Bigg Boss 9:బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఆరవ వారానికి సంబంధించిన నామినేషన్స్ ప్రక్రియ పూర్తయింది. స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా పేరు సంపాదించుకున్న సెలబ్రిటీలు ఇప్పుడు నామినేషన్స్ లోకి వచ్చేసారు. అందులో ముగ్గురు డేంజర్ జోన్ లో ఉండగా.. ఒకరు మాత్రం ఎలిమినేట్ అయ్యే అవకాశాలు కచ్చితంగా కనిపిస్తున్నాయి. మరి ఆరవ వారానికి సంబంధించి ముగిసిన నామినేషన్స్ ప్రక్రియలో.. భరణి శంకర్, దివ్య నిఖిత, తనూజ, సుమన్ శెట్టి, డెమోన్ పవన్, రాము రాథోడ్ ఇలా 6మంది నామినేషన్స్ లోకి వచ్చేసారు.
ఈ 6 మంది కూడా స్ట్రాంగ్ కంటెస్టెంట్సే కావడం గమనార్హం. అటు ఓట్ల విషయంలో కూడా వీరికి బాగానే సపోర్టు ఉంది. మరి ఈ 6 మందిలో ఎవరు బయటకు వెళ్తారు అనే ఉత్కంఠ అటు ఆడియన్స్ లో కూడా భారీగా పెరిగిపోయిందని చెప్పవచ్చు. ఇకపోతే నామినేషన్స్ ప్రక్రియ అలా ముగిసిందో లేదో అప్పుడే ఓటింగ్ కూడా ప్రారంభం అయింది. తాజాగా సోషల్ మీడియాలో కనిపిస్తున్న ఓటింగ్ పోల్స్ ప్రకారం భరణి శంకర్ , తనూజ భారీ ఓటింగ్ తో అందరికంటే ముందున్నారు. ఆ తర్వాత డెమోన్ పవన్ కి కూడా ఓటింగ్ బాగానే పడుతోంది. ప్రస్తుతం రీతూ చౌదరి నామినేషన్స్ లో లేకపోవడంతో పవన్ కి బాగా కలిసి వచ్చినట్లు తెలుస్తోంది. అటు రీతు ఓట్లు కూడా ఈయనకే పడుతుండడం గమనార్హం.
ఇక్కడ డేంజర్ జోన్ లో ఉన్న వారి విషయానికొస్తే.. సుమన్ శెట్టి, దివ్య నిఖిత, రాము రాథోడ్.. ముగ్గురు కూడా డేంజర్ జోన్ లో ఉన్నారు. అయితే ఇందులో ఇప్పుడు దివ్య పేరు ఎక్కువగా వినిపిస్తోంది. అగ్నిపరీక్ష నుంచి వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చిన ఈమె.. మొదటి రెండు వారాలు తన మాట తీరుతో బాగానే ఆకట్టుకుంది. కానీ పెద్దగా ఓటు బ్యాంకు క్రియేట్ అవ్వలేదు. కాబట్టి ఈమె ఈ వారం ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. అలాగే రాము రాథోడ్ కి కూడా ఓటింగ్ లో లీస్ట్ లో ఉన్నాడు పోయిన వారం కెప్టెన్ గా, సంచాలక్ గా ఇరగదీసిన రాము ఈవారం వైల్డ్ కార్డు ఎంట్రీలతో డీలా పడిపోయాడు. ఇక సుమన్ శెట్టి పర్ఫామెన్స్ పెద్దగా లేకపోయినా ఇతడికి బయట నుండి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉంది కాబట్టి ఓటింగ్ బాగానే పడుతుంది. ఇప్పుడు ఉన్నదల్లా రాము రాథోడ్, దివ్య నిఖిత మాత్రమే.. ఈ ఇద్దరిలో దివ్యా నికిత లేదా రాము రాథోడ్ ఎలిమినేట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
బిగ్ బాస్ కార్యక్రమం విషయానికి వస్తే.. ఈసారి తెలుగులో 9వ సీజన్ నడుస్తోంది. 9 మంది సెలబ్రిటీలు, 6 మంది కామనర్స్ హౌస్ లోకి అడుగుపెట్టారు. వైల్డ్ కార్డు ద్వారా కామనర్ దివ్య నిఖిత మధ్యలో హౌస్ లోకి వచ్చింది. ఇప్పుడు వైల్డ్ కార్డు ద్వారా మరో 6 మంది కంటెస్టెంట్స్ హౌస్ లోకి అడుగుపెట్టారు. మొత్తానికైతే వైల్డ్ కార్డు ఎంట్రీలతో హౌస్ లో ఆట మరింత ఆసక్తిగా మారిందని చెప్పవచ్చు.
ALSO READ:Bigg Boss 9: అతడేమో నాన్న.. ఈమేమో అమ్మ.. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అవుట్!