E-Paper
Advertisement

YS Sharmila : చంద్రబాబుతో షర్మిల భేటీ.. కుమారుడి వివాహానికి ఆహ్వానం..

YS Sharmila : చంద్రబాబుతో షర్మిల భేటీ..  కుమారుడి వివాహానికి ఆహ్వానం..
Advertisement

YS Sharmila : టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబును ఏపీ సీఎం వైఎస్ జగన్‌ సోదరి, కాంగ్రెస్‌ నేత వైఎస్‌ షర్మిల కలిశారు. హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసానికి ఆమె వెళ్లారు. తన కుమారుడు రాజారెడ్డి వివాహ ఆహ్వాన పత్రికను అందించారు. పెళ్లికి వచ్చి ఆశీర్వదించాలని చంద్రబాబును కోరారు.

చంద్రబాబుతో తన భేటికి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని షర్మిల స్పష్టం చేశారు. తన కుమారుడు పెళ్లికి చంద్రబాబును పిలించేందుకు మాత్రమే వెళ్లానన్నారు. గతంలో తన కుటుంబంలో పెళ్లిళ్లకు చంద్రబాబును వైఎస్‌ఆర్‌ పిలిచారని గుర్తుచేశారు. క్రిస్మస్‌ సందర్భంగా చంద్రబాబు, లోకేశ్‌కు స్వీట్లు కూడా పంపిన విషయాన్ని ప్రస్తావించారు. ప్రతి విషయాన్ని రాజకీయాలతో ముడిపెట్టవద్దని కోరారు. కేటీఆర్‌, కవిత, హరీశ్‌రావుకు కూడా స్వీట్లు పంపానని అన్నారు.

Advertisement

“రాజకీయం అనేది మా జీవితం కాదు, అది మా వృత్తి. ప్రజా పోరాటంలో భాగంగా విమర్శలు చేసుకుంటాం కానీ.. రాజకీయాల్లో వ్యక్తిగత కక్షలు ఉండకూడదు. స్నేహపూర్వక వాతావరణం ఉండాలి. నాకు ఏ బాధ్యతలు ఇవ్వాలనేది కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం ఇష్టం. రాహుల్‌ గాంధీని ప్రధానిగా చేయాలని వైఎస్‌ఆర్‌ అనేవారు. రాహుల్‌ ప్రధాని అయితేనే దేశంలో మతకలహాలు తగ్గుతాయి’’ అని షర్మిల అన్నారు.

Tags

Related News

బొత్సకు దెబ్బ మీద దెబ్బ.. బెల్లానకు విజయనగరం జిల్లా బాధ్యతలు, వైసీపీ హైకమాండ్ కీలక నిర్ణయం

ఆటోను ఢీ కొట్టిన లారీ.. స్పాట్ లో ముగ్గురు మృతి, విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

చవితి ముసురు.. తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున నుంచి..

జనసేన కొత్త వ్యూహం.. గ్రామీణ ప్రాంతాల్లో జెండా పాతేందుకు పక్కా ప్లాన్!

హారన్ కొట్టాడని బస్సెక్కి డ్రైవర్‌ను బాదేశాడు.. పెనుమాకలో బైకర్ దౌర్జన్యం!

అమరావతి రియల్టర్లకు గుడ్ న్యూస్.. భవన అనుమతులపై మంత్రి నారాయణ కీలక ఆదేశాలు!

మరోసారి కంటతడి పెట్టిన బొత్స.. ఓదార్చిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు!

వైసీపీకి బిగ్ షాక్.. చిన్న శ్రీను రాజీనామా వెనుక ఉన్న అసలు కారణం ఇదేనా?

Big Stories

Advertisement
×