Samantha: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంది సమంత (Samantha). ఒకవైపు హీరోలకు హీరోయిన్గా నటించడమే కాకుండా మరొకవైపు లేడి ఓరియంటెడ్ చిత్రాలతో యాక్షన్ పర్ఫామెన్స్ తో అందరినీ అబ్బురపరిచింది. తెలుగు, తమిళ్, హిందీ భాషలలో వరుసగా సినిమాలు , వెబ్ సిరీస్ లు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న ఈమె.. వ్యక్తిగత కారణాలవల్ల కొంతకాలం సైలెంట్ అయిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా ఇప్పుడు మళ్లీ ఇండస్ట్రీలో కం బ్యాక్ అయ్యే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగానే వరుస సినిమాలకు, వెబ్ సిరీస్ లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. తాజాగా మరో కొత్త అవతారం ఎత్తింది.
తాజాగా బ్రాండ్ అంబాసిడర్ గా బాధ్యతలు చేపట్టింది సమంత. అసలు విషయంలోకి వెళ్తే.. ఆభరణాల విక్రయ సంస్థ జోయాలుక్కాస్ (Joyalukkas) తాజాగా తమ ప్రచారకర్తగా సినీనటి సమంతను నియమించింది. అంతర్జాతీయ మార్కెట్లో సంస్థ హరిత డిజైన్లు, అద్భుత ఆభరణాల నైపుణ్యాన్ని తనదైన శైలిలో సమంత పరిచయం చేస్తారని ఆ సంస్థను స్పష్టం చేసింది. ఇకపోతే ఇప్పటికే ఈ సంస్థకు కాజోల్ (Kajol) ప్రచారకర్తగా ఉండగా.. ఇప్పుడు సమంత కూడా జత చేరారు. సమంతకి ఉన్న ఆదరణ జోయాలుక్కాస్ మూడు దశాబ్దాల ప్రయాణాన్ని ప్రతిబింబిస్తుంది అని వారు తమ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం సమంత బ్రాండ్ అంబాసిడర్ గా బాధ్యతలు చేపట్టడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉండగా తాజాగా సమంత ప్రచారకర్తగా మారడంతో దీనికోసం ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంది అనే వార్తలు వైరల్ అవుతున్నాయి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ బ్రాండ్ ప్రమోటర్ కి సుమారుగా 2 నుండీ 3 కోట్ల వరకు సమంత రెమ్యూనరేషన్ గా తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కానీ దీనిపై ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
సమంత ప్రస్తుతం బాలీవుడ్ లో రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో ‘రక్త బ్రహ్మాండ్’ అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. అలాగే తెలుగులో ‘మా ఇంటి బంగారం’ అనే చిత్రంలో కూడా నటిస్తోంది. ఈ సినిమాకి ‘ఓ బేబీ’ సినిమాతో దర్శకురాలిగా మరింత పాపులారిటీ సొంతం చేసుకున్న నందిని రెడ్డి (Nandini Reddy) దర్శకత్వంలోనే మళ్లీ సమంత సినిమా చేయబోతున్నారు. అలాగే కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరో శింబు (Simbu) తో ఈమె ఒక సినిమా చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది.
‘ఏ మాయ చేసావే’ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ.. మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకుంది. ఈ సినిమా హీరో నాగచైతన్య (Naga Chaitanya) ను ప్రేమించి, పెళ్లి చేసుకున్న ఈమె నాలుగేళ్లకే విడిపోయింది. అప్పటినుంచి ఎన్నో విమర్శలు ఎదుర్కొన్న సమంత ఇటీవల బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరు తో ఎఫైర్ కొనసాగిస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి.దీనిపై స్పందించి ఈ రూమర్స్ కి చెక్ పెట్టాలని అభిమానులు కూడా కోరుకుంటున్నారు.
ALSO READ: Yash 21 Movie: ఇప్పుడు ఆలస్యమేం లేదు… యష్ నెక్ట్స్ సినిమా వచ్చేస్తుంది!