Vijayawada: వైసీపీ అధికార గెజిట్ పత్రికను ఏకేశారు ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల. ఓ రేంజ్‌లో ఆమె ఫైర్ అయ్యారు. ఆత్మీయ సంబంధాలని అంటగడతారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు షర్మిల ఈ రేంజ్‌లో ఆగ్రహానికి కారణమేంటి? ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే..’
ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల తన కూతురు వివాహానికి సంబంధించి రాజకీయ ప్రముఖులకు స్వయంగా ఆహ్వానాలు అందజేస్తున్నారు. తెలుగు రాష్ట్రాలతోపాటు పొరుగునున్న రాజకీయ నేతలకు స్వయంగా వెళ్లి పెళ్లి పత్రికను ఇస్తున్నారు. ఈ క్రమంలో ఏపీ సీఎం చంద్రబాబుకు కూతురు ఆహ్వాన పత్రికను అందజేశారు ఆమె.
వైసీపీ అధికార గెజిట్ తన మనస్సాక్షిలో ఓ వార్త రాసుకొచ్చింది. బాబులో చెట్టపట్టాల్ అంటూ తాటికాయంత అక్షరాలు పెట్టి రాసుకొచ్చింది. అంతేకాదు సీఎం చంద్రబాబుతో షర్మిల ఆత్మీయ సంబంధాలని మరొక క్యాప్షన్ ఇచ్చేసింది. వీలు చిక్కినప్పుడల్లా ఇరువులు భేటీ అంటూ రాసుకొచ్చింది. ఆ వార్తను చూసి షర్మిల ఒక్కసారిగా షాకయ్యారు. దీంతో ఆమె ఎక్స్ వేదికగా సాక్షి రాసిన కథనాన్ని పోస్టు చేస్తూ కొన్ని ప్రశ్నలు లేవనెత్తారు.
తండ్రి వయసున్న వ్యక్తికి చంద్రబాబుకు తన కూతురు శుభలేఖ అందిస్తే చెట్టాపట్టాల్ అంటారా? ఆత్మీయ సంబంధాలని అంటగడతారా? వావి వరసలు తెలిసినోడు చేసే పనేనా? సమాజం పట్ల విలువలు ఉన్నోడు రాసే రాతలేనా? మనిషై పుడితే ఆడబిడ్డ మీద వేసేవి ఇలాంటి నిందలా? అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు రైజ్ చేశారు.
తండ్రి వయసున్న వ్యక్తికి @ncbn శుభలేఖ అందిస్తే చెట్టాపట్టాల్ అంటారా ? ఆత్మీయ సంబంధాలని అంటగడతారా ? ఇది వావి వరసలు తెలిసినోడు చేసే పనేనా ? సమాజం పట్ల విలువలు ఉన్నోడు రాసే రాతలేనా ? మనిషై పుడితే ఆడబిడ్డ మీద వేసేవి ఇలాంటి నిందలా ?
నాపై నేడు @SakshiNews సాక్షి దినపత్రికలో రాసిన… pic.twitter.com/h5T2UlnHOR
— YS Sharmila (@realyssharmila) November 17, 2026