Aus vs Pak Women: ఐసీసీ వన్డే మహిళల వరల్డ్ కప్ 2025 టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ రసవత్తర ఫైట్ జరగనుంది. ఉమెన్స్ ఆస్ట్రేలియా వర్సెస్ పాకిస్తాన్ జట్ల మధ్య ఇవాళ కీలక మ్యాచ్ జరగనుంది. ఇప్పటికీ ఈ టోర్నమెంట్ లలో 8 మ్యాచ్ లు పూర్తి కాగా, ఇవాళ తొమ్మిదవ మ్యాచ్ జరగనుంది.
Also Read: Gautam Gambhir: గంభీర్ మహాముదురు.. ట్రోలింగ్ కు చెక్ పెట్టేందుకు బీరు, బిర్యానీలు పెట్టి మరీ !
వన్డే వరల్డ్ కప్ 2025 టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ రసవత్తర మ్యాచ్ ఆస్ట్రేలియా మహిళలు వర్సెస్ పాకిస్తాన్ మహిళల మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ శ్రీలంక లోని కొలంబో ప్రేమ దాస స్టేడియం వేదికగా నిర్వహించనున్నారు. మొన్న టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ కూడా ఇక్కడే జరిగింది. ఆ రోజు నుంచి పాకిస్తాన్ కొలంబోలోనే ఉంది. ఇండియా నుంచి కొలంబో చేరుకున్న ఆస్ట్రేలియా మ్యాచ్ కు సిద్ధమైంది. భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ మధ్యాహ్నం 3 గంటల సమయంలో ప్రారంభమవుతుంది.
అర్ధరాత్రి 11 గంటల్లోపు మ్యాచ్ పూర్తయ్యే ఛాన్సులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా జట్టు హాట్ ఫేవరెట్ గా కనిపిస్తోంది. ఈ టోర్నమెంట్ లో ఇప్పటికే ఆస్ట్రేలియా రెండు మ్యాచ్ లలో ఆడి ఒక మ్యాచ్ గెలిచింది. మరో మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. ఏం కావాలి శ్రీలంక వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. దీంతో పాయింట్లు పట్టికలో మూడో స్థానంలో ఆస్ట్రేలియా నిలిచింది.
అటు పాకిస్తాన్… టీమిండియా, బంగ్లాదేశ్ చేతిలో దారుణంగా ఓడిపోయి పాయింట్ల పట్టికలో చిట్ట చివరన ఉంది. ఇందులో పాకిస్తాన్ ఓడిపోతే ఇంటికి వెళ్లడం గ్యారంటీ అంటున్నారు క్రీడా విశ్లేషకులు. ఇది ఇలా ఉండగా నిన్న జరిగిన ఇంగ్లాండ్ వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్ లో ఇంగ్లీష్ ప్లేయర్లు గ్రాండ్ విక్టరీ కొట్టారు. లీగ్ దశ పూర్తయిన తర్వాత సెమీఫైనల్ 1 అలాగే రెండో సెమీఫైనల్ 2 మ్యాచ్ లు జరగనున్నాయి. ఈ రెండు మ్యాచ్లు అక్టోబర్ 29 అలాగే అక్టోబర్ 30వ తేదీలలో జరగనున్నాయి. నవంబర్ రెండవ తేదీన ఫైనల్ మ్యాచ్ ఉండనుంది.
Also Read: Inzamam-ul-Haq: రోహిత్ శర్మ ఓ ముసలోడు, పందిలాగా ఉంటాడు…అందుకే కెప్టెన్సీ పీకిపారేశారు !
ఆస్ట్రేలియా మహిళలు: ఫోబ్ లిచ్‌ఫీల్డ్, అలిస్సా హీలీ (c & wk), బెత్ మూనీ, ఎల్లీస్ పెర్రీ, అన్నాబెల్ సదర్లాండ్, ఆష్లీ గార్డనర్, తహ్లియా మెక్‌గ్రాత్, అలానా కింగ్, సోఫీ మోలినెక్స్, కిమ్ గార్త్, డార్సీ బ్రౌన్
పాకిస్తాన్ మహిళలు: మునీబా అలీ, సిద్రా అమీన్, సదాఫ్ షమాస్, అలియా రియాజ్, నటాలియా పెర్వైజ్, ఫాతిమా సనా (c), సిద్రా నవాజ్ (wk), రమీన్ షమీమ్, నష్రా సంధు, డయానా బేగ్, సాదియా ఇక్బాల్