BigTV English

AP Congress List : నేడే ఏపీ కాంగ్రెస్ జాబితా.. ఇడుపులపాయలో ప్రకటించనున్న షర్మిల

AP Congress List : నేడే ఏపీ కాంగ్రెస్ జాబితా.. ఇడుపులపాయలో ప్రకటించనున్న షర్మిల


AP Congress Candidates List : ఈసారి ఏపీ ఎన్నికల బరిలో కాంగ్రెస్ కూడా నిలబడుతోంది. వైఎస్సార్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేసిన షర్మిల.. ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టాక అక్కడి నేతల్లో కాస్త ఉత్సాహం వచ్చింది. రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు కావస్తున్నా.. ఏపీ, తెలంగాణ వేరు కావడానికి కారణం కాంగ్రెస్ అని, కాంగ్రెస్ వల్లే తమకు అన్యాయం జరిగిందన్న భావన ఏపీ ప్రజల్లో ఇప్పటికీ ఉంది. ఇలాంటి సమయంలో కాంగ్రెస్ ఏపీ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీకి సిద్ధమైంది.

సోమవారం కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీతో భేటీ అయిన షర్మిల.. దాదాపుగా అభ్యర్థులను ఖరారు చేసినట్లు చెప్పారు. మొత్తం 17 పార్లమెంట్ స్థానాలకు గాను 5 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థుల పేర్లు ఖరారయ్యాయి. మిగతా 12 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థుల పేర్లను పరిశీలిస్తున్నారు.


Also Read : కడప గడపలో వైఎస్ వర్సెస్ వైఎస్.. అక్క చేతిలో తమ్ముడి పరిస్థితి ఏంటో..?

కడప నుంచి వైఎస్ షర్మిల, బాపట్ల నుంచి జేడీ శీలం, కాకినాడ నుంచి పల్లంరాజు, రాజమండ్రి నుంచి గిడుగు రుద్రరాజు, కర్నూల్ నుంచి రాంపుల్లయ్య యాదవ్ లు ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేయనున్నారు.

విశాఖ – సత్యారెడ్డి, ఏలూరు – లావణ్య, అనకాపల్లి – వేగి వెంకటేశ్, శ్రీకాకుళం – పరమేశ్వరరావు, విజయనగరం – రమేశ్ కుమార్, రాజంపేట – నజీం అహ్మద్, చిత్తూరు – చిట్టిబాబు, హిందూపురం – షాహీన్, నరసరావుపేట – అలెగ్జాండర్, నెల్లూరు – దేవకుమార్ రెడ్డి, ఒంగోలు – సుధాకర్ రెడ్డి, మచిలీపట్నం – గొల్లు కృష్ణ, నరసాపురం – బొమ్మిడి రవిశ్రీనివాస్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. వీరిలో కొన్నిచోట్ల మార్పులు కూడా జరగవచ్చని సమాచారం.

మంగళవారం (ఏప్రిల్ 2) మధ్యాహ్నం ఇడుపులపాయలో ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కాంగ్రెస్ అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ ను ప్రకటించనున్నారు. 5 లోక్ సభ, 114 అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థుల పేర్లను ప్రకటించనున్నారు. తండ్రి వైఎస్సార్ సమాధి వద్దే ఈ జాబితాను విడుదల చేయనున్నారు.

Related News

APSRTC employees: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. ప్రమోషన్స్ పండుగ వచ్చేసింది!

Mega Projects in AP: ఏపీకి భారీ పెట్టుబడి.. అన్ని కోట్లు అనుకోవద్దు.. జాబ్స్ కూడా ఫుల్!

Vinayaka Chavithi 2025: దక్షిణ భారతదేశంలోనే ఎత్తైన మట్టి గణేష్ విగ్రహం.. దర్శిస్తే కలిగే భాగ్యం ఇదే!

Heavy Rain Andhra: ఏపీకి భారీ వర్షసూచన.. రాబోయే 48 గంటలు కీలకం.. అప్రమత్తం అంటూ హెచ్చరిక!

Auto drivers: బస్సులో బిక్షాటన చేసిన ఆటో డ్రైవర్లు.. రోడ్డున పడ్డామంటూ ఆవేదన

Bhumana Vs Srilakshmi: రూటు మార్చిన వైసీపీ.. టార్గెట్ ఐఏఎస్ శ్రీలక్ష్మి, చీరలు-విగ్గుల ఖర్చెంత?

Big Stories

×