YS Sunita met home minister: వైఎస్ వివేకానంద కేసు ఎంతవరకు వచ్చింది? ఏపీలో ప్రభుత్వ మారి న తర్వాత ఆ కేసులో కదలిక వచ్చిందా? సచివాలయంలో హోంమంత్రి అనితతో వైఎస్ సునీత ఎందుకు భేటీ అయ్యారు? ఇరువురు మధ్య వివేకానంద కేసు చర్చకు వచ్చిందా? అవుననే సంకేతాలు బలంగా వినిపి స్తున్నాయి.
బుధవారం అమరావతి సచివాలయంలో హోంమంత్రి అనితతో వైఎస్ సునీత సమావేశమయ్యారు. దాదా పు అరగంటపాటు మాట్లాడినట్టు తెలుస్తోంది. తన తండ్రి హత్య కేసులో జరిగిన అన్యాయాన్ని మంత్రికి సునీత వివరించారు. హత్య జరిగిన తర్వాత పరిణామాలను మంత్రికి వివరించారు.
గత ప్రభుత్వం ఈ కేసు విచారణ సమయంలో స్థానిక పోలీసులు అండగా నిలిచారని, వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పినట్టు తెలుస్తోంది. వీలైనంత త్వరగా కేసుకు ముగింపు ఇవ్వాలని కోరినట్టు తెలుస్తోం ది. వివేకానంద కేసును సీబీఐ విచారణ చేస్తోంది. ఈ విషయంలో ప్రభుత్వం తరపున పూర్తి సహకారం ఉంటుందని మంత్రి అనిత హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది.
ALSO READ: ట్రైన్‌లో రెచ్చిపోయిన కామాంధుడు, తోటి ప్రయాణికులు చెప్పినా, చివరకు..
దోషులకు శిక్ష పడేందుకు ప్రభుత్వం చిత్త శుద్దితో పనిచేస్తుందన్నారట. ఈ కేసు విషయంలో ఎవరినీ వదిలేది లేదని చెప్పినట్టు సమాచారం. వివేకానంద కేసుతో తనకు న్యాయం జరగలేదని భావించి అప్పటి జగన్ సర్కార్‌పై పోరాటం చేశారు వైఎస్ సునీత. ఈ కేసుకు సంబంధించి కాల్‌డేటా వివరాలను సైతం బయటపెట్టారు. కీలక నిందితులుగా భావిస్తున్నవారికి వ్యతిరేకంగా మొన్నటి ఎన్నికల్లో సునీత ప్రచారం చేసిన విషయం తెల్సిందే.
అమరావతి: సచివాలయంలో హోంమంత్రి వంగలపూడి అనితను కలిసిన దివంగత వైఎస్ వివేకానంద కుమార్తె సునీత.. హోంమంత్రిని సునీత కలవడంపై సర్వత్రా చర్చ.#HomeMinisterAnitha #Tdp #YsSunitha #APnews #NewsUpdates #Bigtvlive @JaiTDP @Anitha_TDP @YSRCParty @ysjagan pic.twitter.com/iCjM608es3
— BIG TV Breaking News (@bigtvtelugu) August 7, 2024