Best Gaming Phone| 2025లో రెండు గేమింగ్ ఫోన్లుజ.. ఏసస్ROG 9, iQOO నియో 10 ప్రో టాప్‌లో ఉన్నాయి. PUBG, COD మొబైల్ వంటి గేమ్‌లకు ఇవి అద్భుతమైన పనితీరు ఇస్తాయి. ఏది బెటర్ గేమింగ్ ఫోన్ అని తెలుసుకోవాలంటే, రెండింటి స్పెసిఫికేషన్లు, పనితీరు మధ్య పోలిక చేయడం మంచిది. సులభంగా ఒక బ్రేక్‌డౌన్ చూద్దాం.
పనితీరు, ప్రాసెసర్
ఏసస్ROG 9లో స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 4 ప్రాసెసర్ ఉంది. ఇది గేమింగ్‌లో మెరుగైన, అసలు ల్యాగ్ లేకుండా గేమింగ్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది. iQOO నియో 10 ప్రోలో మీడియాటెక్ డైమెన్సిటీ 9400 చిప్ ఉంది. AnTuTu బెంచ్‌మార్క్‌లలో ఈ రెండు ఫోన్ల మధ్య చూస్తే.. iQOO చిప్ కొంచెం మెరుగ్గా స్కోర్ చేస్తుంది. రెండూ గేమ్‌లలో స్మూత్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తాయి, కానీ రా పెర్ఫార్మెన్స్‌లో iQOOకు స్వల్ప ఆధిక్యంలో ఉంది. ఎందుకంటే స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్ కంటే డైమెన్సిటీ 9400 స్వల్ప ఆధిక్యంలో ఉంది.
డిస్‌ప్లే క్వాలిటీ
ఏసస్ROG 9లో 165Hz రిఫ్రెష్ రేట్‌తో AMOLED డిస్‌ప్లే ఉంది. ఇది వివిడ్ కలర్లు, స్మూత్ విజువల్స్ ఇస్తుంది, గేమింగ్‌కు బాగా సరిపోతుంది. iQOO నియో 10 ప్రోలో 144Hz AMOLED డిస్‌ప్లే ఉంది. రెండూ గేమింగ్‌కు గొప్పవి, కానీ ఏసస్ హై రిఫ్రెష్ రేట్‌తో కాస్త ముందంజలో ఉంది.
కూలింగ్ సిస్టమ్
ఏసస్ ROG 9లో బ్యాక్‌లో అడ్వాన్స్‌డ్ ఎయిర్-కూలింగ్ సిస్టమ్ ఉంది. దీర్ఘకాలిక గేమింగ్‌లో ఫోన్ హీట్ కాకుండా చూస్తుంది. iQOO నియో 10 ప్రోలో కూడా ఎఫిషియెంట్ కూలింగ్ ఉంది. కానీ ROG 9లో హార్డ్‌కోర్ గేమర్ల కోసం అదనపు టెక్నాలజీ ఉంది. ఇది ఇంటెన్స్ గేమింగ్‌కు బెటర్.
బ్యాటరీ, చార్జింగ్
ఏసస్ROG 9లో 6000mAh బ్యాటరీ, 65W ఫాస్ట్ చార్జింగ్ ఉంది. గంటల తరబడి గేమింగ్‌కు సరిపోతుంది. iQOO నియో 10 ప్రోలో 7000mAh బ్యాటరీ, 120W ఫాస్ట్ చార్జింగ్ ఉంది. చార్జింగ్ స్పీడ్ ఎక్కువ, బ్యాటరీ కూడా పెద్దది కాబట్టి, రౌండ్-ది-క్లాక్ గేమింగ్ సాధ్యమే. iQOO బ్యాటరీ, ఛార్జింగ్ లో క్లియర్ విన్నర్.
డిజైన్, గేమింగ్ ఫీచర్లు
ఏసస్ROG 9 గేమర్ డిజైన్‌తో RGB లైటింగ్‌తో వచ్చింది. ప్రీమియం కేసింగ్, గేమర్లకు పర్పస్‌ఫుల్. iQOO నియో 10 ప్రో షార్ప్ లుక్‌తో ఫ్యాషనబుల్, డైలీ యూజ్‌కు కూడా సరిపోతుంది. ఏసస్ లాగా కేవలం గేమింగ్-సెంట్రిక్ కాదు. iQOOలో అదనపు గేమింగ్ ట్రిగ్గర్లు ఉన్నాయి, కంట్రోలర్ అటాచ్ చేయకుండా కంట్రోల్ బాగుంటుంది. ఇక్కడ చూస్తే రెండూ వేర్వేరు ప్రత్యేకలతో తమదైన శైలిలో ఉన్నాయి.
కెమెరా, వర్సటాలిటీ
ఏసస్ROG 9 గేమింగ్‌పై ఫోకస్ చేస్తుంది. కెమెరా సెకండరీ. కానీ మంచిదే. iQOO నియో 10 ప్రో కెమెరా గేమింగ్, ఫోటో/వీడియోలకు మరింత వర్సటైల్. స్టూడియో-లెవెల్ కంటెంట్‌కు మంచిది, కానీ ఏసస్ ప్యూర్ గేమింగ్ ఫోకస్‌తో వచ్చింది.
ధర 
ఏసస్ROG 9 ధర సుమారు ₹83,990 నుంచి మొదలవుతుంది, ప్రీమియం రేంజ్. iQOO నియో 10 ప్రో ₹33,998 మాత్రమే, బడ్జెట్-ఫ్రెండ్లీ. బడ్జెట్ గేమర్లకు iQOO వాల్యూ ఫర్ మనీ బెటర్.
ఏది బెటర్ గేమింగ్ ఫోన్?
హార్డ్‌కోర్ గేమర్లకు ఏసస్ROG 9 విన్నర్. దాని కూలింగ్, ట్రిగ్గర్లు, హై రిఫ్రెష్ రేట్ ఇంటెన్స్ గేమింగ్‌లో ఎక్సెల్ అవుతాయి. బడ్జెట్ చూసి కొనుగోలు చేసే గేమర్లకు iQOO నియో 10 ప్రో గ్రేట్. గేమింగ్, డైలీ యూజ్ బ్యాలెన్స్ చేస్తుంది. ధర, ఇతర ఫీచర్లు, మీ అవసరాల ప్రకారం ఎంచుకోండి!
Also Read: ప్రపంచంలోని అత్యంత ఖరీదైన స్మార్ట్ ఫోన్‌లు.. వీటి ధర కోట్లలోనే