BigTV English

Sunitha shocking comments on Bharathi: వైఎస్ భారతిపై హాట్ కామెంట్స్.. మమ్మల్ని నరికేస్తారేమో, సింగిల్‌గా ఉండటానికి..

Sunitha shocking comments on Bharathi: వైఎస్ భారతిపై హాట్ కామెంట్స్..  మమ్మల్ని నరికేస్తారేమో, సింగిల్‌గా ఉండటానికి..

Sunitha shocking comments on Bharathi(Political news in AP):

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారానికి ఒక్కరోజు మిగిలి వుంది. దీంతో కడప రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఓ వైపు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, మరోవైపు వివేకానంద కూతురు సునీత.. సీఎం జగన్‌పై ముప్పేట దాడి చేశారు. ఈ క్రమంలో సీఎం జగన్ డిఫెన్స్‌లో పడిపోయారు. తన చెల్లెళ్లు లేవనెత్తిన అంశాలను క్లారిటీ ఇవ్వలేక పాయింట్‌ను టీడీపీ వైపు తోసి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు.


పులివెందులలో సింగల్ ఉండాలనే భావించి మానాన్న వివేకానందను చంపారేమోనని వ్యాఖ్యానించారు వైఎస్ సునీత. ఇప్పుడు తనను, వైఎస్ షర్మిలను నరికేస్తారేమో అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. సునీత చేసిన కామెంట్స్ కడపతోపాటు ఏపీ రాజకీయాల్లో హాట్ హాట్‌గా మారాయి. సింగిల్ ప్లేయర్ అనే భారతి వ్యాఖ్యలు వింటుంటే నిజమే అనిపిస్తోందని అనుమానాలు వ్యక్తంచేశారు.

అప్పట్లో జగన్‌ను ఎదిరించి మాట్లాడే సత్తా కేవలం వివేకానందకు మాత్రమే ఉందని, ఆ కోపంతోనే నాన్నను హత్య చేయించారని ఆరోపించారు డాక్టర్ సునీత. మాకు ఎప్పుడైనా ఎమైనా జరగొచ్చని మనసులోని మాట బయటపెట్టారు. అన్నింటికీ సిద్ధపడే పోరాడుతున్నామని, తన ఆస్తి కూడా కూతుళ్లకు రాసి ఇక్కడకు వచ్చి పోరాటం చేస్తున్నామని ఉద్వేగభరితంగా చెప్పుకొచ్చారు. తాము పోరాటం చేస్తున్నది తన తండ్రి వివేకానంద హత్య కేసు గురించి మాత్రమేనని తెలిపారు.


ALSO READ: చివరి రోజు కడపకు రాహుల్, సీఎం జగన్‌‌కు కౌంటరిస్తారా?

సొంత చిన్నాన్నకు న్యాయం చేయలేని సీఎం జగన్, రాష్ట్ర ప్రజలకు ఏం చేస్తారని ప్రశ్నల మీద ప్రశ్నలు సంధించారు డాక్టర్ సునీత. తాము పోరాటం చేస్తున్నది తన తండ్రి వివేకానంద హత్య కేసు గురించని తెలిపారు. నిందితుల మాటలను నమ్ముతున్న సీఎం జగన్, సొంత చెల్లెళ్లు మాటలను ఎందుకు పట్టించు కోలేదని ఆవేదన వ్యక్తంచేశారామె.

వివేకానంద గుండెపోటుతో చనిపోయినట్లు సాక్షి ఛానెల్‌లో మొదట వచ్చిందని, దీనిపై ఇంతవరకు సీఎం జగన్ ఎందుకు వివరణ ఇవ్వలేకపోతున్నారని సూటిగా ప్రశ్నించారు సునీత. కడపలో జరుగుతున్న ఎన్నికలు న్యాయానికి- నిందితులకు మధ్య జరుగుతున్నాయని, ఎటువైపు నిలుస్తారో ప్రజలదే అంతిమ నిర్ణయమన్నారు డాక్టర్ సునీత.

Related News

Araku Coffee: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అరకులో ఇకపై అందరూ లక్షాధికారులే!

Pawan Kalyan project: పవన్ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం.. కోట్లల్లో ఖర్చు.. ఎందుకంటే?

Railways: రైల్వే ప్రాజెక్టులపై దృష్టి.. అవన్నీ జరిగితే ఏపీకి తిరుగుండదు

Pulivendula Politics: పులివెందుల రాజకీయాలు.. 30 ఏళ్లలో రెండోసారి, ఓటర్లు ఫుల్‌ఖుషీ

Pawan Kalyan: రూటు మార్చిన పవన్.. నిన్న మామిడి.. నేడు చీరలు, రేపు?

AP Free Bus Scheme: ఏపీలో ఫ్రీ బస్ స్కీమ్.. ఆ బస్సు లెక్కితే ఉచిత ప్రయాణం ఉండదు

Big Stories

×