OTT Movie : సైకలాజికల్ థ్రిల్లర్ జానర్ లో వచ్చిన ఒక హాలీవుడ్ సినిమా డిఫరెంట్ కథతో ఎంటర్టైన్ చేస్తోంది. ఊహించని ట్విస్ట్ లతో నడిచే ఈ సినిమా విమర్శకుల చేత ప్రశంసలు అందుకుని, బాక్స్ ఆఫీస్ హిట్ గా కూడా నిలిచింది. ఒక వైరస్ కారణంగా ప్రపంచం దాదాపు తుడిచిపెట్టుకుపోతుంది. ఈ సమయంలో ఒక ఫ్యామిలీ బంకర్లలో దాక్కుని, మనుగడ కోసం చేసే పోరాటంలో ఈ కథ తిరుగుతుంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.
‘హిడెన్’ (Hidden) 2015 అనేది డఫర్ బ్రదర్స్ దర్శకత్వం వహించిన అమెరికన్ సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా. ఇందులో అలెగ్జాండర్ స్కార్స్‌గార్డ్, ఆండ్రియా రైస్‌బరో, ఎమిలీ ఆలిన్ లిండ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం 2015 సెప్టెంబర్ 15న వార్నర్ బ్రదర్స్ ద్వారా థియేట్రికల్ రిలీజ్ అయింది. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, ఆపిల్ టీవీలలో స్ట్రీమింగ్ అవుతోంది. IMDbలో ఈ సినిమా 6.4/10 రేటింగ్ పొందింది.
రే, క్లైర్ అనే జంటకు జోయ్ అనే ఏడేళ్ల కూతురు ఉంటుంది. వీళ్ళు అమెరికాలోని నార్త్ కరోలినాలో సింపుల్ లైఫ్ స్టైల్ తో జీవిస్తుంటారు. కానీ ఇంతలోనే ఒక భయంకరమైన వైరస్ వ్యాప్తి కారణంగా వీళ్ళ జీవితం అతలాకుతలమవుతుంది. వీళ్ళు ఈ వైరస్ కారణంగా 301 రోజులుగా ఒక భూగర్భ బంకర్‌లో బిక్కు బిక్కుమని బతుకుతుంటారు. ఈ బంకర్‌లో వీళ్ళు ఆహారం, నీళ్ళు సేకరిస్తూ బతకడానికి ఒక పోరాటమే చేస్తుంటారు. ఇక్కడ ఎప్పుడూ నిశ్శబ్దంగా ఉండాలి. బయటకు పొరపాటున కూడా వెళ్లకూడదు. వెళ్తే బ్రీదర్స్ బ్రీదర్స్ అనే భయంకరమైన జీవులు వెంటాడుతాయి. జోయ్ ఒక రోజు బాగా శబ్దం చేయడం వల్ల బంకర్‌లో టెన్షన్ పెరుగుతుంది. బంకర్ బారికేడ్ ధ్వంసమవుతుంది. బ్రీదర్స్ లోపలికి రావడానికి ప్రయత్నిస్తారు. ఇది కుటుంబానికి ప్రమాదకరమైన స్థితిని తెచ్చిపెడుతుంది.
కథ ముందుకు సాగుతున్న కొద్దీ, ఫ్లాష్‌బ్యాక్‌ల ద్వారా ఈ వైరస్ గురించి, కుటుంబం బంకర్‌లో ఎలా చిక్కుకుందో తెలుస్తుంది. ఇప్పుడు జోయ్ బారికేడ్ దాటి బయటకు వెళ్లడంతో, బ్రీదర్స్ బంకర్‌లోకి చొరబడతారు. అప్పుడు ఒక షాకింగ్ ట్విస్ట్ బయటపడుతుంది. బ్రీదర్స్ జీవులు కాదు, గ్యాస్ మాస్క్‌లు ధరించిన అమెరికన్ సైనికులు. వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు క్వారంటైన్ జోన్‌ను అమలు చేస్తుంటారు. రే, క్లైర్, జోయ్‌లు వాస్తవానికి వైరస్ సోకినవాళ్ళే. ఇక క్లైమాక్స్ లో రే, క్లైర్ సూపర్ హ్యూమన్ శక్తులతో బ్రీదర్స్‌పై దాడి చేస్తారు. ఈ దాడిలో ఎవరు పై చేయి సాధిస్తారు ? ఈ వైరస్ ఎలాంటిది ? దీని నుంచి ఈ ఫ్యామిలీ ఎలా బయట పడుతుంది ? అనే విషయాలను, ఈ సినిమాని చూసి తెలుసుకోండి.
Read Also : వరుస మర్డర్స్ తో పోలీసులకు చెమటలు పట్టించే కిల్లర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న కొరియన్ క్రైమ్ థ్రిల్లర్