Big Stories

ICSE, ISC Results 2024 : ICSE, ISC పరీక్షల ఫలితాలు విడుదల.. ఇక్కడ చెక్ చేసుకోండి

ICSE, ISC Results 2024 : ద కౌన్సిల్ ఫర్ ది ఇండియన్ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్స్ (CISE), ఇండియన్ సర్టిఫికేట్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (ICSE లేదా క్లాస్ 10) , ఇండియన్ స్కూల్ సర్టిఫికేట్ (ISC లేదా క్లాస్ 12) ఫైనల్ పరీక్ష ఫలితాలు సోమవారం ఉదయం 11 గంటలకు వెలువడ్డాయి. విద్యార్థులు తమ ICSE, ISC 2024 ఫలితాలను cisce.org, results.cisce.org అధికారిక వెబ్ సైట్లలో చూసుకోవచ్చు.

- Advertisement -

ICSE 2024 టెన్త్ ఫలితాల్లో 99.47 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. 2023-24 విద్యాసంవత్సరంలో 2,43,617 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవ్వగా.. 2,42,328 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. వీరిలో 1,29,612 మంది బాలురు (99.31 శాతం), 1,12,716 (99.65 శాతం) మంది బాలికలు ఉన్నారు. 1289 మంది ఫెయిల్ అవ్వగా.. వారిలో 894 మంది విద్యార్థులు, 395 మంది విద్యార్థినులు ఉన్నారు.

- Advertisement -

అలాగే ISC క్లాస్ 12 ఫలితాల్లో 98.19 శాతం విద్యార్థులు పాసయ్యారు. 99,901 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవ్వగా.. 98,088 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. 51,462 (97.53 శాతం) మంది విద్యార్థులు పాసవ్వగా, 46,626 మంది విద్యార్థినులు (98.92 శాతం) విద్యార్థినులు పాసయ్యారు. 1813 మంది ఫెయిలవ్వగా.. వారిలో 1303 మంది బాలురు, 510 మంది బాలికలు ఉన్నారు.

ICSE, ISC పరీక్షలు ఫిబ్రవరి 21 నుంచి ఏప్రిల్ 4 వరకూ నిర్వహించారు. పరీక్షల్లో రెండు వాయిదా పడటంతో.. పరీక్ష తేదీలను రీ షెడ్యూల్ చేశారు. నిజానికి ఫిబ్రవరి 26న కెమిస్ట్రీ పరీక్ష జరగాల్సి ఉండగా.. అనివార్య కారణాలతో ఆ పరీక్ష మార్చి 21కి వాయిదా పడింది. అలాగే.. 12వ తరగతి సైకాలజీ పరీక్ష మే 27న జరగాల్సి ఉండగా.. ఏప్రిల్ 27న నిర్వహించారు.

విద్యార్థులు ఫలితాలు విడుదలయ్యాక వచ్చిన మార్కులతో సంతృప్తి చెందకపోతే.. రీ- చెకింగ్, రీ వెరిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోవచ్చని CISE తెలిపింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News