E-Paper
Advertisement

YS Jagan Mohan Reddy : ఘనంగా ముఖ్యమంత్రి జగన్ జన్మదిన వేడుకలు.. ట్విట్టర్‌ ట్రెండింగ్‌లో టాప్..

YS Jagan Mohan Reddy : ఘనంగా ముఖ్యమంత్రి జగన్ జన్మదిన వేడుకలు.. ట్విట్టర్‌ ట్రెండింగ్‌లో టాప్..
Advertisement

YS Jagan Mohan Reddy : ఆంధ్రప్రేదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. రాజకీయ ప్రముఖులు, సెలబ్రటీలు సీఎం జగన్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కొందరు క్యాంప్ ఆఫీసుకు నేరుగా వెళ్లి సీఎంకు పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు చెబుతున్నారు. టాలీవుడ్ కింక్ నాగార్జున ట్విట్టర్‌లో “ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి గారు మీకు జన్మదిన శుభాకాంక్షలు..మీరెప్పుడూ ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా” అని అన్నారు.

కోలీవుడ్ స్టార్ విశాల్ కూడా ముఖ్యమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ” ముఖ్యమంత్రి జగన్‌కు జన్మదిన శుభాకాంక్షలు.. మీకు భగవంతుని ఆశిస్సులు ఉండాలని కోరుకుంటున్నా” అని విశాల్ ట్వీట్ చేశారు.

Advertisement

ముఖ్యమంత్రి జగన్‌ను ట్విట్టర్‌లో జన్మదిన శాభాకాంక్షలు వెల్లువలా వస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా.. దేశ విదేశాల నుంచి అనేక మంది ప్రముఖులు, సెలబ్రెటీలు సీఎంకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రస్తుతం దేశంలో #HBDYSjagan హ్యాష్‌టాగ్ ట్రెండింగ్‌లో ఉంది. మామూలుగా సినీ తారల జన్మదిన వేడుకలు ట్విట్టర్‌లో టాప్‌లో ట్రెండింగ్ అవుతాయి.. ముఖ్యమంత్రి జగన్ బర్త్‌డే విషస్ టాప్‌లో ట్రెండ్ అవడం విశేషం. ఇప్పటికే 5లక్షలకు పైగా ట్వీట్లతో టాప్ ప్లేస్‌లో ఉంది #HBDYSjagan హ్యాష్‌టాగ్.

తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జన్మదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి జగన్ క్యాంపు కార్యాలయంలోనే ఉండడంతో అక్కడ వాతావరణం అట్టహాసంగా మారింది. వేదపండితులు సీఎం జగన్‌ను ఆశీర్వదించారు.

Advertisement

ఉన్నతాధికారులు, మంత్రులు సీఎంకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం క్యాంపు కార్యాలయంలో కేక్ కట్ చేశారు ముఖ్యమంత్రి. రాష్ట్రవ్యాప్తంగా మూడు రోజులపాటు సీఎం జగన్ జన్మదిన వేడుకలు జరపాలని వైసీపీ పార్టీ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.

Tags

Related News

ఆ దూడ తపన.. అమ్మ బొమ్మ నుండి పాలు తాగడానికి ప్రయత్నం, వీడియో వైరల్

బిగ్‌ టీవీ ఎఫెక్ట్.. ఏపీ డీఎస్సీ స్కామ్ బట్టబయలు, ఎస్జీటీ ప్రభాకర్‌పై ఎంక్వైరీకి ఆదేశం

తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాలు, లారీని ఢీ కొన్న ట్రావెల్ బస్సు, స్సాట్‌లో 15 మంది

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం? ఏపీకి వర్ష సూచన, అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ

మీ భయానికి నిదర్శనం కాదా? బిగ్‌టీవీ సోషల్ మీడియాపై ఆంక్షలు ఎందుకు?- మాజీమంత్రి రోజా ప్రశ్న

ఇంకా దాగుడు మూతలు ఎందుకు.. చంద్రబాబు, నారా లోకేష్ పై నిప్పులు చెరిగిన జగన్!

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

Big Stories

Advertisement
×