టైటిల్ కామెడీగానే ఉండొచ్చు కానీ, ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జగన్ నిన్ననే ఏపీకి వచ్చి పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. ఆయన మాట మేరకు ఎమ్మెల్సీలు మండలిలో రచ్చ చేశారు, మిగతా నాయకులు, కార్యకర్తలు వైసీపీ హయాంలో మొదలైన మెడికల్ కాలేజీల వద్దకు వెెళ్లి గొడవ చేయాలనుకున్నారు. కొంతమంది హౌస్ అరెస్ట్ అయ్యారు, మిగిలిన కొందర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరి జగన్ ఎక్కడ, జగన్ బెంగళూరు మెడికల్ కాలేజీ వద్ద ధర్నా చేస్తున్నారట. ఈ జోక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైసీపీ నేతలంతా ఏపీలో హడావిడి పడుతుంటే, జగన్ మాత్రం బెంగళూరులో రెస్ట్ తీసుకుంటున్నారు.
కూటమి ప్రభుత్వ చేతగానితనమే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ – భూమన అభినయ్ రెడ్డి గారు
చలో మెడికల్ కాలేజ్ లో భాగంగా మదనపల్లి మెడికల్ కాలేజీ ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్ గారు సందర్శించారు ఈ సందర్భంగా… pic.twitter.com/KI8O21GEbG
— Bhumana Abhinay Reddy (@Bhumana_Abhinay) September 19, 2025
పోలీసుల అడ్డంకులు దాటుకుని..
పోలీసుల అడ్డంకులు దాడుకుని ఛలో మెడికల్ కాలేజీ అంటూ ఈరోజు సాక్షి మీడియాలో హడావిడి జరిగింది. సోషల్ మీడియా థంబ్ నెయిల్స్ అన్నిట్లో జగన్ హైలైట్ అవుతున్నారు. ఏదో పోరుబాటకు సిద్ధమైనట్టు.. సైనికులారా సిద్ధంకండి అన్నట్టుగా ఆయన ఫొటో ఉంటుంది. కానీ ఆయన మాత్రం సీన్ లోకి రారు. ఆయన ఆదేశాలు పాటించి నేతలు, కార్యకర్తలు రోడ్లపైకి రావాలి, కానీ జగన్ మాత్రం యధావిధిగా ఇంట్లోనుంచి బయటకు రారు. అయితే వైసీపీ అనుకూల మీడియా, సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో మాత్రం జగనే ఈ ఆందోళనలను ముందుండి నడిపించినట్టుగా కలరింగ్ ఇస్తున్నారు.
తాడేపల్లి.
ఈనెల 19న వైయస్సార్సీపీ ‘ఛలో మెడికల్ కాలేజీ’
పార్టీ విద్యార్థి, యువజన విభాగాల ఆధ్వర్యంలో కార్యక్రమంతాడేపల్లి:
తమ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన 10 కొత్త మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరించాలన్న ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఈనెల 19న ‘ఛలో మెడికల్ కాలేజీ’… pic.twitter.com/kE5cjf0dqE— YSR Congress Party (@YSRCParty) September 18, 2025
నేనొస్తున్నా..
ఇటీవల ఓ ప్రెస్ మీట్ లో జగన్ చెప్పిన మాట ఇది. త్వరలో జరగబోయే ధర్నాలలో తాను కూడా పాల్గొంటానని ఆయనే చెప్పారు. మాటిచ్చారు సరే, మరి దానిమీద నిలబడితే కదా అని ప్రశ్నిస్తున్నారు వైసీపీ కార్యకర్తలు. అసెంబ్లీకి రారు, కనీసం రోడ్లపై నిరసన తెలిపేందుకు కూడా రారు. ఎంతసేపు అక్కడ మండలిలో ఎమ్మెల్సీలు పోరాడండి, ఇక్కడ రోడ్లపై నేతలు పోరాడండి అని సలహాలిస్తున్నారే కానీ, జగన్ ఏడీ? ఎక్కడా? అని వెదుకుతున్నారు నేతలు.
అసెంబ్లీ కథ కంచికేనా?
ఎన్నికలు వచ్చేస్తున్నాయి, వచ్చేస్తున్నాయంటూ ప్రెస్ మీట్లలో నేతల్ని బాగానే ఉత్సాహపరుస్తున్నారు జగన్. మరి ఎన్నికలు వచ్చేస్తుంటే జగన్ ఇంకా బెంగళూరులో ఎందుకు ఉంటున్నట్టు. కార్యక్షేత్రంలో దిగి పార్టీని ఎన్నికలకు సంసిద్ధం చేసుకోవాలి కదా. కానీ ఆయన మాత్రం సేఫ్ గేమ్ ఆడుతున్నారు. ఇక్కడ కేడర్ మాత్రం ఆయనకోసం సొంత పనులు మానుకుని రోడ్లెక్కాలి, ధర్నాలు చేయాలి. ఎంతకాలం ఈ డబుల్ గేమ్ అని వైసీపీలో అసంతృప్త స్వరాలు వినపడుతున్నాయి. ఇక అసెంబ్లీ విషయానికొస్తే జగన్ హాజరు కానంటూ మొండికేయడం సరికాదని వైసీపీలో సీనియర్ నేతలు గుసగుసలాడుకుంటున్నారు. దానికి తగిన కారణాన్ని కూడా ఆయన చెప్పలేకపోతున్నారని, పోనీ ఆయన వెళ్లకపోయినా వైసీపీ ఎమ్మెల్యేలనయినా స్థానిక సమస్యలపై మాట్లాడేందుకు అసెంబ్లీకి పంపించొచ్చు కదా అని అంటున్నారు. దీనికి జగన్ సమాధానం ఆల్రడీ చెప్పేశారు. కేవలం వైసీపీ ఎమ్మెల్సీలు మాత్రమే మండలిలో పోరాటం చేయాలి అని ఆయన క్లారిటీ ఇచ్చారు. అంటే పరోక్షంగా ఎమ్మెల్యేలపై ఆయన ఆంక్షలు విధించారన్నమాట.