BigTV English

YS Sharmila comments: వైఎస్ షర్మిల ఆగ్రహం, జగన్ పడేసిన బిస్కట్లు.. 1000 కోట్ల పనులా?

YS Sharmila comments: వైఎస్ షర్మిల ఆగ్రహం, జగన్ పడేసిన బిస్కట్లు.. 1000 కోట్ల పనులా?

YS Sharmila comments on Jagan(Political news in AP): సీఎం జగన్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు వైఎస్ షర్మిల. జగన్ పడేసే కుక్క బిస్కెట్లు తిని తనపై లేనిపోని ఆరోపణలు చేయడంపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల మండిపడ్డారు. అంతేకాదు ప్రత్యర్థులను సూటిగా, సున్నితంగా హెచ్చరించారామె. ఈ విషయంలో మీకెంత డబ్బులు అందుతున్నాయో చెప్పాలన్నారు. 1000 కోట్ల రూపాయల పనులను సీఎం జగన్‌ను తాను అడిగినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు.


వైఎస్సార్ వారసుడిగా కంటే ప్రధాని మోదీ వారసుడిగా సీఎం జగన్ ఉన్నారని ఆరోపించారు. వైసీపీవి ఊసరవెల్లి రాజకీయాలని ధ్వజమెత్తారు. సోమవారం కడప కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులతో కలిసి ఆమె మీడియాతో మాట్లాడారు. జగన్ వివేకానంద హత్య వెనుక చంద్రబాబు హస్తముందని చెప్పి సీబీఐ ఎంక్వైరీ కోరలేదా? ఆయన సీఎం అయిన తర్వాత సీబీఐ విచారణ అవసరం లేదని చెప్పలేదా? అంటూ సూటిగా ప్రశ్నించారు. తన మాటలు అబద్దముని జగన్ నిరూపించుకున్నారని అన్నారు.

తన భర్త అనిల్‌కుమార్ జమ్ములమడుగు బీజేపీ అభ్యర్థితో సమావేశమయ్యారంటూ అవినాష్ చేసిన ఆరోపణలకు కౌంటరిచ్చారు వైఎస్ షర్మిల. కడప ఎంపీ అభ్యర్థి అవినాష్‌రెడ్డి మాదిరిగా అర్థరాత్రి వేళ గొడ్డలి రాజకీయాలు మాకు తెలీవన్నారు. వైఎస్సార్ మరణం వెనుక రిలయన్స్ హస్తముందని ఒకప్పుడు జగన్ అన్నారని గుర్తు చేశారు. ఈ విషయం అందరు నమ్మారని, వైఎస్సార్ అభిమానులు రిలయన్స్‌పై దాడులు చేసి కేసుల్లో ఇరుక్కున్నారని తెలిపారు. వైసీపీ అధికారంలోకి రాగానే సీఎం జగన్.. రిలయన్స్‌కు చెందిన సన్నిహితులకు ఎంపీ పదవి కట్టబెట్టలేదా అని ప్రశ్నించారు.


ALSO READ: ముద్రగడ ఫ్యామిలీపై హాట్ కామెంట్స్, ఆ పాపం నాకొద్దు.. కౌంటరిచ్చిన ముద్రగడ

అధికారంలోకి రాగానే రెండేళ్లలో పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తామని చెప్పిన సీఎం జగన్, గడిచిన ఐదేళ్లు ఏం చేశారని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందా , ఉంటే ఎందుకు ఆ ప్రాజెక్టును పూర్తి చేయలేదని నిలదీశారు.

 

https://twitter.com/bigtvtelugu/status/1787352394801811544

 

Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×