Big Stories

AP Volunteer Resignations : వాలంటీర్ల రాజీనామా.. ప్రభావమెంత?

AP Volunteer Resignations
 

AP Volunteer Resignations(Local news andhra Pradesh): ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. వందల సంఖ్యలో రాజీనామాలు.. అది కూడా ఎట్‌ ఏ టైమ్.. ప్రస్తుతం ఏపీలో వాలంటీర్ల రీజైన్స్‌ పర్వం కంటిన్యూ అవుతోంది. స్టేట్‌ వైడ్‌గా ఎందుకంటే 2 లక్షల 55 వేల 464 మంది వాలంటీర్స్ ఉంటే.. ఇప్పటికే చాలా మంది రిజైన్స్ బాట పట్టారు.. ఇంతకీ రీజైన్స్‌ వెనక రీజన్స్ ఏంటి? ఈ రిజైన్స్‌ ఏపీ ఎలక్షన్స్‌పై ఎలాంటి ఎఫెక్ట్ చూపబోతుంది. ఎలక్షన్ కమిషన్‌ ఓ రూల్ పాస్ చేసింది.. వాలంటీర్లు ఎలక్షన్ డ్యూటీలో పాల్గొనకూడదు.. వాలంటీర్లు రేషన్‌ పంపిణీ చేయకూడదు.. వాలంటీర్లు పెన్షన్‌తో పాటు ఎలాంటి సంక్షేమ పథకాలను ఇళ్లకు వెళ్లి అందించకూడదు.. మొబైల్ ఫోన్లు, ఇతర డివైజ్‌లు వెనక్కి ఇచ్చేయాలి.. ఈ ఆర్డర్స్‌ ఎఫెక్ట్‌తో .. ఈ మంత్‌ లబ్ధిదారుల ఇళ్ల వద్దకు పెన్షన్ డబ్బులు రాలేదు.. వాళ్లే వెళ్లి తెచ్చుకోవాల్సి వచ్చింది.. అంతేకాదు ఈ ఆర్డర్స్‌ ఎఫెక్ట్‌తో వాలంటీర్లు హర్ట్ అయ్యారు.. మూకుమ్మడిగా రిజైన్స్ చేస్తున్నారు.

- Advertisement -

ఎగ్జాక్ట్‌గా వాళ్లు చెప్పే రీజన్సేంటి అంటే.. మేము 50 నెలలుగా నిస్వార్థంగా సేవ చేస్తున్నాం.. ప్రతి ఇంటికి వెళ్లి సంక్షేమ పథకాలు అందజేస్తున్నాం. అయినా కానీ తమపై కొందరు కావాలనే ఫిర్యాదు చేస్తున్నారు.. రాజకీయ లబ్ధి కోసం తమను వాడుకుంటున్నారు. ఇవీ వాళ్లు చెప్పే రీజన్స్. అయితే నిజంగా రీజన్స్‌ ఇవేనా? దీని వెనక రాజకీయ ఎత్తుగడలు ఉన్నాయా? అనేదే ఇప్పుడు అసలైన ఇంట్రెస్టింగ్ ఇష్యూ.. ఎందుకంటే చాలా రోజుల నుంచి ఏపీలో వాలంటీర్లు అనేది చాలా మేజర్ ఇష్యూ.. వాలంటీర్లు ఎన్నికల విధుల్లో పాల్గొనవద్దని మొదట ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో ఈసీ రియాక్టై వారిని ఎన్నికల విధుల నుంచి తప్పించింది.. ఆ తర్వాత వారు రాజకీయ పార్టీల ప్రచారంలో పాల్గొనవద్దని ఆదేశాలు జారీ అయ్యాయి.. వాటిని ఉల్లంఘించి ప్రచారం చేసిన వారిపై ఈసీ చర్యలు తీసుకుంది. ఈ పరిణామాలన్నింటిని తమపై వేధింపులుగా భావించారు.. అందుకే రాజీనామాల బాట పట్టారు.

- Advertisement -

Also Read: కడప గడపలో వైఎస్ వర్సెస్ వైఎస్.. అక్క చేతిలో తమ్ముడి పరిస్థితి ఏంటో..?

అయితే ఈ వాలంటీర్స్ రీజైన్ ఇష్యూ ఇప్పటికే రాజకీయంగా సెగలు రేపుతోంది. ఈసీ ఆదేశాల కారణంగా ఒకటో తేదీన లబ్ధిదారులకు పెన్షన్ అందలేదు.. దీనికి కారణం మీరంటే మీరని.. అటు వైసీపీ, ఇటు టీడీపీ నేతలు పరస్పర విమర్శలు చేసుకున్నారు.. పెన్షన్లు పంపిణీ చేయవద్దని తాము ఈసీకి ఫిర్యాదు చేయలేదన్నారు చంద్రబాబు. ఇప్పటికే వాలంటీర్లకు బంపరాఫర్లు ప్రకటించారు చంద్రబాబు.. వారికి గౌరవ వేతనంతో పాటు. 30 నుంచి 50 వేల వరకు సంపాదించేలా ఏర్పాట్లు చేస్తామన్నారు.. అంతేకాదు ఆ తర్వాత వారి ఉద్యోగాలను పర్మినెంట్ చేస్తామన్నారు.. ఎట్ ది సేమ్‌ టైమ్.. అధికార పక్షానికి మద్దతిచ్చే వాలంటీర్లకు వార్నింగ్ కూడా ఇచ్చారు.. అలాంటి వారిపై తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే చర్యలు తీసుకంటామన్నారు.. అయితే వైసీపీ వర్షన్‌ మరోలా ఉంది.

ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది ఎవరు? ఫిర్యాదు చేసిన సిటిజన్ ఫర్ డెమొక్రసీ వెనకుంది ఎవరు? అని ప్రశ్నిస్తున్నారు మంత్రి బొత్స సత్యానారాయణ.. రాజీనామా చేస్తున్న వాలంటీర్ల ఉద్యోగాలు ఎక్కడికీ పోవని హామీ ఇస్తున్నారు.. సో.. అటు వైసీపీ, ఇటు టీడీపీ రెండు పార్టీలు వాలంటీర్లను మచ్చిక చేసుకునే ప్రయ్నతాల్లో ఉన్నాయని అర్థమవుతోంది. మరిప్పుడు రాజీనామా చేసిన వాలంటీర్లు ఏం చేస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. చాలా మంది వైసీపీ మద్దతుదారులనే వాలంటీర్లుగా నియమించారన్న ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నాయి. అందుకే విపక్షాలు వారంతా వైసీపీ తరపున ప్రచారం చేస్తారన్న భయంలో ఉన్నారు. ఇప్పుడు రిజైన్ చేయడంతో వారంతా వైసీపీ అభ్యర్థుల తరపున ప్రచారం చేసే అవకాశం ఉంది.. అలా చేసినా ఈసీ చర్యలు తీసుకునే అవకాశం లేదు.. కానీ ఊర్లో వాళ్లకు వాలంటీర్లుగా ఉన్న గుర్తింపు మాత్రం అంత త్వరగా పోదు.. సంక్షేమ పథకాల లబ్ధిదారులను వాళ్లు ప్రభావితం చేసే అవకాశం ఉంది.. ఇప్పుడు వైసీపీ నేతల హామీతో.. ఉద్యోగం కోసమైనా వాళ్లు ఆ పార్టీ తరపున ప్రచారం చేసే అవకాశం ఉంది.. అయితే ప్రభుత్వం మారితే మాత్రం వారికి చిక్కులు తప్పవనే చెప్పాలి.

.

.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News