E-Paper
Advertisement

అక్వాన్ తుఫాన్ ముప్పు.. రంగంలోకి దిగిన సీఎం చంద్రబాబు.. అధికారులకు కీలక ఆదేశాలు!

అక్వాన్ తుఫాన్ ముప్పు.. రంగంలోకి దిగిన సీఎం చంద్రబాబు.. అధికారులకు కీలక ఆదేశాలు!
Advertisement

Cyclone Akvan: బంగాళాఖాతంలో ఏర్పడిన అక్వాన్ తుఫాన్ ఏపీ వైపు కదులుతుండటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. వరుస తుఫాన్ల నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి నుంచి ఉన్నతాధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు.

తీవ్ర తుఫానుగా మారే అవకాశం

Advertisement

ప్రస్తుతం గంటకు 3 కిలోమీటర్ల వేగంతో కదులుతున్న అక్వాన్ తుఫాన్ చెన్నైకి 610 కి.మీ, మచిలీపట్నానికి 660 కి.మీ, విశాఖపట్నానికి 670 కి.మీ, ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు 790 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉందని అధికారులు సీఎంకు వివరించారు. సాయంత్రానికి ఇది తీవ్ర తుఫానుగా మారే ప్రమాదముందని, తుఫాన్ తీరం దాటే సమయంలో బలమైన ఈదురు గాలులు వీస్తాయని ఆర్టీజీఎస్ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో ఈ నెల 19, 20 తేదీల్లో రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు.

ప్రజలకు భరోసా ఇవ్వండి.. సీఎం దిశానిర్దేశం

Advertisement

ఇటీవల కాలంలో రాష్ట్రాన్ని మూడో తుఫాన్ తాకుతోందని గుర్తుచేసిన సీఎం చంద్రబాబు, విపత్తులను చూసి భయపడాల్సిన అవసరం లేదని అన్నారు. తుఫాన్ ప్రభావం ప్రజలపై పడకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు సిబ్బంది ద్వారా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలకు నేరుగా వాతావరణ హెచ్చరికలు చేరవేయాలని సూచించారు. ఎంతటి పెద్ద విపత్తు వచ్చినా తమను ఆదుకోవడానికి ప్రభుత్వం, యంత్రాంగం సిద్ధంగా ఉందనే భరోసాను ప్రజల్లో కల్పించాలని స్పష్టం చేశారు.

సహాయక చర్యలపై ప్రత్యేక దృష్టి

మత్స్యకారులు ఎవరూ సముద్రంలో వేటకు వెళ్లకుండా కఠిన జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రియల్ టైమ్‌లో పరిస్థితిని అంచనా వేస్తూ అవసరమైన చోట వెంటనే రెస్క్యూ ఆపరేషన్లు చేపట్టాలని, బాధితులకు పునరావాసం కల్పించాలని సూచించారు. తుఫాన్ గాలులకు చెట్లు కూలినా, విద్యుత్ స్తంభాలు నేలకొరిగినా ఆలస్యం చేయకుండా తొలగించి, యుద్ధప్రాతిపదికన విద్యుత్ పునరుద్ధరణ పనులు పూర్తి చేయాలన్నారు. అలాగే, భారీ వర్షాల వల్ల చెరువులు, కాల్వలకు గండ్లు పడకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

Also Read: ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం.. 100 మీటర్ల లోయలో పడ్డ బస్సు, 8 మంది మృతి

Tags

Related News

ఓఎన్‌జీసీ పాయింట్ నుంచి భారీగా గ్యాస్ లీకేజ్.. తీవ్ర భయాందోళనలో స్థానికులు, కోనసీమ జిల్లాలో ఘటన

రూటు మార్చిన వైసీపీ.. మినీ మున్సిపల్ అభ్యర్థుల ప్రకటన ఆలస్యం వెనుక, వాటిని టార్గెట్ చేసిందా?

ఏపీ వైపు దూసుకొస్తున్న తుఫాను.. ఉత్తరాంధ్ర-కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు, ఉద్యోగులకు సెలవులు రద్దు

రామోజీరావు జయంతి ఇకపై రాష్ట్ర పండుగగా నిర్వహిస్తాం: సీఎం చంద్రబాబు!

పదేళ్లలో దేశంలోనే నెం.1గా ఏపీ.. రాష్ట్రానికి రూ.30 లక్షల కోట్ల పెట్టుబడులు.. చంద్రబాబుపై అమిత్ షా ప్రశంసలు!

రామోజీ అవార్డుల వేదికపై.. పవన్ కళ్యాణ్ స్ఫూర్తిదాయక ప్రసంగం!

ఏపీలో ఘోర ప్రమాదం.. విద్యార్థులపైకి దూసుకెళ్లిన ట్రాక్టర్!

Big Stories

Advertisement
×