Big Stories

KCR Politics : కేసీఆర్ సాబ్.. ప్రశ్నలు సరే..! వీటికి సమాధానాలేవి?

KCR Politics
 

KCR Politics Latest Political News: తెలంగాణ పనైపోయింది.. రాష్ట్రం ఆగమాగమవుతోంది.. అసలు కాంగ్రెస్‌కు పాలించడం వచ్చా.. వంద రోజుల్లో ఏదో చేస్తానని.. నిండా ముంచారు.. అసలు రేవంత్‌కు సీఎం అయ్యే అర్హత ఉందా? పంటలు ఎండిపోయాయి.. కాలువల్లో నీళ్లు లేవు.. కరెంట్ ఊసే లేదు. ఇలా కామాలే కానీ.. ఫుల్‌స్టాప్‌లు లేకుండా సాగిపోతుంది.. మాజీ సీఎం కేసీఆర్‌ ఆరోపణల వర్షం.. విమర్శల జోరు.. ఇంతకీ తెలంగాణ నిజంగా అంతటీ దారుణ పరిస్థితుల్లో ఉందా? అసలు కేసీఆర్‌ వ్యాఖ్యల అర్థాలు, వాటి వెనకున్న పరమార్థలేంటో డీకోడ్ చేద్దాం. చింత చచ్చినా.. పులుపు చావలేదు. ఇది కేసీఆర్‌కు సరిగ్గా సూటయ్యే సామెత అంటున్నారు కాంగ్రెస్‌ నేతలు.. ఎందుకంటే అధికారం పోయినా.. అబద్ధాలు చెప్పడం ఆపడం లేదు.. ప్రజలను తప్పుదారి పట్టించడం అస్సలు మానడం లేదు.

- Advertisement -

ఇదీ వాళ్లు చేస్తున్న ఆరోపణ.. ఎండిన పంటలు.. కేసీఆర్‌ పరామర్శ.. పేరుతో ప్రస్తుతం ఆయన జిల్లాల బాట పట్టారు.. ఒక్కో జిల్లాలో పర్యటిస్తూ రైతులను పరామర్శిస్తున్నారు.. బాగుంది.. కొన్ని జిల్లాల్లో పంటలు ఎండిన మాట వాస్తవమే.. వాటిని కేసీఆర్‌ పరిశీలించి.. బాధితులను పరామర్శించడం మంచిదే. కానీ.. ఆయన వ్యాఖ్యలే కాస్త తేడాగా ఉన్నాయి.. తప్పంతా కాంగ్రెస్‌దే అంటున్నారు కేసీఆర్.. మరి అది నిజంగా నిజమా? ఒక్కసారి డీటెయిల్స్‌ ఏంటో చూద్దాం.. కాంగ్రెస్‌ గవర్నమెంట్ ఎప్పుడు ఏర్పడింది.. గతేడాది డిసెంబర్‌లో.. మరి అప్పటికే రాష్ట్రంలో సమృద్ధిగా కరిశాయా? నో.. రాష్ట్రవ్యాప్తంగా లోటు వర్షపాతం నమోఐంది.. పోనీ కృష్ణా పరివాహకంలో వానలు కురిశాయా? నో.. అసలు వానలే లేవు.. శ్రీశైలం, నాగార్జున సాగర్ నిండాయా.. ? లేదు.. సరే ఇన్ని చెబుతున్నారు కదా.. గత ప్రభుత్వం మొదటి పంటకు పూర్తి స్థాయిలో నీళ్లిచ్చింఆ? లేదు నాగార్జున సాగర్‌లో నీళ్లు లేవు.

- Advertisement -

Also Read: ట్యాపింగ్ కేసు క్లైమాక్స్‌కు ఆ సుప్రీమ్ ఎవరు?

కాబట్టి మొదటి పండకే నీళ్లీవ్వలేదు.. ఇన్నీ చేశారు. పరిస్థితి ఏంటో తెలుసు.. మొదటి పంటకే నీళ్లిచ్చే పరిస్థితి లేదని తెలిసిన వారే.. ఇప్పుడు రెండో పంటకు నీళ్లివ్వడం లేదు అని ప్రశ్నిస్తున్నారు.. మరి ఇది మీకు తగునా అంటూ అటు కాంగ్రెస్‌ నేతలు.. ఇటు మీరు ప్రస్తుతం పరిశీలిస్తున్న ప్రాంత రైతులు మీకు క్వశ్చన్స్ వేస్తున్నారు. ఇక కరెంట్ ముచ్చటేందో చూద్దాం.. తమ పాలనలో స్విచ్‌ వేస్తే చాలు జలధారా పొంగేది అంటున్నారు కేసీఆర్.. దీని లెక్కేంటో చూద్దాం.. వేల కోట్లు అప్పులు.. 24 గంటలు కాదు కదా.. 14 గంటలు కూడా కరెంట్ ఇవ్వలేదని ఇప్పటికే ఆధారాలతో సహా ప్రూవ్‌ అయ్యింది.. అంతేకాదు రాష్ట్ర ఖజానా దెబ్బతినేలా ఇతర రాష్ట్రాలతో చేసుకున్న ఒప్పందాలు.. కుప్పలుగా చేసిన అప్పులు.. వాటికి కడుతున్న వడ్డీలు.. ఇలా విద్యుత్ రంగం కుదేలైన పరిస్థితి ఉంటే.. ఇప్పుడు కాంగ్రెస్‌ వచ్చి ఆ రంగాన్ని నాశనం చేసిందని చెప్పేస్తున్నారు.. ఇది కూడా మనం చెప్పే మాట కాదు.. కాంగ్రెస్‌ నేతలు అంటున్నదే.

ఇదే కాదు.. రైతు ఆత్మహత్యలపై కూడా కేసీఆర్ అనేక ఆరోపణలు చేశారు.. కాంగ్రెస్‌ వంద రోజుల పాలనలో 200 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారన్నారు.. నిజమే అనుకుందాం.. కానీ కాంగ్రెస్‌ వచ్చిన వంద రోజుల్లో ఓ పంట పూర్తి కాదు.. మరి ఆ పంటకు కావాల్సిన సాగునీటిని విడుదల చేయాల్సింది ఎవరు? అప్పటి ప్రభుత్వమే కదా.. మరి ఆ ఆత్మహత్యల పాపం ఎవరిది? కాంగ్రెస్‌దా? బీఆర్ఎస్‌దా?  ఇలా కేసీఆర్ వేసే ప్రతి క్వశ్చన్‌కు.. వేసే ప్రతి అడుగుకు.. పది జవాబులు వస్తున్నాయి.. ఇవన్నీ ఒకెత్తు అయితే.. అధికారంలో ఉన్నప్పుడు అయితే ప్రగతిభవన్.. లేదంటే ఫామ్‌ హౌస్‌లో గడిపిన కేసీఆర్‌కు.. ఉన్నట్టుండి రైతులపై ఇంత కరుణ ఎంత కురిపిస్తున్నారు? అన్నదే ఇప్పుడు మెయిన్‌ క్వశ్చన్.. కేసీఆర్‌ ఇలా జిల్లాల బాట పట్టడానికి చాలా రీజన్స్‌ ఉన్నాయంటున్నారు అనలిస్ట్‌లు.. మొదటిది. త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికలు.. రెండు.. కల్వకుంట్ల కుటుంబ సభ్యులపై ఉన్న కేసులు.. మూడు.. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో రోజురోజుకు జరుగుతున్న బదానం.. నాలుగు.. పార్టీని వీడుతున్న నేతలు.. ఇలా అనేక సమస్యలతో ప్రస్తుతం బీఆర్ఎస్‌ ఉక్కిరిబిక్కిరవుతోంది.. జనంలో ప్రస్తుతం ఇదే టాపిక్‌పై డిస్కషన్ జరుగుతోంది.

Also Read: సాగర్ ఏదైనా దోచుడే.. ట్రబుల్ మేకర్‌

ఇదే పరిస్థితి కంటిన్యూ అయితే.. బీఆర్ఎస్‌ అడ్రస్ గల్లంతవడం ఖాయం.. అందుకే బీఆర్ఎస్‌ అధినేత రూట్‌ మార్చారు.. ఫామ్‌హౌస్‌ వదిలి జిల్లాల బాట పట్టారు. ఇప్పుడే కాదు.. గతకొన్ని రోజులుగా బీఆర్ఎస్‌ ఉద్యమ బాట పట్టింది.. ఇవే కాదు నీటి ఉద్యమాలు అంటూ మొదట ఉద్యమాలు చేశారు.. ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించేందుకు అంగీకరించి.. తర్వాత ఆ నెపాన్ని కాంగ్రెస్‌ పార్టీపై నెట్టేందుకు ప్రయత్నించారు.. కానీ అప్పట్లోనే కాంగ్రెస్ కౌంటర్‌ అటాక్‌తో కారు జోరు తగ్గింది.. ఇప్పుడేమో రైతు నామ స్మరణ చేస్తున్నారు. రైతులకు నష్ట పరిహారం ఇవ్వాలంటున్నారు.. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా ధర్నాలు చేస్తున్నారు. కానీ ఇవన్నీ వర్కౌట్‌ అవుతాయా? నిజానికి ఎన్నికలు వచ్చిన ప్రతిసారి బీఆర్‌ఎస్‌ సెంటిమెంట్‌ను రగులుస్తోంది.. ప్రతి ఎన్నిక ముందు ఇదే సీన్ రీపిట్.. ఈసారి కూడా అదే జరుగుతోంది. అయితే ఉన్న అస్త్రాలన్నీ అయిపోవడంతో.. ఇప్పుడు ఆఖరి అస్త్రంగా రైతు సెంటిమెంట్‌ను రగిలించే ప్రయత్నం చేస్తోంది.. కానీ బీఆర్ఎస్‌ పాచికలు పనిచేస్తాయా? కేసీఆర్ అస్త్రాలు పనిచేయాలంటే కొన్ని ప్రశ్నలకు సమాధానాలు కావాలంటున్నారు రైతులు.

కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు పంటల బీమాను పట్టించుకున్నారా? రైతులు కష్టాల్లో ఉన్నప్పుడు పట్టించుకున్నారా? ఫసల్ బీమా యోజన నుంచి 2020లో తప్పుకుంది ఎవరు? రైతు బంధు, రైతు బీమా ఇచ్చి మిగతా రాయితీలని మాయం చేసింది ఎవరు? రైతు పరికరాలపై ఉన్న సబ్సీడీలను ఎత్తేసింది ఎవరు? బీఆర్ఎస్‌ హయాంలో అకాల వర్షాలతో పంటలు నాశనమైతే పట్టించుకున్నారా? ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి.. ఆ తర్వాత తమ వద్దకు రండి అంటున్నారు రైతులు. మరి కేసీఆర్‌ చేసే పోరాటాలు, స్పీచ్‌లు.. ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారాన్ని పక్కకు పోయేలా చేస్తుందా? లిక్కర్ స్కామ్‌లో కవిత తీహార్‌ జైల్లో ఉన్న విషయాన్ని మరిచిపోయేలా చేస్తుందా? కల్వకుంట్ల కుటుంబ సభ్యులపై వస్తున్న భూకబ్జా ఆరోపణలను మరిచిపోయేలా చేస్తుందా? కేసీఆర్ పాలనను పదేళ్ల పాటు అబ్జర్వ్‌ చేస్తూ వస్తున్న ప్రజలకు ఈ విషయాలు అర్థం కావా? కావు అనుకుంటే అది నేతల అమాయకత్వమే.. ప్రజలు మారారు.. వాళ్ల ఆలోచనా విధానం మారింది.. ప్రజలు ఎప్పుడూ అనాలోచితంగా, ఆవేశంగా ఓట్లు వేయరు.

.

.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News