Deccan Kitchen Case: ఫిలింనగర్లో భూ వివాదంపై దగ్గుపాటి ఫ్యామిలీ పై కేసులు నమోదైన విషయం తెలిసిందే. దగ్గుబాటి రానా, వెంకటేష్ సురేష్, అభిరామ్ లపై కొన్ని నెలల క్రితం భూవివాదం విషయం పై పోలీస్ కేసు నమోదు అయ్యాయి. దక్కన్ కిచెన్ కూల్చివేత పై నేడు నాంపల్లి కోర్టులో విచారణ జరుగనుంది. కాగా ఈ కేసులో ఇప్పటికే సినీ నటులు వెంకటేష్ తో పాటు దగ్గుబాటి సురేష్ బాబు, రానాపై కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది.. ఇవాళ నాంపల్లి కోర్టుకు దగ్గుబాటి ఫ్యామిలీ విచారణకు హాజరు కావాల్సి ఉంది.. మరి కొద్ది సేపట్లో కోర్టుకు ఈ ఫ్యామిలీ హాజరయ్యే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.
దక్కన్ కిచెన్ కూల్చివేత పై గత రెండు నెలల క్రితం దగ్గుబాటి ఫ్యామిలీ పై దక్కన్ కిచెన్ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ కూల్చివేతపై విచారణకు కోర్టుకు హాజరు కావాలని గతంలో కోర్టు నుంచి దగ్గుబాటి ఫ్యామిలీకి నోటీసులు కూడా అందాయి. విచారణకు రాకుండా కాలయాపన చేస్తున్నా దగ్గుపాటి సురేష్, వెంకటేష్, రానా పై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆగస్టు1న కోర్టుకు హాజరు కావాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది. అప్పుడు వాయిదా పడిన విచారణ నేడు జరగనుంది. అయితే నేడు విచారణ కు హాజరువుతారా? లేదా? అన్నదానిపై సందిగ్ధత నెలకొంది. న్యాయ స్థానం ఆదేశాలు బేఖాతరు చేస్తారా? అన్నది మరికొద్ది సేపట్లో తెలిసే అవకాశం ఉంది.
Also Read : ప్రేమకు సారీ చెప్పిన ధీరజ్.. చెంప పగలగొట్టిన ప్రేమ.. భాగ్యంకు దిమ్మతిరిగే షాక్..
దక్కన్ కిచెన్ హోటల్ భూ విషయంలో దగ్గుబాటి కుటుంబంతో వివాదాలు చెలరేగిన విషయం తెలిసిందే.. నందకుమార్ సిటీ సివిల్ కోర్టులో కేసు వేశారు. దీంతో ఈ విషయం కోర్టు పరిధికి చేరింది. ఇకపోతే 2022 నవంబరులో జీహెచ్ ఎంసీ సిబ్బంది.. బౌన్సర్లతో కలిసి హోటల్‌ను కొంతవరకు ధ్వంసం చేశారు. ఆ స్థలం పై జోక్యం చేసుకోవద్దు అని కోర్టు ఆదేశాలను జారీ చేసింది. అయినా కూడా దగ్గుబాటి కుటుంబం కోర్టు ఆర్డర్స్ ని లెక్కచేయకుండా ఆ హోటల్ ని కూల్చివేశారు. దాంతో హోటల్ యజమాని నందకుమార్ పోలీసులను ఆశ్రయించారు. నాంపల్లి కోర్టుకు ఫిలింనగర్ కోర్టుకు కేసును బదిలీ చేసింది. ఆ హోటల్ విషయంలో ఎటువంటి జోక్యం చేసుకోకూడదని కోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయాన్ని ఖేతారు చేయకుండా దగ్గుబాటి ఫ్యామిలీ వ్యవహరించారంటూ కోర్టు సీరియస్ అయింది.. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించిన హీరో వెంకటేశ్, సురేశ్ బాబు, రానా, అభిరామ్ లు తనకు చేసిన అన్యాయంపై కోర్టులో దక్కన్ కిచెన్ యజమాని నందకుమార్ పోరాడుతున్నారు.. నేడు ఈ కేసు పై కోర్టులో విచారణ జరగనుంది. మరి ఎవరి కి కోర్టులో తీర్పు అనుకూలంగా వస్తుందో చూడాలి..