Big Stories

Pawan comments on Mudragada family: ముద్రగడ ఫ్యామిలీపై హాట్ కామెంట్స్, ఆ పాపం నాకొద్దు.. కౌంటరిచ్చిన ముద్రగడ

Pawan comments on Mudragada family(AP politics): ఏపీలో ఎన్నికల వేళ ఫ్యామిలీల అంతర్గత చిచ్చు బయటకు వచ్చింది. ఈ జాబితాలో తొలుత వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం ముందుంటారు. జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌పై ముద్రగడ చేసిన వ్యాఖ్యలు తారా స్థాయికి చేరాయి. ఈ క్రమంలో ఆయన కూతురు క్రాంతి తండ్రితో విభేదించారు. ముద్రగడ తీరును తప్పుబట్టారామె. ఈ వ్యవహారంపై జోరుగా ఆంధ్రప్రదేశ్‌లో చర్చ జరుగుతోంది. తండ్రీ-కూతురు మధ్య విభేదాలకు ఆయన కారణమంటూ సోషల్‌మీడియాలో జరుగుతున్న ప్రచారానికి ఫుల్‌స్టాప్ పెట్టారు పవన్‌కల్యాణ్.

- Advertisement -

ఆదివారం తునిలో నిర్వహించిన రోడ్ షోకు ముద్రగడ పద్మనాభం కూతురు క్రాంతి తన భర్త చందు.. పవన్‌‌కల్యాణ్ తో సమావేశమయ్యారు. పార్టీ కండువా కప్పుకోవాలని భావించారు. ఈ సందర్భంగా ముద్రగడ ఫ్యామిలీపై హాట్ కామెంట్స్ చేశారాయన. తండ్రి-కూతురు మధ్య చిచ్చు పెట్టే మనత్వతం తనది కాదని, ఆ పాపం తనకు వద్దన్నారు. ప్రస్తుతం పార్టీ కండువా కప్పితే.. ఎన్నికలకు పవన్ కల్యాణ్ వాడుకున్నారనే అపవాదు తనకు వద్దన్నారు. మీతో పాటు తనను మీ నాన్న ముద్రగడ వద్దకు తీసుకెళ్తే తాను వస్తానని చెప్పుకొచ్చాడు.

- Advertisement -

కులాలను, పార్టీలను కలిపేవాడినని, కుటుంబాన్ని వేరు చేస్తానా అంటూ కాస్త గంభీర స్వరంతో మాట్లాడారు జనసేనాని. క్రాంతి.. జనసేనలోకి వస్తామంటే సాదరంగా ఆహ్వానిస్తామన్నారు. ఆమెకు అండగా ఉండడమేకాదు.. రాబోయే ఎన్నికల్లో క్రాంతిని జనసేన అభ్యర్థిగా పోటీ చేయిస్తానని మనసులోని మాట బయటపెట్టారు. పెద్దలు అన్నాక ఎన్నో అంటారని గుర్తుచేశారు. ఆయనతో మాకు విధానపరమైన విభేదాలు ఉండొచ్చని, తాను మీ ఇంటివాడినని గుర్తు చేశారు. ముద్రగడను ఒప్పించాకే, క్రాంతిని జనసేనలో చేర్చుకుంటామని బహిరంగంగా వ్యాఖ్యానించారు.

మరోవైపు పవన్‌కల్యాణ్ వ్యాఖ్యలపై ముద్రగడ రియాక్ట్ అయ్యారు. పవన్ సీటుకే దిక్కులేదని, తన కూతురికి టికెట్ ఇస్తారా అంటే ఎద్దేవా చేశారు. గత ఎన్నికల్లో భీమవరం, గాజువాక నియోజకవర్గాల్లో జనసేనానిని తన్ని తరిమేశారని, ఇప్పుడు పిఠాపురంలో వచ్చిపడ్డారని, ఇక్కడా కూడా అదే జరుగుతుందన్నారు. చంద్రబాబు ఎస్టేట్‌లో పవన్ ఓ మార్కెటింగ్ మేనేజర్ అంటూ సెటైర్లు వేశారు. మెగా ఫ్యామిలీ చరిత్ర ఏంటో పవన్ చెప్పాలని డిమాండ్ చేశారు. పవన్ చెప్పినదంతా అబద్దమని, కులాలు, కుటుంబాల మధ్య చిచ్చు పెట్టాలని మీ గురువు చంద్రబాబు ఏమైనా చెప్పారా అంటూ ప్రశ్నించారు.

pawan kalyan comments on mudragada family is at tuni road show
pawan kalyan comments on mudragada family is at tuni road show

నాలుగురోజుల కిందట పవన్ కల్యాణ్‌పై వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పిఠాపురంలో తాను పవన్‌ను ఓడించకపోతే నా పేరును పద్మనాభంరెడ్డిగా మార్చుకుంటానని శపథం చేశారు. తండ్రి వ్యాఖ్యలపై ఆయన కూతురు క్రాంతి విభేదించారు. మా నాన్న చేసింది ముమ్మాటికీ తప్పేనని చెప్పుకొచ్చారు. ఈ వ్యవహారంపై ముద్రగడ రియాక్ట్ అయ్యారు. కావాలనే తనకు-తన కూతురు మధ్య చిచ్చుపెట్టారని ఆరాపించారాయన. క్రాంతికి ఎప్పుడో పెళ్లయ్యిందని, ఆమె అత్తారింటిలో ఉంటున్నారని చెప్పుకొచ్చారు.

READ ALSO: ఏపీలో వైసీపీ రాళ్ల దాడులు, సాయి ధరమ్‌తేజ్ ప్రచారంలో.. గాయపడిన జనసేన కార్యకర్త

ఈ వ్యవహారంలో జనసేనానిపై కాపు కమ్యూనిటీలోని ఓ వర్గం మండిపడింది. తండ్రీ-కూతురు విడదీశారని ఆరోపణలు గుప్పించింది. పరిస్థితి గమనించిన పవన్, తనదైన శైలిలో చెప్పుకొచ్చారు. దీంతో ముద్రగడ పనైపోయిందని, పిఠాపురం పవన్ గెలవడం సునాయాశమేనని అంటున్నారు అక్కడి ప్రజలు.

 

 

 

 

 

 

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News