Delhi News: ఆన్‌లైన్ లైవ్ వ్యవహారాలు వచ్చిన తర్వాత జాగ్రత్తగా వ్యవహారించాలి. తేడా వస్తే వ్యక్తిగతంగానే కాకుండా ఆ వ్యవస్థకు మాయని మచ్చ అవుతుంది. అలాంటి ఘటన ఒకటి జరిగింది. హైకోర్టులో వర్చువల్ ప్రొసీడింగ్స్ జరుగుతుండగా న్యాయవాది ఓ మహిళను ముద్దు పెట్టుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.
కోర్టు ప్రొసీడింగ్స్..
అర చేతిలోకి సెల్‌ఫోన్ వచ్చిన తర్వాత జాగ్రత్తగా ఉండాలి. తేడా వస్తే బతుకు బండారం అవుతుంది. ఉన్నత వృత్తిలో ఉన్నవారు ఈ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. అంతేకాదు పలువురికి మార్గదర్శకంగా ఉండాలి. కానీ కొందరు వ్యక్తులు మాత్రం అవేమీ పట్టించుకోలేదు. వారి ప్రవర్తన కారణంగా వార్తల్లో నిలుస్తున్నారు.
హైకోర్టులో వర్చువల్ ప్రొసీడింగ్స్ జరుగుతున్నట్లు చెబుతున్న ఓ వీడియో సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ మధ్య కొన్ని కేసుల్లో కొంతమంది లాయర్లు, లేకుంటే నిందితులు వర్చువల్‌గా న్యాయస్థానం ముందు హాజరవుతున్నారు. మంగళవారం కోర్టులో న్యాయమూర్తి కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. ఓ కేసు నిమిత్తం వర్చువల్‌గా వాదనలు వినిపించేందుకు సిద్ధమయ్యారు అడ్వకేటు.
మహిళకు కిస్ ఇచ్చిన లాయర్
లాప్‌టాప్‌లో వీడియో మోడ్‌ను ఆన్ చేసిన సంగతి సదరు అడ్వకేట్ మర్చిపోయాడు. ఆ గదిలో అప్పటికే ఓ మహిళ ఉంది. ఆ క్రమంలో లాయర్-మహిళ ముద్దు సన్నివేశాలు టక్కున ఆన్‌లైన్‌లో దర్శనమిచ్చారు. వాటిని చూసినవారు ఒక్కసారిగా షాకయ్యారు. ఇది నిజమా? కావాలనే ఎవరైనా చేశారా? అంటూ చర్చించుకోవడం మొదలైంది.
వెంటనే కొంతమంది సదరు లాయర్‌కు ఫోన్ చేసి అలర్ట్ చేశారు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీన్ని చూసిన నెటిజన్లు షాకవుతున్నారు. వీడియో పోస్ట్ చేసిన రెండు గంటల్లో 89.7K మంది వీక్షించారు. అయితే వీడియోలో న్యాయవాది, మహిళ ఎవరు అనేది ఇంకా నిర్ధారించలేదు.
ALSO READ: చత్తీస్‌ఘడ్‌లో లొంగిపోయిన 27 మంది మావోయిస్టులు
న్యాయం కోసం వాదించినవాళ్లు ఇలా చేస్తే ఎలా అంటూ చర్చించుకుంటున్నారు. దీనిపై న్యాయవాదులు రకరకాలుగా మాట్లాడుతున్నారు. జూన్‌లో గుజరాత్ హైకోర్టు కార్యకలాపాలకు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ఓ వ్యక్తి టాయిలెట్‌లో కూర్చుని హాజరయ్యాడు. దీనికి సంబందించిన వీడియో అప్పట్లో వైరల్ అయిన సంగతి తెల్సిందే.
Welcome to Digital India Justice 😂
Court is online… but judge forgot it’s LIVE! ☠️
When tech meets tradition
— and the camera off button loses the case! 🤣 pic.twitter.com/1GbfOFQ6w7— ShoneeKapoor (@ShoneeKapoor) October 15, 2025