Big Stories

Vehicles vandalised at Congress office in Amethi: అమేథిలో దారుణం, కాంగ్రెస్ పార్టీ.. కార్లపై దాడులు

Vehicles vandalised at Congress office in Amethi: లోక్‌సభ ఎన్నికల వేళ ప్రత్యర్థులపై దాడులు మొదలయ్యాయి. ఒకప్పుడు రాయలసీమలో మొదలైన ఈ సంస్కృతి.. ఇప్పుడు దేశంలోని వివిధ ప్రాంతాలకు విస్తరించింది. తాజాగా ఉత్తప్రదేశ్‌లోని అమేథి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై ఆదివారం అర్థరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దాడికి ప్రయత్నించారు. ముఖ్యంగా పార్టీ కార్యాలయం బయట పార్క్ చేసిన వాహనాలను ధ్వంసం చేశారు.

- Advertisement -

ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. దాడికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని కాంగ్రెస్ కార్యకర్తలను శాంతింపజేసే ప్రయత్నం చేశారు. ఈ ఘటనకు పాల్పడిన వారిని అడ్డుకున్నామన్నారు.

- Advertisement -

ఘటన గురించి తెలియగానే కాంగ్రెస్ పార్టీ రియాక్ట్ అయ్యింది. బీజేపీ ఓడిపోతుందనే ఆ పార్టీ కార్యకర్తలు దాడులకు తెగబడుతున్నారని ఆరోపించింది. అమేథిలో బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీ ఓడిపోతున్నట్లు వార్తల నేపథ్యంలోనే ఈ దాడి జరిగిందన్నది ప్రధాన ఆరోపణ. బీజేపీ కార్యకర్తలు దాడులు చేస్తున్నా పోలీసులు మౌనంగా ఉండడాన్ని తప్పుపట్టింది. కాంగ్రెస్ కార్యకర్తలపైనే కాదు.. అమేథి ప్రజలపై కూడా ఘోరమైన దాడి జరిగిందన్నారు.

Vehicles parked outside Congress office in Amethi vandalised
Vehicles parked outside Congress office in Amethi vandalised

అమేథి దాడి ఘటన వ్యవహారం దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యింది. కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అమేథి నుంచి ఈసారి ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ పోటీ చేస్తారని కమలనాధులు భావించారు. కాకపోతే ఆయన స్థానంలో గాంధీ కుటుంబానికి విధేయుడైన కిషోర్‌లాల్ శర్మను బరిలోకి దింపింది ఆ పార్టీ. నాలుగు దశాబ్దాలుగా పార్టీకి అక్కడ బాధ్యతలు నిర్వహిస్తున్నారాయన. దీంతో బీజేపీ అక్కడ గెలుపు కష్టమనే వాదన బలంగా వినిపిస్తోంది.

ALSO READ: నోట్ల కట్టలు, 25 కోట్ల రూపాయలు, ఎక్కడ?

ఈ క్రమంలో కమలం కార్యకర్తలు ఈ దాడికి పాల్పడి ఉంటారనే వార్తలు లేకపోలేదు. రాహుల్ ఈసారి రాయ్‌బరేలీ నుంచి తొలిసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఈసారి ఎలాగైనా అమేథి నియోజకవర్గం నుంచి గెలుపొందాలని కాంగ్రెస్ భావిస్తోంది. అందుకు తగ్గట్టుగానే ఎత్తుకు పైఎత్తులు వేస్తోంది.

 

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News