E-Paper
Advertisement

కీలక మార్పులు మొదలుపెట్టిన జగన్.. నియోజకవర్గాల్లో 80 మంది ఔట్, రిపోర్టు ఏమని వచ్చింది?

కీలక మార్పులు మొదలుపెట్టిన జగన్.. నియోజకవర్గాల్లో 80 మంది ఔట్, రిపోర్టు ఏమని వచ్చింది?
Advertisement

Amaravati: 2029 ఎన్నికలకు ఇప్పటి నుంచి వైసీపీ అధినేత జగన్ ప్రిపేర్ అవుతున్నారా? స్థానిక సంస్థల ఎన్నికలు ఫలితాలు.. నియోజకవర్గాల పునర్విభజన నేపథ్యంలో రూటు మార్చుబోతున్నారా? వచ్చే ఏడాది ఆరంభం నుంచి పాదయాత్ర చేపట్టాలని డిసైడ్ అయ్యారా? అందుకే నియోజకవర్గాల ఇన్‌ఛార్జులను మార్చే పనిలో పడ్డారా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.

వైసీపీలో భారీ ప్రక్షాళన మొదలైనట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. వచ్చే ఏడాది చివరలో పాదయాత్రకు వెళ్లాలని తొలుత జగన్ భావించారు. అయితే వచ్చే ఏడాది నుంచి ప్రజల్లోకి వెళ్లాలని డిసైడ్ అయినట్టు ఆ పార్టీ వర్గాల మాట. అందుకు కారణాలు లేకపోలేదు. దశాబ్దాల కిందట కేసుల కదలిక స్పీడు కావడంతో ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారట. ఒక వేళ తీర్పు వ్యతిరేకంగా వస్తే ప్రజల్లో సానుభూతి వస్తుందని ఆలోచన చేస్తున్నారని టాక్.

Advertisement

రెండో అంశం.. ఇటీవల జరిగిన కార్పొరేషన్, మున్సిపాలిటీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలను వైసీపీ అధినేత జగన్ క్షుణ్నంగా గమనించారు. ఆ తర్వాత ప్రతీ నియోజకవర్గం నుంచి రిపోర్టు తెప్పించుకున్నారని తెలుస్తోంది. ఎన్నికల్లో ప్రత్యర్థి పార్టీతో కలిసిన నాయకులు ఎవరు? నియోజక వర్గాల్లో తిరగని నేతలు, అస్సలు పార్టీని పట్టించుకోని దాదాపు 80 మందికి సంబంధించిన నేతల చిట్టా అధినేత చేతికి అందిందని సమాచారం. వారిని మార్చేయాలని నిర్ణయించుకున్నట్లు లీకులు ఇస్తున్నారు.

నియోజకవర్గాల ఇన్‌ఛార్జుల జాబితాలో పులివెందుల నియోజకవర్గం ఉన్నట్లు ఆ పార్టీ అంతర్గత వర్గాలు చెబుతున్నాయి. కేసుల వల్ల ఇబ్బంది వస్తే ఆ నియోజకవర్గం నుంచి ఎవర్ని దింపాలి? ఆ బాధ్యతలు ఎవరికి అప్పగించాలనే దానిపై గడిచిన రెండురోజులుగా కసరత్తు చేసినట్టు సమాచారం. దీనికితోడు స్థానిక సంస్థల ఎన్నికల్లో పులివెందులలో ఏకగ్రీవాలు జరిగాయి. ఇలాంటి సమయంలో ఒక్కసారి 80 మందిపై వేటు వేస్తే.. ఇబ్బంది వస్తుందని భావించి, ఆ జాబితాలో పులివెందులను చేర్చినట్టు సమాచారం.

Related News

అక్వాన్ తుఫాన్ ముప్పు.. రంగంలోకి దిగిన సీఎం చంద్రబాబు.. అధికారులకు కీలక ఆదేశాలు!

ఓఎన్‌జీసీ పాయింట్ నుంచి భారీగా గ్యాస్ లీకేజ్.. తీవ్ర భయాందోళనలో స్థానికులు, కోనసీమ జిల్లాలో ఘటన

రూటు మార్చిన వైసీపీ.. మినీ మున్సిపల్ అభ్యర్థుల ప్రకటన ఆలస్యం వెనుక, వాటిని టార్గెట్ చేసిందా?

ఏపీ వైపు దూసుకొస్తున్న తుఫాను.. ఉత్తరాంధ్ర-కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు, ఉద్యోగులకు సెలవులు రద్దు

రామోజీరావు జయంతి ఇకపై రాష్ట్ర పండుగగా నిర్వహిస్తాం: సీఎం చంద్రబాబు!

పదేళ్లలో దేశంలోనే నెం.1గా ఏపీ.. రాష్ట్రానికి రూ.30 లక్షల కోట్ల పెట్టుబడులు.. చంద్రబాబుపై అమిత్ షా ప్రశంసలు!

రామోజీ అవార్డుల వేదికపై.. పవన్ కళ్యాణ్ స్ఫూర్తిదాయక ప్రసంగం!

Big Stories

Advertisement
×