BigTV English

Sharmila on YSR Statues: వైఎస్సార్ విగ్ర‌హాలు ధ్వంసం.. ష‌ర్మిల ఫైర్‌..!

Sharmila on YSR Statues:  వైఎస్సార్ విగ్ర‌హాలు ధ్వంసం.. ష‌ర్మిల ఫైర్‌..!

YS Sharmila Serious on YSR Statues: ఏపీలో దివంగత నేత మాజీ సీఎం వైఎస్సార్ విగ్రహాలపై అల్లరి మూకలు చేస్తున్న దాడులను రాష్ట్ర పీసీసీ చీఫ్ షర్మిల తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు. రాష్ట్రంలో మహానేత వైఎస్సార్ విగ్రహాలపై అల్లరి మూకలు చేస్తున్న వికృత దాడులను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. ప్రజాస్వామ్యంలో ఇలాంటి అరాచకాలు జరగడం అత్యంత దారుణం. ఎటువంటి పరిస్థితిలోనూ ఇలాంటి రౌడీ చర్యలు ఖండించి తీరాల్సిందే అన్నారు.


ఇది పిరికిపందల చర్య తప్ప మరొకటి కాదు. తెలుగు వారి గుండెల్లో గూడుకట్టుకున్న వైఎస్సార్ విశేష ప్రజాదరణ పొందిన నాయకుడు.. ప్రజల హృదయాల్లో ఆయనది చెరపలేని ముద్ర.. అటువంటి నేతకు నీచ రాజకీయాలు ఆపాదించడం సరికాదు. గెలుపు, ఓటములు ఆపాదించడం కూడా సరికాదు.. వైఎస్సార్ ను అవమానించేలా ఉన్న ఈ సంఘటనలు హీనమైనవి. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి అని ట్వీట్ చేశారు.

ప్రకాశం జిల్లా దర్శి మండలం రాజంపల్లిలో వైఎస్సార్ విగ్రహానికి గురువారం అర్థరాత్రి నిప్పు పెట్టారు. పొగ రావడం గమనించిన స్థానికులు నీళ్లు పోసి మంటలను ఆర్పి వేసారు. అయితే అంతకు ముందు వారు విగ్రహానికి తాళ్లు కట్టి ట్రాక్టర్‌తో లాగి కూల్చేయడానికి ప్రయత్నించారు.


Related News

Free Bus: ఉచిత బస్సు.. వైసీపీ విమర్శలను జనం నమ్మేస్తారా?

Tollywood Producers: ఏపీకి చేరిన సినిమా పంచాయితీ.. మంత్రి దుర్గేష్ తో ఫిలిం చాంబర్ నేతల సమావేశం

Anantapur News: ఏపీలో షాకింగ్ ఘటన.. బస్సు ఆపలేదని మహిళ ఆగ్రహం.. డ్రైవర్ చెంప పగలకొట్టింది

Aadudam Andhra Scam: రోజా అసలు ‘ఆట’ మొదలు.. అరెస్టుకు రంగం సిద్ధం, రంగంలోకి సిట్?

Tirumala News: బుక్కైన జగన్ మామ, టీటీడీ కేసు నమోదు, అసలు ఏం జరిగింది?

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?

Big Stories

×