BigTV English

YS Sharmila : బీజేపీ చేతిలో కీలుబొమ్మ.. జగన్ పాలనపై షర్మిల విమర్శలు..

YS Sharmila : ఆరోగ్యశ్రీ, ఉచిత విద్యుత్‌ తదితర పథకాలు దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి నిర్వహించిన ‘ప్రజా ప్రస్థానం’ పాదయాత్ర నుంచి పుట్టినవేనని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల అన్నారు. ప్రజల కష్టాలను వైఎస్ఆర్ చూశారని షర్మిల అన్నారు. ఆయన పోరాటానికి కొనసాగింపుగా పేదల పక్షాన నిలబడేందుకే తాను వచ్చానన్నారు. శ్రీకాకుళం జిల్లా పర్యటనలో భాగంగా ఇచ్ఛాపురంలో ‘ప్రజా ప్రస్థానం’ విజయస్తూపాన్ని ఆమె సందర్శించి నివాళులర్పించారు. అనంతరం స్థానిక నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు.

YS Sharmila : బీజేపీ చేతిలో కీలుబొమ్మ.. జగన్ పాలనపై షర్మిల విమర్శలు..

YS Sharmila : ఆరోగ్యశ్రీ, ఉచిత విద్యుత్‌ తదితర పథకాలు దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి నిర్వహించిన ‘ప్రజా ప్రస్థానం’ పాదయాత్ర నుంచి పుట్టినవేనని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల అన్నారు. ప్రజల కష్టాలను వైఎస్ఆర్ చూశారని షర్మిల అన్నారు. ఆయన పోరాటానికి కొనసాగింపుగా పేదల పక్షాన నిలబడేందుకే తాను వచ్చానన్నారు. శ్రీకాకుళం జిల్లా పర్యటనలో భాగంగా ఇచ్ఛాపురంలో ‘ప్రజా ప్రస్థానం’ విజయస్తూపాన్ని ఆమె సందర్శించి నివాళులర్పించారు. అనంతరం స్థానిక నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు.


ప్రజల కష్టాలను తెలుసుకునేందుకు వైఎస్‌ఆర్ చేసిన‌ పాదయాత్ర ఇచ్ఛాపురంలోనే ముగిసిందని షర్మిల గుర్తు చేశారు. ప్రజల కష్టాలను చూసి ఆయన ఒక్క అవకాశం అడిగారన్నారు. సీఎం అయ్యాక 46 లక్షల మందికి పక్కా ఇళ్లు కట్టించిన ఘనత వైఎస్ఆర్ కే దక్కుతుందని కొనియాడారు. అందుకే ఆంధ్ర రాష్ట్ర ప్రజల మేలు కోసం ఇచ్ఛాపురం నుంచి తన ప్రస్థానం మొదలైందన్నారు. తనను ప్రజలు ఆశీర్వదించాలని షర్మిల కోరారు.

కాంగ్రెస్‌ పార్టీ తరఫున పథకాలన్నీ వైఎస్‌ఆర్‌ అమలు చేశారని షర్మిల గుర్తు చేశారు. వైఎస్‌ఆర్‌కి కాంగ్రెస్‌ ఎంత బలమో.. ఆయనకీ కాంగ్రెస్‌ అంతే బలమన్నారు. రాజశేఖర్‌రెడ్డిని అవమానించిన పార్టీ అని కొందరు విమర్శలు చేస్తున్నారన్నారు. ఆ విమర్శల్లో ఎలాంటి నిజాలు లేవని స్పష్టం చేశారు. వైఎస్‌ఆర్‌ అంటే ఇప్పటికీ పార్టీ అధిష్ఠానానికి అభిమానం ఉందన్నారు. ఈ విషయాన్ని స్వయంగా సోనియగాంధీయే తనతో చెప్పారని గుర్తు చేశారు. రాజీవ్‌ గాంధీ చనిపోయాక కూడా ఎఫ్‌ఐఆర్‌లో ఆయన పేరు పెట్టారన్నారు. అది తెలియక చేసిన తప్పు కానీ.. తెలిసి చేసింది కాదన్నారు.


జీవించినంత కాలం బీజేపీకి వైఎస్‌ఆర్‌ వ్యతిరేకిగానే ఉన్నారని షర్మిల అన్నారు. ఇవాళ రాష్ట్రంలో పరిస్థితులు చూస్తుంటే బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీకి ఇక్కడి పార్టీలు తొత్తులుగా మారాయని ఆరోపించారు. ఒక్క ఎమ్మెల్యే లేకపోయినా ప్రభుత్వం వాళ్ల చేతుల్లో నడుస్తుందని కీలక వ్యాఖ్యలు చేశారుత. బీజేపీకి కీలుబొమ్మలా జగన్‌ ప్రభుత్వం మారిందని దుయ్యబట్టారు. రాష్ట్రాన్ని బీజేపీ మోసం చేసిందన్నారు.

ఒక్క రోజు కూడా జగన్‌ ఏపీకి ప్రత్యేక హోదా గురించి అడగలేదని షర్మిల విమర్శించారు. 25 మంది ఎంపీలను ఇస్తే ‘హోదా’ తెస్తా అన్న జగన్..! ఇప్పుడు ఆ మాటలు ఇప్పుడు ఎక్కడికి పోయాయి? అని ప్రశ్నించారు. రాహుల్‌గాంధీ మొదటి సంతకం ప్రత్యేకహోదాపైనే పెడతానని హామీ ఇచ్చారన్నారు. రాష్ట్రం గురించి ఆలోచించే పార్టీ కాంగ్రెస్‌ పార్టీ ఒక్కటే అన్నారు. వైఎస్‌ఆర్‌ ఆశయాలను అందరం బతికించుకుందామని షర్మిల పిలుపునిచ్చారు.

తమను ఎస్టీ జాబితాలో చేర్చాలంటూ బెంతొరియా ప్రతినిధులు వైఎస్ షర్మిలకు వినతిపత్రం అందజేశారు. ఇచ్ఛాపురం నియోజకవర్గంలోని నాలుగు మండలాలతో పాటు మెళియాపుట్టిలో తమ సామాజిక వర్గం ఉందని తెలిపారు. కులం పరంగా ఎలాంటి గుర్తింపునకు నోచుకోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చదువు, ఉద్యోగాలకు అర్హత పొందేలా సమగ్ర ధ్రువీకరణ పత్రాలు జారీ చేశారన్నారు. వైసీపీ ప్రభుత్వం గత ఏడాది జనవరి 30 నుంచి వాటిని నిలిపివేసిందని షర్మిల దృష్టికి తీసుకెళ్లారు. వాటిని పునరుద్ధరించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి తమకు న్యాయం చేయాలని కోరారు.

Related News

Free Bus: ఉచిత బస్సు.. వైసీపీ విమర్శలను జనం నమ్మేస్తారా?

Tollywood Producers: ఏపీకి చేరిన సినిమా పంచాయితీ.. మంత్రి దుర్గేష్ తో ఫిలిం చాంబర్ నేతల సమావేశం

Anantapur News: ఏపీలో షాకింగ్ ఘటన.. బస్సు ఆపలేదని మహిళ ఆగ్రహం.. డ్రైవర్ చెంప పగలకొట్టింది

Aadudam Andhra Scam: రోజా అసలు ‘ఆట’ మొదలు.. అరెస్టుకు రంగం సిద్ధం, రంగంలోకి సిట్?

Tirumala News: బుక్కైన జగన్ మామ, టీటీడీ కేసు నమోదు, అసలు ఏం జరిగింది?

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?

Big Stories

×