Chennai News: తమిళనాడులోని చెన్నై సిటీలో ఓ వసతి గృహంలో వ్యభిచారం జరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. రెండు నెలల కిందట అంటే ఆగస్టు 24న తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో తొమ్మిదో తరగతి చదివే బాలికను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. దీనిపై తీగలాగితే అసలు డొంక కదిలింది.
చెన్నైలో దారుణం
వ్యభిచారం కేసులో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సహాయ నటి నాగలక్ష్మి, అంజలి, కార్తిక్, కుమార్‌లను చెన్నై మహిళా పోలీసులు ఇటీవల అరెస్టు చేశారు. వారిని విచారించగా షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆగస్టులో పట్టుబడిన బాలిక 9వ తరగతి చదువుతోంది. అయితే బాలిక తండ్రి మరణించడంతో ఆమె తల్లి మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది. తల్లిదండ్రులు లేక అనాథగా మారిపోయింది ఆ బాలిక.
దీంతో బాలిక తన తల్లి ఫ్రెండ్ కేకే నగర్‌కు చెందిన క్లబ్ డ్యాన్సర్ పూంగొడి దగ్గరకు వెళ్లింది. ఆ తర్వాత పూంగొడి, తన మేనకోడలు ఐశ్వర్య వద్దకు వెళ్లింది. వీరిద్దరు కమెడియన్ భారతి కన్నన్‌తో కలిసి బాలికతో వ్యభిచారం చేయించేవారు. బాలికను అడ్డుపెట్టుకుని లక్షల్లో సంపాదన మొదలుపెట్టినట్టు పోలీసుల విచారణలో తేలింది.
బాలిక చుట్టూ కమెడియన్, క్లబ్ డ్యాన్సర్
దీంతో పోలీసులు రంగంలోకి దిగి కమెడియన్ భారతి కన్నన్, క్లబ్ డ్యాన్సర్ పూంగొడి, ఐశ్వర్యతోపాటు అధికార పార్టీకి చెందిన ఓ కార్యకర్తను పోక్సో చట్టం కింద అరెస్టు చేశారు. తనకు మంచి చేస్తానని హామీ ఇచ్చి వ్యభిచారంలోకి దింపారని బాలిక జరిగిన విషయాలను పూసగుచ్చి చెప్పింది. నిందితులను న్యాయస్థానంలో హాజరుపరిచడంతో వారికి రిమాండ్ తరలించారు.
ALSO READ: కాలువలోకి దూకి ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య