BigTV English

YS Sharmila Emotional Tears: జగన్‌ను తలుచుకుంటూ.. కన్నీరు పెట్టిన వైఎస్ షర్మిల..!

YS Sharmila Emotional Tears: జగన్‌ను తలుచుకుంటూ.. కన్నీరు పెట్టిన వైఎస్ షర్మిల..!

YS Sharmila Tears on her Brother YS Jagan Issue: ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు కొత్త మలుపులు తిరుగుతున్నాయి. ముఖ్యంగా సీఎం జగన్ – కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల మధ్య ఆసక్తి పోరు నెలకొంది. కడప ఎంపీ సీటు కోసం ఓ వైపు అవినాష్‌రెడ్డి, మరోవైపు వైఎస్ షర్మిల బరిలో పోటీ పడుతున్నారు.


సీఎం జగన్.. ఆయన చెల్లెలు మధ్య మాటలయుద్ధం తారాస్థాయికి చేరింది. పులివెందుల సభలో సీఎం జగన్ మాట్లాడుతూ వైఎస్ షర్మిల ధరించిన చీర గురించి ప్రస్తావించారు. ఆయన వ్యవహారశైలిపై ఏపీ ప్రజలు కాసింత ఆగ్రహం వ్యక్తంచేశారు. కనీసం చెల్లికి గౌరవం ఇవ్వాల్సిందిపోయి బహిరంగంగా ఆమెపై వ్యాఖ్యలు చేయడాన్ని చాలామంది తప్పుబట్టారు. తన అన్న జగన్ వ్యవహారంపై వైఎస్ షర్మిల బాధపడ్డారు కూడా.

ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కాస్త కంటతడి పెట్టారు. ఆ రోజు తన అన్న జగన్ కష్టాల్లో ఉన్నారని పాదయాత్ర చేశారనని గుర్తు చేశారు. అంత త్యాగం చేస్తే కనీసం తన పిల్లలను సైతం దూరం పెట్టారని మనసులోని బాధను వ్యక్తం చేస్తూ కన్నీరు పెట్టారు. తన అన్నకు ఏదీ గుర్తు లేదన్నారు. కనీసం చెల్లెలు అన్న విషయం కూడా గుర్తు లేకపోవడం దారుణమని లోలోపల కుమిలిపోయారు.


Also Read: Sunitha shocking comments on Bharathi: వైఎస్ భారతిపై హాట్ కామెంట్స్.. మమ్మల్ని నరికేస్తారేమో, సింగిల్‌గా ఉండటానికి..

ఇదిలావుండగా గురువారం రాత్రి కడప జిల్లా వేంపల్లెలో నిర్వహించిన రోడ్ షోకు వివేకానంద వైఫ్ సౌభాగ్యమ్మ, కూతురు సునీత హాజరయ్యారు. ఈ సమయంలో తన మనసులోని బాధను బయటపెట్టారు వైఎస్ షర్మిల. చెల్లెళ్ల కంటే భార్య బంధువులే ఎక్కువయ్యారా అంటూ సీఎం జగన్‌ను సూటిగా ప్రశ్నించారు. ఎన్నికల్లో ఓ వైపు న్యాయం కోసం చెల్లెలు, మరోవైపు జగన్ భార్య, బంధువులు మరోవైపు ఉవున్నారని తెలిపారు.

ఇదిలావుండగా గురువారం రాత్రి కడప జిల్లా వేంపల్లెలో నిర్వహించిన రోడ్ షోకు వివేకానంద వైఫ్ సౌభాగ్యమ్మ, కూతురు సునీత హాజరయ్యారు. ఈ సమయంలో తన మనసులోని బాధను వెల్లగక్కారు వైఎస్ షర్మిల. చెల్లెళ్ల కంటే భార్య బంధువులే ఎక్కువయ్యారా అంటూ సీఎం జగన్‌ను సూటిగా ప్రశ్నించారు.

Also Read: జగన్ ప్రభుత్వానికి బిగ్ రిలీఫ్.. ఆ నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్.. కానీ ?

ఈ ఎన్నికల్లో ఓ వైపు న్యాయం కోసం చెల్లెలు, మరోవైపు జగన్ భార్య, బంధువులు మరోవైపు ఉవున్నారని తెలిపారు ఏపీ కాంగ్రెస్ చీఫ్. వివేకాకు కొడుకులు లేరని, జగన్‌ను సొంత కుమారుడిగా చూసుకున్నారని గుర్తు చేశారు. చివరకు బాబాయ్‌ని చంపిన నిందితులనే జగన్ కాపాడుతున్నారని ఆరోపించారు. పులివెందుల ఆడబిడ్డలకు న్యాయం చేయాలని ఓటర్లను కోరారు. ఆడ పిల్లలు పుట్టింటికి వచ్చి న్యాయం చేయాలని కోరుతున్నారని, ఆ సమయం జిల్లా వాసులకు ఇప్పుడు వచ్చిందన్నారు.

Related News

Chandrababu – Shankaraiah: సీఎంకే నోటీసులు పంపిస్తారా? ఎంత ధైర్యం? శంకరయ్యపై చంద్రబాబు ఆగ్రహం

Mega DSC Utsav: 150 రోజుల్లో 15,941 మెగా డీఎస్సీ ప్రక్రియ పూర్తి.. ఇక ప్రతి ఏటా టీచర్ ఉద్యోగాల నోటిఫికేషన్

Uppada: పవన్ భరోసా.. ఉప్పాడలో ఆందోళన విరమించిన మత్స్యకారులు

Tirumala Geo Tagging: తిరుమలలో భక్తుల భద్రతకు టీటీడీ వినూత్న ఆలోచన.. పిల్లలు, సీనియర్ సిటిజన్లకు జియో ట్యాగింగ్

Amaravati – Jagan: అమరావతి పై వైసీపీ వైఖరి చెప్పాల్సింది సజ్జల కాదు జగన్.. ఏపీ అసెంబ్లీ లో ఆసక్తికర ప్రస్తావన

Ontimitta Sri Rama Statue: ఒంటిమిట్టలో శ్రీ రాముడి 600 అడుగుల విగ్రహం

AP Assembly Session: సీఎంపై వైసీపీ ఎమ్మెల్సీ అభ్యంతరకర వ్యాఖ్యలు.. మండలిలో రచ్చ రచ్చ

Cm Chandrababu: అసెంబ్లీకి ఎమ్మెల్యేలు డుమ్మా.. సీఎం చంద్రబాబు సీరియస్

Big Stories

×