EngW vs PakW : వన్డే మహిళల ప్రపంచకప్ 2025 టోర్నమెంట్ లో పాకిస్తాన్ జట్టుకు మరో ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ లో పాకిస్తాన్ కు వరుణుడు బ్రేక్ వేశాడు. వర్షం కారణంగా నిన్న పాకిస్తాన్ వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరగాల్సిన మ్యాచ్ రద్దు అయిన సంగతి తెలిసిందే. దీంతో చెరో పాయింట్ అందించారు అంపైర్లు. అయితే నిన్నటి మ్యాచ్ రద్దు కావడంతో పాకిస్తాన్ ఎలిమినేట్ అయ్యే ప్రమాదం పొంచి ఉంది. పాయింట్లు పట్టికలో పాకిస్తాన్, చిట్టచివరణ ఉంది. ఇక తన తర్వాతి షెడ్యూల్లో వరుసగా మ్యాచ్ లు గెలిచిన కూడా పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చు అని చెబుతున్నారు క్రీడా విశ్లేషకులు. దీంతో వన్డే మహిళల ప్రపంచకప్ 2025 టోర్నమెంట్ లో పాకిస్తాన్ జట్టు ఎలిమినేట్ కావడం గ్యారెంటీ అంటున్నారు.
మహిళల వన్డే వరల్డ్ కప్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో నిన్న కొలంబోలోని ప్రేమదాస స్టేడియం వేదికగా 16వ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో మొదట ఇంగ్లాండు బ్యాటింగ్ చేసింది. పాయింట్ల పట్టికలో నెంబర్ వన్ స్థానంలో ఉన్న ఇంగ్లాండ్ పాకిస్తాన్ బౌలర్ల దెబ్బకు కుప్పకూలింది. వర్షం కారణంగా కుదించిన 31 ఓవర్లలో తొమ్మిది వికెట్లు నష్టపోయిన ఇంగ్లాండు 133 పరుగులు మాత్రమే చేసింది. అంటే దాదాపు ఇంగ్లాండ్ ఓటమి ఖాయం అయినట్లే. అలాంటి సమయంలో తక్కువ టార్గెట్ చేదించేందుకు బరిలోకి దిగింది పాకిస్తాన్. ఈ నేపథ్యంలోనే 6.4 ఓవర్స్ ఆడిన పాకిస్తాన్ ఒక్క వికెట్ నష్టపోకుండా 34 పరుగులు చేసింది. దీంతో పాకిస్తాన్ గెలుస్తుందని అందరూ ఊహించారు. కానీ అంతలోనే మరోసారి వర్షం పడింది. దీంతో మ్యాచ్ రద్దు చేశారు. ఈ నేపథ్యంలోనే ఇంగ్లాండ్ అలాగే పాకిస్తాన్ జట్లకు చెరొక పాయింట్ వచ్చింది. అయితే నిన్నటి మ్యాచ్ లో పాకిస్తాన్ గెలిస్తే పాయింట్లు పట్టికలో కాస్త ముందుకు వచ్చేది. వర్షం కారణంగా పాకిస్తాన్ కు ఎదురు దెబ్బ తగిలింది.
మహిళల వన్డే వరల్డ్ కప్ 2025 టోర్నమెంట్ పాయింట్ల పట్టికను ఒకసారి పరిశీలిస్తే, ఇంగ్లాండ్ మొదటి స్థానంలో నిలిచింది. ఏడు పాయింట్లు తో ఇంగ్లాండ్ మొదటి స్థానంలో కొనసాగుతోంది. ఆ తర్వాత ఆస్ట్రేలియా ఉండగా మూడో స్థానంలో సౌత్ ఆఫ్రికా నిలిచింది. ఇక నాలుగు మ్యాచ్ లలో రెండు ఓటమిలు అలాగే రెండు విజయాలతో నాలుగు పాయింట్లు సాధించిన ఇండియా నాలుగో స్థానంలో ఉంది. ఇక న్యూజిలాండ్ ఐదో స్థానంలో ఉండగా బంగ్లాదేశ్ ఆరో స్థానంలో నిలిచింది. అటు శ్రీలంక ఏడో స్థానంలో ఉండగా పాకిస్తాన్ చిట్టచివరన నిలిచింది. ఇప్పటివరకు పాకిస్తాన్ అలాగే శ్రీలంక రెండు జట్లు ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. దాదాపు ఈ రెండు జట్లు ఎలిమినేట్ అయినట్లే అని చెబుతున్నారు. అయితే నాలుగో స్థానం కోసం ఇండియా, న్యూజిలాండ్ అలాగే బంగ్లాదేశ్ తలపడతాయని తెలుస్తోంది.
Also Read: IND VS AUS: గంభీర్ కు చెప్పకుండానే ఆస్ట్రేలియాకు బయలుదేరిన రోహిత్, కోహ్లీ…సిరీస్ షెడ్యూల్ ఇదే
𝐏𝐚𝐤𝐢𝐬𝐭𝐚𝐧 🤝 𝐄𝐧𝐠𝐥𝐚𝐧𝐝 𝐭𝐚𝐤𝐞 𝐚 𝐩𝐨𝐢𝐧𝐭 𝐞𝐚𝐜𝐡!
𝐄𝐧𝐠𝐥𝐚𝐧𝐝: 𝟏𝟑𝟑/𝟗 (𝟑𝟏)
Charlie Dean – 33 (51)
Heather Knight – 18 (17)
Fatima Sana – 4/27 (6)𝐏𝐚𝐤𝐢𝐬𝐭𝐚𝐧: 𝟑𝟒/𝟎 (𝟔.𝟒)
Omaima Sohail – 19* (18)
Muneeba Ali – 9* (22)#CricketTwitter #CWC25… pic.twitter.com/8IDoH0JB9U— Female Cricket (@imfemalecricket) October 15, 2025