Tollywood Movies : టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్గా నిలిచాయి. ఒకప్పుడు కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే రిలీజ్ అయ్యే సినిమాలు ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అవుతూ.. అక్కడ కూడా మంచి సక్సెస్ ని అందుకుంటున్నాయి. ప్రస్తుతం స్టార్ హీరోలు అందరూ కూడా పాన్ ఇండియా చిత్రాల్లో నటించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు.. టాలీవుడ్ చిత్రాలకు బాలీవుడ్ లో మంచి డిమాండ్ ఉందన్న విషయం తెలిసిందే. అక్కడ తెలుగు చిత్రాలను చూసేందుకు జనాలు ఎక్కువగా ఆసక్తి కనపరుస్తున్నారు. కొన్ని సినిమాలు నార్త్ లో భారీగా వసూళ్లను రాబట్టాయి. తెలుగు సినిమా అయినా సరే నార్త్లో సత్తా చాటడంతో తెలుగు డైరెక్టర్లు పాన్ ఇండియా చిత్రాలపై ఆసక్తి కనబరుస్తున్నారు.. ఇప్పటివరకు నార్త్ లో రిలీజ్ అయిన తెలుగు సినిమాల కలెక్షన్ల గురించి ఒకసారి తెలుసుకుందాం.
దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ హిట్ మూవీ బాహుబలి.. రెబల్ స్టార్ ప్రభాస్, దగ్గుబాటి రానా, అనుష్క శెట్టి, రమ్యకృష్ణ తమన్న నటించిన ఈ చిత్రం సౌత్ లో ఎలాంటి రికార్డులను బ్రేక్ చేసిందో అందరికీ తెలుసు. పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయిన ఈ మూవీ నార్త్ లో కూడా 500 కోట్లకు పైగా వసూలు చేసి సరికొత్త రికార్డుని సొంతం చేసుకుంది. అయితే ఇప్పటివరకు 500 కోట్లు వసూలు చేసిన తెలుగు సినిమా ఇదే మొదటిది..
అల్లు అర్జున్, మాస్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ మూవీ పుష్ప.. ఈ మూవీ పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద దండయాత్ర మొదలుపెట్టింది. వరుసగా అన్ని సినిమాల రికార్డులను బ్రేక్ చేసింది. ఆ మూవీకి సీక్వెల్ గా వచ్చిన పుష్ప 2 మూవీ కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.. నార్త్ లో రూ.585 కోట్ల కలెక్షన్లు సాధించి సత్తా చాటింది..
బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా నటించిన భారీ బడ్జెట్ చిత్రం ఛావా.. ఛత్రపతి శివాజీ మహారాజ్ తనయుడు ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం నార్త్ లో 500 కోట్లకు పైగా వసూలు చేసి సరికొత్త రికార్డుని క్రియేట్ చేసింది.
Also Read: దక్కన్ కిచెన్ కేసు.. కోర్టుకు రానా, వెంకటేష్..
వీటితో పాటుగా పఠాన్, జవాన్, గదర్ 2, యానిమల్ చిత్రాలు కూడా నార్త్ లో 500 కోట్లకు పైగా వసూలు చేసి బాక్సాఫీస్ వద్ద వరుస రికార్డులను సొంతం చేసుకున్నాయి. అయితే ఈ మధ్య వచ్చిన సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేదు కానీ పర్వాలేదు అనే టాక్ ని సొంతం చేసుకున్నాయి. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న సినిమాల కోసం నార్త్ ఆడియన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారని తెలుస్తుంది. ప్రభాస్ మారుతి కాంబినేషన్ లో రాబోతున్న రాజా సాబ్ త్వరలోనే థియేటర్లలోకి రాబోతుంది. ప్రీ మూవీ అక్కడ ఎలాంటి రికార్డులను బ్రేక్ చేస్తుందో చూడాలి..