ఒక అడుగు ముందేకేసి మరి తండ్రికే వెన్నుపోటు పొడిచేందుకు లోకేశ్ లండన్ వెళ్లాడని సోషల్ మీడియాలో దుష్ప్రచారం మొదలెట్టారు.తెలుగుదేశం పార్టీని స్థాపించిన తన మామ ఎన్టీ రామారావు ట్రీట్మెంట్ కోసం ఫారిన్ వెళితే ఆయన వచ్చేసరికి పార్టీని చంద్రబాబు హస్తగతం చేసుకుని, ఎమ్మెల్యేలతో ఆయన మీద తిరుగుబాటు చేయించారని, పిల్లనిచ్చిన మామకే వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. తాజాగా లోకేశ్ సైతం విదేశాల్లో కుట్ర చేసి తన తండ్రి నుంచి పార్టీని లాక్కుని, సీఎం అవుదామని ప్లాన్ చేస్తున్నారని.. అందుకే పదే పదే విదేశాలకు లోకేశ్ వెళ్తున్నారని పుకారు పుట్టించారు. వైసీపీ చేస్తున్న ఆరోపణలపై కూటమి నేతలు తమదైన శైలిలో గట్టిగా బదులిస్తున్నారు. అధికారం కోసం సొంత బాబాయినే హత్యచేయించిన జగన్‌కు ఇంతకు మించిన రాజకీయం ఏం తెలుస్తుందిలే అంటూ కౌంటర్లు ఇస్తున్నారు.

Related News

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

Big Stories

Advertisement
×