BigTV English

SSMB-29: మహేశ్- రాజమౌళి సినిమా.. కథ చెప్పేసిన విజయేంద్ర ప్రశాద్..!

SSMB-29: మహేశ్- రాజమౌళి సినిమా.. కథ చెప్పేసిన విజయేంద్ర ప్రశాద్..!

SSMB-29: ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి తీయబోయే నెక్స్ట్ సినిమాపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఆయన ఎలాంటి కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు అంటూ ప్రపంచం మొత్తం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ తరుణంలోనే రాజమౌళి తన తదుపరి చిత్రాన్ని మహేశ్ బాబుతో తీస్తున్నట్లు ప్రటించారు. ఫుల్ యాక్షన్ అండ్ అడ్వంచర్‌తో కూడిన కథతో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలిపారు. దీంతో మహేశ్ అభిమానులు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.


మహేశ్ ముఖ్యంగా ఈ సినిమాతోనే పాన్ ఇండియా లెవెల్లో ఎంట్రీ ఇస్తున్నారు. ఇప్పటికీ ఈ సినిమా స్క్రిప్ట్ కూడా కంప్లీట్ చేసినట్లు ప్రముఖ రచయిత రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రశాద్ ప్రకటించారు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరికొన్ని విశేషాలని అతడు పంచుకున్నారు. ఈ మేరకు తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయేంద్ర ప్రశాద్ ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాల్ని తెలుపుతూ.. మరింత హైప్ పెంచేశారు.

ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ.. మహేశ్ – రాజమౌళి సినిమా ‘ఇండియానా జోన్స్’లా ఉంటుందని అన్నారు. ఈ మూవీకి ఇంకా టైటిల్ ఖరారు చేయలేదని చెప్పారు. ఈ సినిమా ఎక్కువగా అడవి నేపథ్యంలోనే సాగుతుందని తెలిపారు. అలాగే ఈ సినిమా సంగీతం గురించి ప్రస్తుతం సన్నాహాలు జరుగుతున్నట్లు చెప్పుకొచ్చారు. ఆయన మాటలతో సినిమాపై అంచనాలు మరింత రెట్టింపయ్యాయి.


Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×